Latest Updates
-
చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి! -
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026
ఈ ఏడాది ఈ రాశుల వారు ఎక్కువ డబ్బు ఆదా చేస్తారట...! మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి..!
ఈ రాశుల వారు 2021 సంవత్సరంలో ఎక్కువ డబ్బు ఆదా చేస్తారంట.
మనలో చాలా మందికి చాలా విషయాలపై నమ్మకం ఉంటుంది. కొంతమంది జాతకాలను, జ్యోతిష్యశాస్త్రాన్ని బాగా విశ్వసిస్తారు. అందుకే గ్రహాలు, రాశులను బట్టి తాము ప్రతిరోజూ ఏ పనులు చేయాలో.. చేయకూడదో చూసుకుంటారు.

అందుకే ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభంలో తమకు ఆర్థిక పరమైన విషయాల్లో ఏ విధంగా ఉంటుందో అని జాతకాలను చూసుకుంటారు. వాటిలో ముఖ్యంగా ఆదాయం గురించి ఎక్కువగా చూస్తుంటారు..

ఈ ఏడాదైనా నా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందా? నేను సంపాదించిన డబ్బు ఆదా చేయగలుగుతానా? నా ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటానా అని ఆలోచిస్తుంటారు.. మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశుల వారికి 2021 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆదాయం విషయంలో అద్భుతమైన ఫలితాలొస్తాయి..

వీరు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బును ఆదా చేస్తారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే 2021 ఆంగ్ల నూతన సంవత్సరంలో మీ రాశిని బట్టి మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే తెలుసుకోండి...

మేష రాశి..
ఈ రాశి వారు ఎల్లప్పుడూ కష్టపడి పనిచేయడాన్ని ఇష్టపడతారు. కాబట్టి వీరికి ఈ ఏడాది కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఈ ఏడాది మేషరాశి వారు స్థిరమైన ఆదాయాన్ని అందుకుంటారు. అయితే వీరికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి ఆదాయం విషయంలో విజయం సాధిస్తారు.

వృషభ రాశి..
ఈ రాశి వారు ఆంగ్ల నూతన సంవత్సరంలో కొంత ఘర్షణను ఎదుర్కోవలసి రావచ్చు. అయితే వీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ చిన్న పొరపాటు చేసినా పెద్ద గొడవలు కావచ్చు. మరోవైపు నిరుద్యోగులకు ఈ ఏడాది మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అయితే మీరు దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆదాయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి..
ఈ రాశి వారు ఈ ఏడాది ఎక్కువ డబ్బు సంపాదించాలనే పట్టుదలతో ఉంటారు. అందుకోసం వీరు చాలా కష్టపడతారు. వీరికి ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకుంటారు. చివరికి ఆర్థిక లక్ష్యాలను చేరుకుంటారు. వీరు ఎక్కువగా వ్యాపార ధోరణి కలిగి ఉంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు ఆంగ్ల నూతన సంవత్సరం 2021లో ఆదాయం విషయంలో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అనేక కష్టాలను ఎదుర్కొన్న తర్వాత వీరికి శుభప్రదమైన ఫలితాలు రావొచ్చు. దీంతో వీరికి కొంత ఉపశమనం లభిస్తుంది. మొత్తానికి ఆర్థిక పరమైన విషయాల్లో విజయాన్ని అందుకోగలుగుతారు.

సింహ రాశి..
ఈ రాశి వారు 2021 నూతన సంవత్సరంలో ఆదాయ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చిన్న పొరపాటు చేసినా భవిష్యత్తులో మీకు అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మాత్రం మీరు చాలా డబ్బును ఆదా చేయగలుగుతారు.

కన్య రాశి..
ఈ రాశి వారు కొత్త ఏడాదిలో ఏదైనా రంగంలో డబ్బును పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించారు. ఎందుకంటే మీ ప్రత్యర్థులు మీ ఆదాయాన్ని.. విజయాలను అడ్డుకునేందుకు ప్రయత్నించొచ్చు. అలాగే ఏదైనా పత్రాల మీద సంతకం పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసం జరిగే అవకాశం ఉంటుంది.

తుల రాశి..
ఈ రాశి వారు 2021 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆదాయాన్ని ఆదా చేసుకునేందుకు చాలా సమయం పోరాడాల్సి ఉంటుంది. అయితే 2021 సంవత్సరం వీరికి ఒక విజయవంతమైన ఏడాదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు ఈ సమయంలో చాలా డబ్బును ఆదా చేసేందుకు, ధనవంతులు అవ్వడానికి ఎన్నో అవకాశాలు పొందుతారు.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభంలో ఆదాయం విషయంలో కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని అక్రమాలు జరగడం వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు ఎక్కడ అనవసరంగా ఖర్చవుతుందో కనిపెట్టాలి.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఆదాయం విషయంలో అనేక అవకాశాలు వస్తాయి. అయితే మీరు ఇలాంటి అవకాశాలను తెలివిగా అంది పుచ్చుకుని, ఆర్థికంగా బాగుపడేందుకు కష్టపడాలి. ఈ ఏడాది మీరు ఎక్కువ డబ్బు ఆదా చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంది.

మకర రాశి..
ఈ రాశి వారు 2021 సంవత్సరంలో డబ్బును ఎలా ఆదా చేయాలో తెలుసుకోవడమే కాదు.. చాలా డబ్బును ఆదా చేయగలుగుతారు. అయితే వీరికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. అయితే వీరు వాటిన్నంటినీ అధిగమించి విజయవంతంగా ఎదుర్కొంటారు. చివరికి వీరు ఆశించిన లాభాలను అందుకుంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు 2021 కొత్త సంవత్సరంలో ఆదాయం విషయం చాలా తెలివిగా వ్యవహరించాలి. వీరికి డబ్బు విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. దీంతో వీరు కోరుకున్నంత డబ్బును ఈ సంవత్సరంలో ఆదా చేయగలుగుతారు.

మీన రాశి..
ఈ రాశి వారు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా మెరుగుదల సాధించాలంటే.. కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు డబ్బు ఆదా చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఎంతో కష్టపడి ఆదా చేసుకున్న డబ్బులను తెలియకుండా ఖర్చు పెట్టేసి ఏడాది చివరికి అప్పు చేసే పరిస్థితి రావచ్చు. అందుకే ఈ రాశి వారు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.



Click it and Unblock the Notifications