Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి!
రాను రాను వావి వరసులు అన్నీ పూర్తిగా కనుమరుగవుతున్నాయి. కామకోరికలు తీర్చుకోడానికి వావివరసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు..కుటుంబాలను ఆగం చేస్తున్నారు.
తాజాగా నలుగురు పిల్లల తల్లి.. కన్నబిడ్డలాంటి తన మేనల్లుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా తన భర్తను,పిల్లలను వదిలి అతడితోనే లేచిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్ జిల్లాలోని జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కమ్రుద్దీన్ ఖాన్ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. 14 ఏళ్ల క్రితం పెళ్లి జరగ్గా..ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. సంసారం సాఫీగా సాగిపోతున్నట్లు కమ్రుద్దీన్ ఉన్నాడు. తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగినట్లు కనిపెట్టలేకపోయాడు.

ఈ క్రమంలో అయితే ఆగస్టు 8,2026న కమ్రుద్దీన్ భార్య తన మేనల్లుడితో ఇంటి నుంచి జంప్ అయ్యింది. తన మేనల్లుడు సాజిద్,మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి తన ఇంటికి వచ్చాడని..ఆ సమయంలో తనకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ సాజిద్ ఇచ్చాడని,తెలియక తాగిన తాను అపస్మారక స్థితిలోకి వెళ్లానని, ఈ సమయంతో తన భార్య, అతడు ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లారని కమ్రుద్దీన్ చెబుతున్నారు.

అయితే వాళ్లు వెళ్లే సమయంలో ఇంట్లోని బంగారంతో పాటు తన ఏడాదిన్నర కొడుకు తాలిమ్ ని కూడా తీసుకెళ్లారని కమ్రుద్దీన్ తెలిపారు. తన భార్య ఇలా మేనల్లుడితోనే అక్రమ సంబంధం పెట్టుకుంటదని తాను ఊహించలేకపోయానని, తనకు అనుమానం కూడా లేదని, ముందే తెలిసి ఉంటే వెంటనే తన భార్యను వారించి ఉండేవాడినని కమ్రుద్దీన్ చెబుతున్నారు.
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా, అమ్మ ఎక్కడికి వెళ్లింది అంటూ తన మిగిలిన ముగ్గురు పిల్లలు ఇంట్లో ఏడుస్తూ బాధపడుతున్నానని కమ్రుద్దీన్ వాపోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా కమ్రుద్దీన్ తన ముగ్గురు పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన భార్యను వెతికిపెట్టాలని కోరాడు. జహంగీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.



Click it and Unblock the Notifications
