Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
Panchayat 4's Rinki: పంచాయత్ సిరీస్ లో 'రింకీ'..తెరవెనుక ఈ అమ్మడు కథే వేరు ఉందిగా..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో సంచలనం సృష్టిస్తున్న 'పంచాయత్' వెబ్ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2020 ఏప్రిల్ 3వ తేదీన రిలీజ్ అయిన పంచాయత్ సీజన్ 1 వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సిరీస్ కి చాలా ఆదరణ లభించింది. సీజన్ 1 సూపర్ హిట్ అవడంతో తర్వాత వరుసగా సీజన్ 2, సీజన్ 3 కూడా వచ్చి మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇటీవల పంచాయత్ సీరిస్ లో సీజన్ 4 రిలీజ్ అయింది. ఫులేరా గ్రామంలోని అమాయకపు రాజకీయాలు, స్వచ్ఛమైన సంబంధాలు, సహజమైన సంభాషణలతో ఈ సిరీస్ అశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని.. ఐదవ సీజన్ కోసం అందరినీ ఎదురుచూసేలా చేస్తోంది. ఈ సిరీస్ లో సచివ్ జీ, ప్రధాన్ జీ ఎంత ఫేమస్ అయ్యారో ప్రధాన్ జీ కూతురు రింకి కూడా అంతే స్థాయిలో అందరి మనసుల్లో స్థానం సంపాదించుకుంది.
ఈ రింకి ఎవరు? ఆమె అసలు కథేంటి?
పంచాయత్ సిరీస్ లో రింకి పాత్రను పోషించిన నటి పేరు సాన్వికా. ఈ పాత్ర ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే నాలుగో సీజన్ చిత్రీకరణ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సచివ్ జీ, రింకి మధ్య కారులో ఒక ముద్దు సీన్ ని డైరక్టర్ ప్లాన్ చేశారు. ఈ విషయం సాన్వికాకు చెప్పినప్పుడు ఆమె వెంటనే ఒప్పుకోలేదు. చాలాసేపు ఆలోచించి ఎంతో ధైర్యంగా ఆ సన్నివేశంలో నటించడానికి నిరాకరించింది. తెరపై అలాంటి సన్నివేశంలో నటించడం తనకు సౌకర్యంగా లేదని, ప్రేక్షకులు ఏమనుకుంటారోనన్న ఆందోళన తనను ఆ నిర్ణయం వైపు నడిపించిందని సాన్వికా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించిన డైరక్టర్ ఆ కిస్ సీన్ ని స్క్రిప్ట్ నుండి తీసేసి దాని స్థానంలో ఒక అద్భుతమైన ట్యాంక్ సన్నివేశాన్ని చేర్చారు. ఇప్పుడు ఆ సీన్ చాలా పెద్ద హిట్టయ్యింది. సీజన్ 4 సిరీస్ చూస్తే ఈ సీన్ గురించి మీకు అర్థమవుతుంది.

ఇంజనీర్ నుండి నటిగా మారిన
రింకిగా మనల్ని అలరిస్తున్న సాన్వికా అసలు పేరు పూజా సింగ్. ఆమె ఉన్నత చదువులు చదివిన ఇంజనీరింగ్ విద్యార్థిని. ఇంజనీరింగ్ పట్టా చేతిలో ఉన్నా ఆమె మనసు మాత్రం నటన వైపే లాగింది. తన కలను సాకారం చేసుకోవడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులకు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నానని చెప్ప, తన కలల ప్రపంచమైన నటన కోసం ముంబైలో అడుగుపెట్టింది. అక్కడ ఎన్నో కష్టాలు పడి చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
పంచాయత్ ముందు ఆమె కెరీర్
పంచాయత్ ఆమెకు రాత్రికి రాత్రే వచ్చిన విజయం కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. హజామత్, లఖన్ లీలా భార్గవ వంటి సిరీసుల్లో నటించినా రాని గుర్తింపు పంచాయత్ రింకి పాత్రతో వచ్చింది. ఈ ఒక్క పాత్రతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది.
నిజ జీవితంలోనూ నిరాడంబరతే
తెరపై ఎంత నిరాడంబరంగా కనిపిస్తుందో నిజ జీవితంలోనూ సాన్వికా అంతే సింప్లిసిటీని ఇష్టపడుతుంది. ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామరస్ ఫోటోలు కూడా షేర్ చేయదు. అయినప్పటికీ ఆమె సహజ సౌందర్యం, నటన పట్ల ఆమెకున్న నిబద్ధత ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టాయి. తన విలువలకే కట్టుబడి అనవసరమైన గ్లామర్ కు దూరంగా ఉంటూ, కేవలం నటనతోనే అభిమానులను సంపాదించుకుంటున్న సాన్వికా నేటి యువతకు ఒక స్ఫూర్తిగా నిలిచింది.



Click it and Unblock the Notifications
