Latest Updates
-
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.! -
ఇన్ స్టాగ్రామ్ లో ఇష్టపడ్డారు..పెళ్లి చేసుకున్నారు..7 నెలలకే స్కూల్ టైతో భర్త గొంతు నులిమి..
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా..
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్ పెట్టుకున్న ఇద్దరు అన్నదమ్ములు హెచ్ఐవీతో మరణించారు. అది కూడా ఒకరు చనిపోయిన 3 రోజులకే మరొకరు చనిపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆమెతో పరిచయం ఉన్న ఇతర వ్యక్తులు కూడా ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.
ఆ ప్రాంతమంతా భయాందోళనలు నెలకొనడంతో ఆరోగ్య అధికారులు అలర్ట్ అయ్యారు. మెడికల్ టీమ్స్ ని ఆ గ్రామానికి నంపారు. ఇద్దరు అన్మదమ్ముల మరణాలతో ఆ మహిళతో పరచయం ఉన్న మిగతా వాళ్లు కూడా హెచ్ ఐవీ టెస్టులు చేయించుకుంటున్నారు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ సిటీ శివార్లలో ఉన్న గ్రామానికి రెండేళ్ల క్రితం ఓ మహిళ వచ్చి ఒక ఇంట్లో అద్దెకు దిగింది. అయితే ఆమె అందచందాలకు ఆకర్షితులైన ఇద్దరు సోదరులు ఆమెతో సీక్రెట్ గా ఎఫైర్ పెట్టుకున్నారు. ఆమెతో ఒకరికి తెలియకుండా ఒకరు లైంగిక కార్యకలాపాలు కొనసాగించారు. అయితే ఇటీవల ఆ మహిళ ఆ గ్రామాన్ని వదిలేసి వెళ్లిపోయింది. అయితే అదే సమయంలో ఆ గ్రామానికి చెందిన 51 ఏళ్ల వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లి చూపించారు. ఆ తర్వాత రుషికేష్ లోని ఎయిమ్స్ హాస్పిటల్ లో చేర్పించారు. టెస్టుల్లో అతనికి hiv పాజిటివ్ గా తేలింది.

ఇదే సమయంలో అతని కజిన్ బ్రదర్ అయిన 43 ఏళ్ల వ్యక్తి కూడా అనారోగ్యం బారిన పడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని డెహ్రాడూన్ లోని హాస్పిటల్ కు తీసుకెళ్లగా పరీక్షల్లో అతడికి కూడా హెచ్ఐవీ ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత గత కొన్ని రోజులుగా ఇంట్లోనే ఆక్సిజన్ సహాయంతో గడుపుతూ వచ్చాడు.
అయితే గత సోమవారం రుషికేష్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ 51 ఏళ్ల వ్యక్తి మరణించగా..3 రోజులకే ఇంట్లో ఆక్సిజన్ సాయంతో ఉన్న అతని సోదరుడు కూడా మరణించాడు. అయితే మరణానికి ముందు అతను తమకు కొన్ని విషయాలు చెప్పాడని..గ్రామంలో అద్దెకు వచ్చిన మహిళతో తనకు లైంగిక సంబంధం ఉందని, తన కజిన్ బ్రదర్ కూడా ఆమెతో ఎఫైర్ పెట్టుకోవడం గురించి తనకు తెలుసని చెప్పాడని కుటుంబ సభ్యులు చెప్పారు.
అయితే ఆ మహిళ ద్వారానే ఈ ఇద్దరు అన్మదమ్ములకు హెచ్ఐవీ సంక్రమించిందనడానికి అధికారికంగా ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అధికారులు ఇద్దరు అన్నదమ్ముల మరణాలకు దారితీసిన పరిస్థితులను, అలాగే ఆ ఇద్దరు వ్యక్తుల హెల్త్ హిస్టరీని చెక్ చేస్తున్నారు.
ఇద్దరు అన్మదమ్మల మరణాలతో ఆ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ అద్దెకు ఉన్న మహిళతో పరిచయం ఉన్న వాళ్లందరూ ముందుజాగ్రత్తగా హెచ్ఐవీ టెస్టులు చేయించుకుంటున్నారు. హెచ్ఐవీ సంక్రమణకు గల కారణాలు, దానిని ఎలా నివారించాలనేదానికి ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలకు వివరిస్తున్నారు. అధికారులు ఈ రెండు మరణాలకు దారితీసిన పరిస్థితులను, అలాగే ఆ ఇద్దరు వ్యక్తుల ఆరోగ్య చరిత్రను కూడా పరిశీలిస్తున్నారు.



Click it and Unblock the Notifications
