Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రాఖీ ఏ టైంలో కట్టాలి? ఎన్ని ముడులు వేయాలి? ఎప్పుడు తీసేయాలి?..శాస్త్ర నియమాలివే
దేశవ్యాప్తంగా ఇవాళ(ఆగస్టు 9,2025) రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. చెల్లెల్లు తమ అన్నలకు,తమ శ్రేయోభిలాషులకు రాఖీలు కడుతున్నారు. రక్షా బంధన్.. కేవలం ఒక పండుగ కాదు, అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న స్వచ్మైన ప్రేమకు, పవిత్రమైన బంధానికి అద్దం పట్టే ఓ అపురూపమైన వేడుక. ఇది ప్రేమ, ఆప్యాయత, రక్షణ అనే మూడు అపురూపమైన భావాల కలబోత. ఈ పవిత్రమైన రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు ప్రేమగా రాఖీ కట్టి, అతని ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను మనసారా కాంక్షిస్తుంది. ప్రతిగా ఆ సోదరుడు తన జీవితాంతం ఆమెకు రక్షణగా, అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు.
అయితే సోదరి ప్రేమగా కట్టిన ఆ రాఖీని ఎప్పుడు తీసివేయాలి? కొన్ని రోజుల పాటు ఉంచుకోవాలా లేక వెంటనే తీసేయవచ్చా? అసలు రాఖీకి ఎన్ని ముడులు వేయాలి, దానికోసం ఏమైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయా? చాలామంది సోదరులు తమ సోదరి ప్రేమకు గుర్తుగా రాఖీని ఏడాది పొడవునా ఉంచుకున్నా, శాస్త్రాలు దీని గురించి ఏమి చెబుతున్నాయో తెలుసుకుందాం.

రాఖీ కట్టించుకోడానికి మంచి సమయం
ఈ రోజు ఉదయం 5:24 నుండి మధ్యాహ్నం 1:24 వరకు సోదరుడికి రాఖీ కట్టడానికి అత్యంత శుభప్రదమైన సమయం.
రాఖీని ఎప్పటివరకు ఉంచుకోవాలి?
శాస్త్రాల ప్రకారం రాఖీ కేవలం ఒక అలంకార దారం కాదు, అది ఒక శక్తివంతమైన రక్షణ కవచం. లక్ష్మీదేవి బలి చక్రవర్తికి కట్టిన రక్షాబంధనం నుండే ఈ సంప్రదాయం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. మణికట్టుకు కట్టిన రాఖీ లేదా పవిత్రమైన దారంలో ఐదు రోజుల పాటు శక్తి పెరుగుతూ 11వ రోజు వరకు ఆ సానుకూల శక్తి నిలిచి ఉంటుందని నమ్మకం. అందుకే రాఖీ కట్టిన తర్వాత కనీసం 24 గంటల నుండి గరిష్టంగా 15 రోజుల లోపు దానిని మణికట్టు మీద ఉంచుకోవడం ఉత్తమం. ఆ తర్వాత దానిని గౌరవంగా తీసి పారే నీటిలో లేదా ఏదైనా పవిత్రమైన చెట్టు మొదట్లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ దారంలోని దివ్యశక్తి ప్రకృతిలో కలిసిపోతుంది.
రాఖీకి ఎన్ని ముడులు వేయాలి? ప్రతి ముడి వెనుక అర్థం
రాఖీ కట్టేటప్పుడు ముడుల సంఖ్యకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సంప్రదాయం ప్రకారం నాలుగు ముడులు వేయడం అత్యంత శుభప్రదం. ప్రతి ముడి ఒక ప్రత్యేక ప్రార్థనకు ప్రతీక.

మొదటి ముడి: సోదరుడి దీర్ఘాయుష్షు కోసం, అతను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ వేస్తారు.
రెండవ ముడి: రాఖీ కడుతున్న సోదరి కూడా నిండు జీవితాన్ని, సుఖసంతోషాలను పొందాలని ఆకాంక్షిస్తూ వేస్తారు. ఇది పరస్పర శ్రేయస్సును కోరుకోవడాన్ని సూచిస్తుంది.
మూడవ ముడి: అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న ఈ పవిత్ర బంధం, ప్రేమ ఎప్పటికీ చెక్కుచెదరకుండా కలకాలం నిలవాలని ప్రార్థిస్తూ వేస్తారు.
నాల్గవ ముడి: తమ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ, ఆ దైవం తన సోదరుడికి ఎల్లవేళలా అండగా ఉండి, అన్ని ఆపదల నుండి కాపాడి, అతని కోరికలన్నీ నెరవేర్చాలని మనసారా వేడుకుంటూ వేస్తారు.
ఈ నాలుగు ముడులతో కట్టిన రాఖీ ఒక సాధారణ దారంలా కాకుండా ఒక దివ్యమైన రక్షణ కవచంగా మారి సోదరుడిని కాపాడుతుందని ప్రగాఢ విశ్వాసం.



Click it and Unblock the Notifications