Latest Updates
-
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక!
వైజాగ్‌కు వెళ్తున్నారా.. అయితే ఈ ఫుడ్ ఐటెమ్స్ అస్సలే మిస్ కావొద్దు
ఇతర నగరాల మాదిరిగానే వైజాగ్‌లో కూడా నోరూరించే వంటకాలా చాలానే ఉన్నాయి. మీరెప్పుడైనా వైజాగ్ వెళ్తే ఈ ఫుడ్ ఐటెమ్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి రుచి చూడండి. ప్రత్యేక వంటకాన్ని ఆస్వాదిస్తూ వైజాగ్ అందాలను చూసేయండి.
చాలా మందికి వివిధ ప్రదేశాలకు వెళ్లాలని కోరుకుంటారు. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అందులో కొందరు అక్కడి పర్యాటక ప్రాంతాలను చూడాలనుకుంటే మరికొందరు మాత్రం ఆయా ప్రాంతాల్లో దొరికే స్పెషల్ ఫుడ్ ఐటెమ్స్ తినాలనుకుంటారు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ స్థానికంగా దొరికే వంటకాలను రుచి చూడటం వాటిని గుర్తుండిపోయేలా చేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల వంటకాలు చాలా ఆదరణ పొందుతాయి. అలాంటి ఆహారాలను అస్సలే మిస్ కావొద్దు.

ఇతర నగరాల మాదిరిగానే వైజాగ్‌లో కూడా నోరూరించే వంటకాలా చాలానే ఉన్నాయి. మీరెప్పుడైనా వైజాగ్ వెళ్తే ఈ ఫుడ్ ఐటెమ్స్ ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి రుచి చూడండి. ప్రత్యేక వంటకాన్ని ఆస్వాదిస్తూ వైజాగ్ అందాలను చూసేయండి.
వైజాగ్‌లో ప్రతి ఒక్కరూ తప్పక ప్రయత్నించాల్సిన కొన్ని సిగ్నేచర్ ఫుడ్ ఐటెమ్స్ ఇక్కడ ఉన్నాయి.

రాజుగారి దాబా ప్రాన్స్ ఫ్రై:
(image: TripAdvisor)
వైజాగ్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లు అందించే బెస్ట్ సీఫుడ్ డిష్‌లలో ఒకటి రాజు గారి దాబా అందించే రొయ్యల వేపుడు. రుషికొండ వద్ద ఉన్న రాజు గారి దాబా బెస్ట్ ఆంధ్రా స్టైల్ వంటకాలను అందిస్తుంది. రాజు గారి దాబాలో ప్రాన్స్ ఫ్రై ప్రతి ఒక్కరూ తప్పకుండా రుచి చూడాల్సిన స్పెషల్ డిష్.

స్పైసీ వెన్యూ ఆప్రికాట్ డిలైట్:
(image: instagram/hyderabadfoodtrip)
ఎండిన ఆప్రికాట్ పండ్లు, తాజా క్రీముతో తయారు చేసిన వైజాగ్ ఆప్రికాట్ డిలైట్ సిగ్నేచర్ ఫుడ్ రుచి చూస్తే వదిలి పెట్టరు. సిరిపురంలోని స్పైసీ వెన్యూలో ఈ ఆప్రికాట్ డిలైట్ దొరుకుతుంది. మంచి భోజనం తర్వాత ఈ ఆప్రికాట్ డిలైట్ ట్రై చేసి చూడండి. మరొకటి కావాలని అడుగుతారు.

రాజు కిచెన్ మటన్ పులావ్:
మటన్ పులావ్ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ సీతమ్మధారలోని రాజుస్ కిచెన్‌లో దొరికే మటన్ పులావ్ అంటే చాలా మంది లొట్టలేస్తారు. వైజాగ్ వాసుల మదిని దోచుకుంది ఈ మటన్ పులావ్. ఈ మటన్ పులావ్‌ను స్పైసీ గ్రేవీ, రైతాతో తింటే అద్భుతంగా ఉంటుంది.

కామత్ చికెన్ బిర్యానీ:
లాసన్స్ బే కాలనీలో వైజాగ్ కామత్ ఫుడ్ ఐటెంను తప్పకుండా రుచి చూడాల్సిందే. కామత్ వైజాగ్‌లోని ఉత్తమ చికెన్ బిర్యానీని అందిస్తోంది. అరోమాటిక్ రైస్, ఫ్లేవర్డ్ చికెన్‌తో చేసిన అద్భుతమైన బిర్యానీ వైజాగ్ వాసుల మదిని దోచుకుంది. చల్లటి శీతల పానీయంతో కామత్ చికెన్ బిర్యానీ తింటే మామూలుగా ఉండదు. వైజాగ్ వెళ్తే మాత్రం తప్పకుండా కామత్ చికెన్ బిర్యానీ రుచి చూడండి.

నేతి విందు గీ పొంగల్:
(image: CurryTrail)
రాంనగర్ నేతి విందులో దొరుకుతుంది ఈ గీ పొంగల్. తప్పనిసరిగా రుచి చూడాల్సిన ఆహార పదార్థం ఇది. బాగా వండిన అన్నం, పప్పుతో తయారు చేసిన ఈ వంటకాన్ని నెయ్యి తడ్కాతో అందిస్తారు. సాంబార్, కొబ్బరి చట్నీతో ఈ నెయ్యి పొంగల్ తింటే అద్భుతం అనిపిస్తుంది. నేతి విందులో ఈ వంటకం రోజంతా ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి వెళ్లి రుచి చూడండి. మళ్లీ మళ్లీ వెళ్లి లాగించేయాలనిపిస్తుంది.



Click it and Unblock the Notifications