Latest Updates
-
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి?
పూరీ జగన్నాథుడి రథయాత్రకు వెళ్తున్నారా.. సమీపంలోని ఈ ప్రాంతాలను తప్పక చూడాల్సిందే.!
ఒడిశాలో పూరీ జగన్నాథ్ రథయాత్ర జులై 16న ప్రారంభం కానుంది. జగన్నాథుడి రథయాత్రను తిలకించేందుకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు తరలివస్తుంటారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల దర్శనార్థం భక్తుల రద్దీతో రోడ్లన్నీ భక్తి పారవశ్యంతో పులకించిపోతుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి సైతం పూరీకి బయలుదేరుతుంటారు. ఇక పూరీ యాత్రకి వెళ్లేవారు జగన్నాథుడి దర్శనంతో పాటు సమీపంలో అందమైన, ఆధ్యాత్మిక ప్రాంతాలు ఉన్నాయి. మీరూ వెళ్తున్నట్లయితే సమీపంలోని ప్రపంచ వారసత్వ జాబితాల వివరాలు మీకోసం..

సహజసిద్ధమైన సౌందర్యం, సముద్ర తీరాలు, చారిత్రక వారసత్వం, కళలు, సంస్కృతి మేళవింపుతో పూరీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జగన్నాథుడి ఆలయానికి సమీపంలో ఆధ్యాత్మికతను మరింత పెంచే ప్రాంతాలు ఉన్నాయి. ఈ యాత్రను కేవలం ఆలయ సందర్శనకు మాత్రమే కాకుండా మరింత మెమరబుల్‌గా మార్చుకోండి. ఆధ్యాత్మికంగానే కాకుండా కుటుంబంతో కలిసి సరదాగా సేదతీరడానికి ఇక్కడ ఎన్నో అందమైన ప్రాంతాలు ఉన్నాయి.
గుండిచా ఆలయం
పూరీ జగన్నాథుని మేనత్త ఇల్లుగా పురాణాలు పేర్కొంటున్న గుడించా ఆలయం పూరీకి చాలా సమీపంలో ఉంటుంది. జగన్నాథ థామ్ నుంచి 3 కి.మీ ప్రయాణిస్తే ఇక్కడికి చేరుకోవచ్చు. రథయాత్ర సమయంలో జగన్నాథ స్వామి ఇక్కడ విశ్రమిస్తారని చెప్పుకొంటారు.

కోణార్క్ సూర్య టెంపుల్
పూరీ నుంచి 36 కి.మీ దూరంలో కోణార్క్ సూర్య దేవాలయం ఉంది. ఇక్కడికి మీరు మెరైన్ డ్రైవ్ ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రాచీన కాలం నాటి వాస్తుతో కూడిన శిల్ప కళ, ఇంజినీరింగ్ నైపుణ్యం, ఆస్ట్రానమీ మిమ్మల్ని ఎంతగానో అబ్బురపరుస్తుంది. కోణార్క్ ఆలయంలోకి సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో పడే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం ఇంజినీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ఏడు శక్తివంతమైన గుర్రాలు సూర్యరథాన్ని లాగే ఆకారంలో నిర్మించిన ఈ ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. పూరీకి వెళ్లేవారు ఈ ప్రాంతాన్ని తప్పనిసరిగా చూడాలి.
చిలికా సరస్సు
ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పేరుగాంచిన చిలికా సరస్సు. కాళీ మాత ఆలయం ఈ సరస్సు మధ్యలో ఉన్న ద్వీపంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడికి వెళ్తే డాల్ఫిన్లను చూడవచ్చు. బోట్ ప్రయాణం ఇక్కడ తప్పనిసరిగా చేయాల్సిందే.

గోల్డెన్ బీచ్
పూరీ జగన్నాథ ఆలయం నుంచి సుమారు 2 కి.మీ దూరంలో గోల్డెన్ బీచ్ ఉంది. ఇక్కడి ఆటో లేదా సొంత వాహనంలో సులభంగా చేరుకోవచ్చు. అలరించే సముద్రపు అలలు, పరిశుభ్రమైన వాతావరణం ఎంతగానో ఆకట్టుకుంటాయి. సూర్యోదయ, సూర్యాస్తమయ దృశ్యాలు ఈ బీచ్‌లో మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందిస్తాయి.
రఘురాజ్‌పూర్ హెరిటేజ్ విలేజ్
ఒడిశాలోని రఘురాజ్‌పూర్ హెరిటేజ్ విలేజ్ అక్కడి సాంప్రదాయానికి ప్రతీక. పూరీ నుంచి 14 కి.మీ దూరంలో ఉంది. పటచిత్ర కళతో పాటు సాంప్రదాయ ఒడిస్సీ సంస్కృతికి అద్దం పడుతుంది. పటచిత్ర చిత్రలేఖనాలు, తాళపత్ర శిల్పాలు, ఒడిస్సీ నృత్యానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందినదిగా చరిత్ర చెబుతోంది. ఇక్కడికి పర్యాటకులు విశేష సంఖ్యలో వస్తుంటారు. ఈ ఊర్లోని ప్రతి ఇంట్లో ఒక కళాకారుడు ఉండటం విశేషం. ఒడిశా మొదటి వారసత్వ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. పూరీ పర్యాటకులు ఈ గ్రామాన్ని వీక్షిస్తే కొత్త అనుభూతులను పొందుతారనడంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications
