Latest Updates
-
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు! -
ఏప్రిల్ 27 రాజయోగం: ఈ రాశుల వారికి ధన యోగం.. ఇక తిరుగులేదు! -
ఈ చేప మగాళ్లకు సర్వరోగ నివారిణి..ఒకేసారి బలం,ఓపిక వచ్చేస్తుంది! -
రాఘవ్ చద్దా స్పెషల్ మ్యాంగో షేక్.. ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకోండిలా..బరువు పెరిగే టెన్షన్ లేదు!
Zodiac Signs:ఈ రాశుల వారు లగ్జరీ లైఫ్ నే కోరుకుంటారట...! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో ఇప్పుడే చూసెయ్యడి...!
ఈ రాశుల వారు ఎప్పుడూ లగ్జరీ వస్తువులనే కొంటుంటారు.
మన దేశంలో చాలా మంది మధ్యతరగతి కుటుంబాల వారే. అందుకే వారి జీవనశైలి(Life Style) చాలా సింపుల్ గా ఉంటుంది.

వారు కూడా ఉన్న దాంట్లో సర్దుకుపోతూ ఉంటారు. అయితే కొందరు మాత్రం అందరిలా సింపుల్ గా కాకుండా, చాలా రిచ్ గా, విలాసవంతంగా, లగ్జరీ లైఫ్ గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు.

అయితే ఉన్నదాంట్లో సర్దుకుపోయి.. సౌకర్యవంతంగా, హాయిగా జీవించాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే కొందరు మాత్రం తమ పరిమితికి మించి ఖర్చులు చేస్తుంటారు. ఆడంబరాలకు పోయి.. అనేక ఇబ్బందులను కొనితెచ్చుకుంటారు. ఇలాంటి వ్యక్తులకు ఎల్లప్పుడూ ఖరీదైన మరియు విలాసవంతమైన వస్తువులపైనే కన్ను పడుతుంది. అలాంటి వ్యక్తులెవరో జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తెలుసుకోవచ్చు.

ద్వాదశ రాశులలోని ఏడు రాశుల వారు ఇలా ఖరీదైన వాటిని విక్రయించేందుకు ఇష్టపడతారు. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి...

వృషభ రాశి..
ఈ రాశి వారు వేసుకునే బట్టలు, షూస్ లేదా పుస్తకాలతో పాటు ఎలాంటి వాటినైనా ఖరీదైనవి తీసుకోవాలని.. వాటి గురించే ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా రెస్టారెంటుకు వెళ్లిన సమయంలో కూడా మెనూ కార్డులో ఏదైనా ఎక్కువ ధర ఉంటుందో దాన్నే ఆర్డర్ చేస్తారు. వాటిలో తక్కువ ధర ఉంటే.. కనీసం దానివైపు చూడటానికి కూడా ఇష్టపడరు. ఇక బహుమతుల విషయంలో అదే స్వభావమే.

మిధున రాశి..
ఈ రాశి వారు తమ లైఫ్ ను చాలా లగ్జరీగా మెయింటెన్ చేయాలని భావిస్తారు. వీరికి ఏదైనా వస్తువు నచ్చితే చాలు.. అది ఎంత ఖరీదైనా, దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దాన్ని తమ వశం చేసుకునేందుకు ఎంతైనా ఖర్చు చేస్తారు. ఈ రాశి వారికి డబ్బు ఆదా చేయడం కూడా చాలా బాగా తెలుసు. వీరు పేదలకు కూడా ఆర్థిక సహాయం చేస్తారు.

సింహ రాశి..
ఈ రాశి వారు విలాసవంత జీవితం గడపడంలో.. ఖరీదైన వస్తువులను ఇష్టపడటం రెండో స్థానంలో ఉంటారు. వీరు తమ కోసం ఎక్కువగా ఖర్చు చేయడంతో పాటు ఇతరుల కోసం కూడా విచ్చలవిడిగి డబ్బు ఖర్చు చేస్తారు. అక్కడితో ఆగకుండా ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చేస్తారు. వీరు ఆదాయం గురించి అంతగా ఆలోచించరు. ఎందుకంటే వీరు ఖర్చు చేయడంలోనే కాదు.. ఆదాయం సంపాదించడంలోనూ అందరి కంటే ఒకడుగు ముందే ఉంటారు.

తుల రాశి..
ఈ రాశి వారు ఖరీదైన వస్తువులను సెలెక్ట్ చేసుకోవడంలో ముందుంటారు. అయితే వీరు ఆదాయం, ఖర్చుల విషయంలో బ్యాలెన్స్ గా ఉంటారు. అందుకే వీరు అందరితోనూ సమానంగా సంబంధాలను కొనసాగిస్తారు. అలాగే ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ముందడుగు వేస్తారు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు లగ్జరీ వస్తువుల విషయంలో ఏ మాత్రం రాజీ పడరు. మరోవైపు వీరు తమ చేతిలో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలని ఆశిస్తారు. అందుకే వీరు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించగలుగుతారు. అయితే అదే రీతిలో ఖర్చులు కూడా పెడతారు. వీరు ఏ జర్నీ చేసినా చాలా ఫస్ట్ క్లాస్ గా చేయాలని భావిస్తారు. బంధువుల కోసం ఈ రాశి వారు విపరీతంగా ఖర్చు చేస్తారు. అందుకే వీరు లగ్జరీ లైఫ్ గడిపేందుకు బాగా ఇష్టపడతారు.

మకర రాశి..
ఈ రాశి వారికి కష్టపడి పని చేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అయితే అదే సమయంలో వీరు ఖర్చుల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు. మరీ ముఖ్యంగా ఏదైనా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడంలో వెనుకడుగు అనేదే వేయరు. అయితే తాము తీసుకునే వస్తువులు నిజంగా ఖరీదైనవా కాదా అనే విషయాలను పూర్తిగా పరిశీలిస్తారు. అందుకే అలాంటి వస్తువుల గురించి ఒకటికి రెండు సార్లు ఆరా తీస్తారు. అలాగే ఆ వస్తువుల వివరాలను ఆన్ లైనులో తెలుసుకుని మరీ విక్రయిస్తూ ఉంటారు.

కుంభ రాశి..
ఈ రాశి వారు ఐఫోన్, వన్ ప్లస్ వంటి ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కొనుగోలు చేయడాన్ని ఇష్టపడతారు. మార్కెట్లోకి ఏదైనా కొత్త ఫోన్ విడుదల అయ్యిందంటే చాలు.. వాటిని వెంటనే ఆర్డర్ చేస్తారు. అయితే వీరు ఆదాయం పెంచుకోవడంపైనా ఎక్కువ శ్రద్ధ చూపుతారు. అదే సమయంలో ఖర్చులను కూడా అలాగే చేసేస్తారు.



Click it and Unblock the Notifications