Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
ఈ రాశుల వారు ఎక్కువగా భయపడుతూ ఉంటారట...!
ఎక్కువగా భయపడే రాశిచక్రాల వివరాల గురించి తెలుగులో తెలుసుకుందాం
మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో భయపడుతూ ఉంటాం. అయితే అన్ని విషయాలకు మాత్రం అస్సలు భయపడం. ఒకవేళ భయం ఉన్నా కూడా పైకి గంభీరంగా, ధైర్యంగా కనిపించేందుకు ప్రయత్నిస్తాం.

అయితే కొందరు వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. ఏ సందర్భంలో అయినా ఊరికే బాధపడటం.. చాలా విషయాల్లో అభద్రతా భావంలోకి పడిపోవడం వంటివి చేస్తుంటారు. దీంతో వారు జీవితంలో ఏదీ సాధించలేరు. అందరి కంటే వెనుకపడిపోతారు. దీనంతటికి ప్రధాన కారణం వారిపై వారికి నమ్మకం లేకపోవడమే.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశి చక్రాల వారు ప్రతి చిన్న దానికి భయపడిపోతారట. ద్వాదశ రాశులలోని కేవలం ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువగా ఇలా ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారట. ఇంతకీ ఆ రాశి చక్రాలేవి? ఈ రాశుల వారు ఏయే పరిస్థితుల్లో అభద్రతా భావానికి గురవుతారు? అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కర్కాటక రాశి..
ఈ రాశి వారు చాలా సందర్భాల్లో అభద్రతా భావానికి లోనవుతారట. వీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారంటే.. వీరు చిన్నప్పటి నుంచే చాలా సున్నితంగా ఉంటారట. అందుకే ప్రతి చిన్న విషయానికి వీరు ఎక్కువగా ఫీలవ్వడం.. ఎక్కువగా ఇతరులపై ఆధారపడటం వంటివి చేస్తారట. అయితే వీరు చాలా విషయాల్లో కేర్ ఫుల్ గా ఉంటారట. అయితే మొత్తానికి వీరు చాలా ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారట.

కన్య రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో కరెక్టుగా ఉంటారు. వీరిలో మంచి నాయకత్వ లక్షణాలు కూడా ఉంటాయి. అయితే వీరికి కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి సందర్భంలో వీరు చాలా ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారట. ఎందుకంటే ఆ సమయంలో వీరిపై వీరికి నమ్మకం అనేది తగ్గిపోతుందట. దీంతో ఈ రాశి వారు తమను తాము తక్కువ అంచనా వేసుకుంటారు. వీరిపై వీరికే డౌట్ వస్తుందట. ఈ కారణంగా వీరు ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారట.

తుల రాశి..
ఈ రాశి వారు చూడటానికి ధైర్యంగా కనిపించినప్పటికీ.. ఏదైనా సమస్య వస్తే మాత్రం చాలా ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారట. ఎందుకంటే వీరికి నమ్మకం తక్కువగా ఉంటుదట. వీరు చాలా విషయాల్లో సిగ్గు పడుతూ ఉంటారట. అంతేకాదు వీరు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడటానికి కూడా ఇష్టపడరట. ఇతరులు వీరి గురించి ఏమనుకుంటారో అనే ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారట.

మకర రాశి..
ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదంతా వీరు వ్యక్తిగత జీవితంలో మాత్రమే. అదే ఇతర విషయాలకొస్తే మాత్రం వీరు చాలా ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారట. అయితే వీరి ఫీలింగ్స్ ను బయటకు కనబడకుండా కవర్ చేసుకుంటారట. ఇలా చేయడం వల్ల వీరు చాలా విషయాలకు భయపడాల్సి వస్తుందట. ఇతర నైపుణ్యాల పట్ల వీరు చాలా ఇన్ సెక్యూర్ గా ఫీలవుతారట.

మీన రాశి..
ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. అందుకే వీరు చాలా సందర్భాల్లో ఇతర వ్యక్తులు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేస్తుంటారు. వీరి గురించి వీరు ఏ మాత్రం ఆలోచించుకోరు. వీరి అవసరాల గురించి పెద్దగా పట్టించుకోరు. ఇతరుల ఇబ్బంది గురించి ఆలోచిస్తారు కానీ.. వీరి గురించి చూసుకోరు. ఇతరులు చెప్పిన విషయాలను కచ్చితంగా చేయాలనుకుంటారు. అయితే ఇలాంటి విషయాల్లో తప్ప వీరు మిగతా విషయాల్లో చాలా స్పష్టతతో ఉంటారు. కానీ మరోవైపు వీరు అభద్రతా భావానికి గురవుతారు. ఎప్పుడూ కూడా మీరు ఇతరులపై ఆధారపడటం.. ఇతరులు చెప్పే దానిని చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోలేరు. ఇతరులు చెప్పిన వాటినే ఫాలో అవుతారు.



Click it and Unblock the Notifications
