Latest Updates
-
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏ టైంకి తింటున్నారు? ప్రాణగండం ఉంది జాగ్రత్త!
సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తినాలో అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాం. అయితే ఏ టైంకి తినాలో అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోము. కానీ మీరు రోజూ బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ ఏ సమయానికి చేస్తున్నారనే దానిపైనే మీ ప్రాణగండం ఆధారపడి ఉందని యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం హెచ్చరిస్తోంది.
అమెరికాలో 40 ఏళ్లు పైబడిన 31,044 మందిపై దాదాపు ఎనిమిదిన్నరేళ్ల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ పరిశోధనలో ఎన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బ్రేక్ ఫాస్ట్ లేట్ చేస్తున్నారా?
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ ఎంత లేట్ గా చేస్తే, ప్రాణగండం అంత పెరుగుతుందని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య ఎక్కువ కేలరీలు ఉండే మొదటి భోజనం చేయడం ఆరోగ్యానికి అత్యుత్తమం.
ఒకవేళ మీరు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య తింటే మరణాల ముప్పు 10 శాతం, 10 నుంచి 12 గంటల మధ్య తింటే ఏకంగా 19 శాతం పెరుగుతుందట.
ఇక కొందరు మధ్యాహ్నం 12 గంటల తర్వాతే మొదటి భోజనం చేస్తుంటారు. ఇలాంటి వారిలో మరణించే ప్రమాదం 29 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇలా చేసే 50 ఏళ్ల వయస్కుల ఆయుర్దాయం సగటున రెండున్నరేళ్లు (2.46 సంవత్సరాలు) తగ్గిపోవడం గమనార్హం.
డిన్నర్ కు సరైన టైమ్ ఇదే!
అర్ధరాత్రి దాటాక లేదా బాగా ఆలస్యంగా డిన్నర్ చేసేవారికి మరణాల ముప్పు 27 శాతం ఎక్కువగా ఉంటుందని, వీరి ఆయుష్షు కూడా 2.35 ఏళ్లు తగ్గుతుందని స్టడీ తెలిపింది. అలాగని బాగా పెందలాడే (రాత్రి 7 గంటలలోపే) భోజనం ముగించినా 13 శాతం ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు అంటున్నారు. ఈ లెక్కన రాత్రి భోజనానికి అత్యంత అనువైన సమయం రాత్రి 8 గంటలు. ఈ సమయానికి తినేవారిలోనే ముప్పు అతి తక్కువగా ఉన్నట్లు తేలింది.
మరి కేవలం సమయం పాటిస్తే సరిపోతుందా?
ఆలస్యంగా తినడం వల్లే ఆయుష్షు తగ్గిపోతుందని ఈ స్టడీ నేరుగా నిర్ధారించడం లేదు. సమయానికి, ఆయుష్షుకి మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే ఇది వివరిస్తోంది. కేవలం కరెక్ట్ టైమ్ కి తిన్నంత మాత్రాన ఆయుష్షు పెరిగిపోదు. దానికి తోడు మీ జీవనశైలి కూడా బాగుండాలి.
సరైన సమయానికి తిన్నప్పటికీ... ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉన్నా, వ్యాయామం చేయకపోయినా, జంక్ ఫుడ్ తింటూ అధిక బరువుతో ఉన్నా, ముందే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా సమయానికి తినడం వల్ల వచ్చే ప్రయోజనం ఏం ఉండదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
