Latest Updates
-
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.? -
భక్తులకు అలర్ట్.. పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. రద్దీలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి.? -
రోజూ 20 నిమిషాలు చాలు.. ఈ సింపుల్ యోగాసనాలతో మీ రోజు మారిపోతుంది.!
Shocking: పార్కింగ్ సినిమా సీన్ రిపీట్..ప్రాణాలు కోల్పోయిన సైంటిస్ట్
ఈ రోజుల్లో నగరాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో పార్కింగ్ ప్రధానమైనది. ఒక్కో ఫ్యామిలీకి రెండు మూడు వాహనాలు ఉంటున్నాయి. అయితే పెట్టడానికి ప్లేస్ మాత్రం ఉండట్లేదు. దీంతో పార్కింగ్ కూడా పెద్ద బిజినెస్ గా మారిపోయింది. కొన్ని అపార్ట్ మెంట్ల దగ్గర వాచ్ మెన్ లు వాహనదారుల దగ్గర నెలకు కొంత డబ్బులు తీసుకొని వారి వాహనాలను అక్కడ పార్క్ చేసేందుకు అనుమతిస్తున్నారు. ఓ వైపు పెరిగిన ఆయిల్ ధరలు, చాలీచాలని జీతంతో కష్టాలు ఈదుతుండే సామాన్యులు ఈ పార్కింగ్ కోసం నెల నెలా భారీగానే ఖర్చు చేయాల్సి వస్తోంది.
మీ అందరికీ 'పార్కింగ్'సినిమా గుర్తు ఉందా? 2013లో రిలీజ్ అయిన ఈ తమిళ సినిమాలో సిటీలో పార్కింగ్ కష్టాల గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. పార్కింగ్ వివాదాలు..వైలెన్స్ గా మారిన ఘటనలు గతంలో చాలానే చూశాం. అయితే తాజాగా పార్కింగ్ ఇష్యూ ఓ సైంటిస్ట్ ప్రాణం తీసింది. ఈ విషాధ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో మంగళవారం(మార్చి11) రాత్రి జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ కు చెందిన డాక్టర్ అభిషేక్ సర్ణకార్(39)ప్రముఖ సైంటిస్ట్. అనేక ఇంటర్నేషనల్ జర్నల్స్ లో అభిషేక్ వర్క్ గురించి రాయబడింది.

స్విట్టర్జాండ్ లో సైంటిస్ట్ గా పనిచేసి ఇటీవల భారత్ కు తిరిగివచ్చారు అభిషేక్. పంజాబ్ లోని మొహాలీలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(IISER)ప్రాజెక్ట్ సైంటిస్ట్ గా చేశారు. ఇదే సమయంలో అభిషేక్ కుటుంబసభ్యులు కూడా మొహాలీ వచ్చారు. మొహాలీలోని సెక్టార్ 67లో డాక్టర్ అభిషేక్ సర్ణకార్..ఓ ఇల్లు అద్దెకు తీసుకొని తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి సమయంలో అభిషేక్ కి,అతని పొరుగింట్లో నివసించే మాంటీ(Monty)అనే వ్యక్తికి బైక్ పార్కింగ్ విషయమై గొడవ జరిగింది.
సీసీటీవీల్లో రికార్డైన ఫుటేజీ ప్రకారం..అభిషేక్ తన ఇంట్లో నుంచి నడుచుకుంటూ వచ్చి తమ గేటు ఎదురుగా పార్క్ చేసిన బండిని తీసే ప్రయత్నం చేయగా మాంటీ అనే వ్యక్తి వచ్చి దాన్ని అడ్డుకున్నారు. ఇదే క్రమంలో మాంటీ,అభిషేక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇద్దరూ తగువలాడుకున్నారు. ఇదే సమయంలో అక్కడ మరికొందరు స్థానికులు కూడా ఉన్నారు. అయితే ఇదే సమయంలో మాంటీ ఉన్నట్లుండి అభిషేక్ ని నేలపైకి తోసేసి పిడి గుద్దలు గుద్దడం ప్రారంభించాడు. అక్కడే ఉన్న ఇద్దరి కుటుంబసభ్యులు మాంటీని పక్కకు లాగేశారు. అయితే అప్పటికే అభిషేక్ కి బాగా దెబ్బలు తగిలాయి.
అభిషేక్ కడుపులో గుద్దడంతో అతడు బాగా ఇబ్బందికి గురైపోయాడు. ఇటీవల అభిషేక్ కి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగింది. దీంతో అతడిని కడుపులో గుద్దేసరికి ఉన్నట్లుండి పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడని హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే అభిషేక్ మరణించినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. అభిషేక్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మాంటీపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిషేక్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications