Latest Updates
-
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.!
Zodiac Signs:ఈ రాశుల వారికి అబద్ధం చెప్పడమంటే ‘హల్వా’తిన్నంత సులభమట...! ఇలాంటోళ్లతో జర భద్రం..!
ఈ రాశుల వారు నిజాన్ని దాచకుండా అస్సలు ఉండలేరట.
మనలో చాలా మంది ఎప్పుడూ ఏదో ఒక సందర్భంలో అబద్ధం అనేది చెబుతూ ఉంటాం. అయితే అదే పనిగా అబద్ధాలు అనేవి మాత్రం ఎవ్వరూ చెప్పరు. అలాగని అందరూ నిజాలు కూడా చెప్పరు.

అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు అబద్ధాలను హల్వా తిన్నంత ఈజీగా చెప్పేస్తారట. నిజాలను ఒప్పుకోవడం అంటే వీరికి చాలా కష్టంగా ఉంటుందట. కొన్నిసార్లు మనం నిజం చెప్పలేనప్పుడు అబద్ధం చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాం.

అయితే అలాంటి వారిని కనిపెట్టడం కాస్త కష్టమే. కానీ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశిచక్రాల ఆధారంగా అలాంటి వ్యక్తిత్వం ఉండే వ్యక్తులెవరో తెలుసుకోవచ్చట. ఇంతకీ అబద్ధాలను అవలీలగా చెప్పే రాశుల వారెవరూ.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో ఇప్పుడే తెలుసుకోండి...

వృషభ రాశి..
ఈ రాశి వారు వాస్తవాలను దూరంగా.. అసత్యాలకు అత్యంత దగ్గరగా ఉంటారు. అయితే నిజాలు చెబుతున్నట్టు చాలా సందర్భాలలో ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. వాస్తవానికి వీరికి నిజం గురించి ఏదీ తెలియదు. వీరు ఏదైనా కోరుకున్నారంటే.. దాన్ని పొందేందుకు ఎన్ని అబద్ధాలైనా అవలీలగా చెప్పేస్తారు.

మిధున రాశి..
ఈ రాశి వారు ఎక్కువగా అబద్ధాలు చెప్పరు. కానీ కఠినమైన వాస్తవాలు చెప్పడంలో మాత్రం కాస్త వెనకడుగు వేస్తారు. ఎందుకంటే అలాంటి వాటిలో నిజాలు చెబితే తాము ఆ పరిస్థితులకు బలైపోతామోననే భయంతో ఉంటారు. అందుకే ఇలాంటి వాటి కోసం కొత్త మార్గాలను కనుగొంటారు. అందుకే వీరికి నిజాలు చెప్పాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తులపై ఎల్లప్పుడూ అనుమానం పడుతూ ఉంటారు. అందుకే వీరు తమ గురించి చాలా సందర్భాలలో అబద్ధాలను చెబుతుంటారు. వీరికి విశ్వసనీయ సమస్యలు ఎక్కువ కావడం వల్ల వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. మరో విశేషమేమిటంటే.. వీరికి ఉన్న సందేహాల కారణంగా వాస్తవాలను అంత సులభంగా నమ్మరు. అయితే ఒక నిర్దిష్ట విషయం మాత్రం నిజం కాదు అనే దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు.

కన్య రాశి..
ఈ రాశుల వారు నిజాలను చెప్పడానికి చాలా భయపడతారు. ఒకవేళ నిజం చెబితే తమకు ఎలాంటి నష్టం వస్తుందోనని ఆందోళన చెందుతూ ఉంటారు. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి చాలా ఇబ్బంది పడతారు. అయితే ఎదుటివారు వినడానికి ఇష్టమైన, మధురమైన విషయాలు అబద్ధాలు అయినప్పటికీ వాటినే ఎక్కువగా చెప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ అవి తప్పని తేలితే వాటి నుండి దూరంగా వెళ్లిపోతారు.

తుల రాశి..
ఈ రాశి వారు అబద్ధాన్ని చెప్పేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా ఏవైనా ఖర్చులు చేసే సమయంలో, వీరు డబ్బుల విషయంలో అబద్ధమాడతారు. దీని వల్ల ఇతరులతో ఎక్కువగా గొడవలు కూడా పడుతూ ఉంటారు. వీరి గురించి పాజిటివ్ విషయమేమిటంటే.. ఇతరులను ఎవ్వరినీ బాధపెట్టకూడదు అనే ఉద్దేశ్యంతో వీరు అబద్ధం చెప్పడానికి ఇష్టపడతారు. అదే సమయంలో వాస్తవాలను దాచి పెట్టేందుకు కూడా వెనుకాడరు.

మీన రాశి..
ఈ రాశి వ్యక్తులు తమ జీవితంలోని కఠినమైన వాస్తవాలకు చాలా దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు ఇలాంటి విషయాల్లో కష్టపడుతూ ఉంటారట. నిజాన్ని నిర్భయంగా చెప్పడం అంటే వీరికి చాలా కష్టమైన పని. అందుకే వీరు ఎల్లప్పుడూ అబద్ధాల గురించి ఆలోచించడాన్ని మరియు అలాంటి విషయాలను చెప్పడాన్నే ఇష్టపడతారు. తమకు సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం పాటు ఇదే పద్ధతిని కొనసాగించేందుకు ఆసక్తి చూపుతారు.



Click it and Unblock the Notifications
