Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Real Story Of Purandeswari: భర్త చనిపోయినా.. 30 వేలతో రెండు బిజినెస్ స్టార్ట్ చేసి లక్షల్లో సంపాదిస్తున్న మహిళ
ఈ సృష్టికి మూలం ఆడది అంటారు. అలాంటి ఆడది తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏది ఉండదు. ఎంతో మంది ఆడవాళ్ళు గొప్ప గొప్ప విజయాలను సాధించి చరిత్రపుటల్లో నిలిచిన విషయం తెలిసిందే. వారంతా ఇప్పటికీ ఎంతో మందిని స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అయితే కేవలం పుస్తకాల్లో, చరిత్రల్లో ఉన్న మహిళలే కాకుండా.. ఎంతో మంది సాధారణ మహిళలు తమ జీవితంలో ఎన్నో దారిద్య్రాన్ని చూసి గొప్ప గొప్ప శిఖరాలను అందుకున్నారు. అలాంటి ఓ మహిళ గురించే మనం ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆ మహిళ ఎవరంటే?
ఆమె ఓ సాధారణ భారతదేశంలో గృహిణి. ఆమె పేరు పురంధేశ్వరి. ఆమెది తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా ఛివ్వేంల మండలంలోని ఓ చిన్న పల్లెటూరు. అంత మారుమూల గ్రామంలో పుట్టిన ఆవిడ.. చిన్న వయసులోనే భర్త చనిపోయినా తన సంకల్పంతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఇప్పుడు రెండు రకాల బిజినెస్ చేస్తూనే, వ్యవసాయంలో రాణిస్తూ, ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉంటున్నారు. తను ఆదాయం పొందడమే కాకుండా నలుగురికి పనులు కల్పిస్తూ ఆదాయం పంచుతున్నారు.

పురంధేశ్వరి తన చిన్న తనంలోనే తన భర్తను కోల్పోయారు. పురంధేశ్వరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు పెళ్లి అయిన తరువాత భర్త చనిపోయాడు. అప్పటికి వారిది చాలా పేద కుటుంబం. భర్త చనిపోయే సమయానికి కొంత అప్పు కూడా ఉండేది. కేవలం పెద్ద కూతురు పెళ్లి మాత్రమే అయ్యింది. ఆ స్థితిలో పురంధేశ్వరికి ఏం చేయాలో తోచలేదు. ఎలా కుటుంబాన్ని ముందుకు నడపాలో తోచలేదు. కానీ మనసుకు తనకు తానే ధైర్యం చెప్పుకుంది. అప్పుడే నిర్ణయించుకుంది తాను సాధించే విజయం ఇలా ఇంకొకరు రాసేలా ఉండాలని. దానివైపు అడుగులు వేయసాగింది.
కేవలం 14 సంవత్సరాలలోనే రెండు బిజినెస్ వెంచర్లు ప్రారంభించి, వ్యవసాయం చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పిస్తూ తను అనుకున్న విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ విజయాన్ని సొంతం చేసుకోవడానికి పురంధేశ్వరి చాలానే కష్టపడ్డారు. ఎన్నో మాటలు పడ్డారు. ఎంతో శ్రమించారు. ఎంతో కష్టాలను అనుభవించారు. కానీ చివరికి విజయం సాధించారు.
ఆమె ఎలా విజయం సాధించారో పురంధేశ్వరి మాటల్లో
తాను ఇప్పుడున్న స్థానానికి చేరుకోవటానికి చాలా కష్టపడ్డానని పురంధేశ్వరి తెలిపారు. "నా భర్త చనిపోయినప్పుడు మాకు అప్పు ఉండేది. అది తీర్చడంతో పాటు నాతో పాటు ఉన్న ఇద్దరు పిల్లలను చదించడం నాకు చాలా కష్టంగా మారింది. అలాగే పెళ్లి చేసిన పెద్ద కూతురి బాగోగులు చూసుకోవడం కూడా తలకు మించిన భారం అయ్యింది. అదంతా దృష్టిలో పెట్టుకొని కష్టపడడం మొదలు పెట్టాను. మొదటగా మాకున్న ఆవులను అమ్మేసి కొంత అప్పు తీర్చేశాను. ఆ తరువాత రోజువారీ కూలికి పోవడంతో పాటు మాకున్న పొలంలో పంట చూసుకున్నారు.
ఇలా సంవత్సరం తిరగగానే అప్పు తీర్చేశాను. అలాగే కొంత డబ్బు కూడా కూడగట్టుకున్నాను. అయితే ఆ డబ్బు నాకేమి సరిపోలేదు. ఎక్కువగా కూలి పనులకు వెళ్తుండడంతో కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చి, కూడా గట్టుకున్న డబ్బంతా ఆసుపత్రి పాలయ్యింది. ఆ తరువాత తేరుకున్నాక మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేశాను. కానీ ఈసారి తనకు అప్పు బాధ లేకపోవడం వలన సంపాదించిన డబ్బంతా కూడగట్టుకోగలిగాను. ఈ క్రమంలోనే పెద్ద కూతురికి మొదటి కాన్పు చేయించాను.
ఇలా రోజులు గడుస్తున్నాయి. చిన్న పాప కూడా పెళ్లీడుకి వచ్చింది. దీంతో ఆమెను పెళ్లి చేయడానికి నా దగ్గరున్న డబ్బు సరిపోలేదు. ఆమెకు మంచి నగలు కొనివ్వడానికి మాకున్న భూమిలో 15 గుంటలు అమ్మేసి పెళ్లి చేశాను. నేను సక్సెస్ అయ్యే క్రమంలో నేను రెండోసారి కూడా జీరో అయ్యాను. కానీ ఈసారి నామీద భారం ఎక్కువయ్యింది. ఎందుకంటే కొడుకు ఉన్నత చదువులకు వెళ్తున్నాడు. వాడి ఖర్చు కూడా నేనే భరించాల్సి వస్తుంది. ఈ క్రమంలో నేను కొంత వెనకబడ్డాను. కానీ నా కొడుకు గ్రాడ్యుయేట్ అయ్యాడు. అలానే దేవుడి పుణ్యమాని వాడికి ఒక చిన్న ఉద్యోగం కూడా వచ్చింది. నా సంపాదనకు వాడి గోరంత సంపాదన కూడా తోడయ్యింది.
ఇద్దరం చేయి చేయి కలుపుకొని.. ఆరు సంవత్సరాల తరువాత ఒక హార్వెస్టర్ కొన్నాము. దానిని నా కొడుకు, డ్రైవర్‌ను పెట్టించి నడిపించాడు. అందులో తాము పెట్టిన పెట్టుబడి తిరిగి కొంత వచ్చాకా.. ఇటీవలే బేకరీ స్టార్ట్ చేశాము. రెండు వైపులా నా ఆదాయం వస్తుంది. నలుగురికి పని ఇవ్వగలుగుతున్నాను. నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని, నా వ్యవసాయాన్ని చూసుకుంటూ ఆనందంగా రోజులు గడుపుతున్నాను. అనుకున్న కార్యం నెరవేరే వరకు విశ్రమించొద్దని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను''



Click it and Unblock the Notifications