Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
తెలుగు స్టార్ హీరోలు హైదరాబాద్‌లో నడుపుతున్న రెస్టారెంట్లు ఇవే.. ఎప్పుడైనా వెళ్ళారా?
హైదరాబాద్‌లో తెలుగు సినిమా ప్రముఖుల ఆధ్వర్యంలో ఎన్నో రకాల రెస్టారెంట్లు ఉన్నాయి. వాటి గురించి చాలా మందికి తెలుసు. కానీ వాటిని హీరోలే నడుపుతున్నారని ఎవరికీ తెలియదు. ఈ రెస్టారెంట్లు అత్యంత క్లాసీగా, ప్రత్యేకమైన వాతావరణంతో ఉంటాయి. ఇవి చాలా ప్రత్యేకంగా ఉంటూనే.. చాలా లగ్జరీగా ఉంటాయి. ఈ స్టోరీలో కొందరు హీరోల రెస్టారెంట్ల గురించి వివరించాము. పూర్తిగా చదివి, మీకు ఇష్టమైన హీరో రెస్టారెంట్‌కి వెళ్లే ప్రయత్నం చేయండి.
శాంక్చువరీ-బార్ & కిచెన్
ఫిల్మ్ నగర్‌లో హీరో రానా దగ్గుబాటి చెందిన శాంక్చువరీ బార్ అండ్ కిచెన్ ఉంది. ఈ రెస్టారెంట్ విలాసవంతమైన వాతావరణం కలిగి ఉంది. రానా దగ్గుబాటి కుటుంబానికి చెందిన పాత ఇల్లు రెనోవేట్ చేసి ఇది ఓ రెస్టారెంట్‌గా మార్చారు. ఇందులో ప్రైవేట్ డైనింగ్ గదులు, బార్ కూడా ఉన్న ఈ రెస్టారెంట్ ఎప్పటికప్పుడు జనంతో నిండి ఉంటుంది.

గుడ్ వైబ్స్ ఓన్లీ కాఫీ
విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ స్థాపించిన కాఫీ షాప్ గుడ్ వైబ్స్ ఓన్లీ కాఫీ. ఈ కాఫీ షాప్ విభిన్న రుచులైన బర్గర్లు, పిజ్జాలు, పాస్తాలు అందిస్తుంది. ఈ కాఫీ షాప్‌లో కూర్గ్ నుండి సేకరించిన కాఫీ బీన్స్‌తో తయారుచేసిన కాఫీ మరింత ప్రత్యేకమైనది.
షోయు
అక్కినేని నాగచైతన్యకు చెందిన రెస్టారెంట్ షోయు. ఇది ఆసియన్ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. థాయ్ కర్రీలు, సుషీ, డిమ్‌సమ్స్ వంటి పాపులర్ వంటకాలు ఇక్కడ లభిస్తాయి. ఇది హైదరాబాద్‌లోని మొట్టమొదటి ఖరీదైన పాన్-ఆసియన్ రెస్టారెంట్లలో ఒకటి.
బఫెలో వైల్డ్ వింగ్స్
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పెట్టుబడులతో బఫెలో వైల్డ్ వింగ్స్ అనేది ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ ఒక స్పోర్ట్స్ బార్‌గా ఉంది. ఇందులో సిగ్నేచర్ సాస్‌లు, చికెన్ వింగ్స్, గ్రిల్డ్ ఫిష్ వంటి రుచికరమైన వంటకాలు లభిస్తాయి.
AN రెస్టారెంట్
సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన ఈ రెస్టారెంట్ బంజారాహిల్స్‌తో ఉంది. ఈ రెస్టారెంట్ మహేష్ బాబు మరియు నమ్రతా శిరోద్కర్ జంట ప్రారంభించారు. ఇది గ్రాండ్ ప్యాలెస్‌ల నుండి స్ఫూర్తి పొందిన రూపంలో నిర్మించబడింది.
వివాహ భోజనంబు
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన సినిమాల కెరీర్లోనే 'వివాహ భోజనంబు' రెస్టారెంట్ ప్రారంభించారు. ఇది మంచి రేటింగ్‌తో విజయవంతంగా కొనసాగుతోంది. దీనికి రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్‌లో ఇంకోటి జూబ్లీహిల్స్‌లో ఉంది. మీకు వీలైతే, ఒకవేళ కుడితే ఈ రెస్టారెంట్లను ఓసారి సందర్శించి, అక్కడి భోజనపు రుచిని ఆస్వాదించండి.



Click it and Unblock the Notifications
