మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

రోజూ అవే ఇడ్లీలు, దోశలు, పూరీలు, వైట్ రైస్ ఎంత తిన్నా టేస్ట్ తప్ప ఆరోగ్యానికి పెద్దగా ప్రయోజనాలేవీ ఉండవు. ఈ క్రమంలో చాలామంది ఈ వాస్తవాన్ని గుర్తించి ఈ రెగ్యులర్ టిఫిన్స్ వదిలేసి మన పూర్వీకులు తిన్న బలమైన ఆహారం వైపు మెగ్గుచూపుతున్నారు. మన పూర్వీకులకు ఉక్కులాంటి బలానిచ్చిన ఆహారాల్లో జొన్న సంగటి ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. బియ్యం అందరికీ అందుబాటులో లేని రోజుల్లో దీనిని తినేవాళ్లు. అప్పుడు వాళ్లకి ఎలాంటి రోగాలు,రొప్పులు ఉండేవి కాదు, బలంగా ఉండేవాళ్లు.

జొన్న సంగటి తయారు చేయడం చాలా చాలా ఈజీ. దీని తయారీకి పెద్దగా ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. కేవలం జొన్నలు, నీళ్లు ఉంటే చాలు నిమిషాల్లో రెడీ అయిపోతుంది. దీనిని వేడి వేడిగా తోటకూర పప్పు, ఆవకాయ లేదా మీకు నచ్చిన కూరతో తింటే అద్భుతం అంటే ఇదేనేమో అనేలా ఉంటది రుచి. షుగర్ ఉన్నవాళ్లకి, బరువు తగ్గాలనకునేవాళ్లకు ఇది చాలా మంచిది. తాతముత్తాతల కాలం నాటి బలమైన ఆహారం జొన్న సంగటి మీ ఇంట్లో తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Jonna Sangati Recipe For Weight loss and Diabetes The Ancient Secret to Super Strength Health

జొన్న సంగటి తయారీకి కావాల్సిన పదార్థాలు

-జొన్నలు
-నీళ్లు
-ఉప్పు

సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది!

జొన్న సంగటి తయారీ విధానం

-ముందుగా ఒక మీడియం సైజ్ గ్లాసు తెల్ల జొన్నలను ఒక గిన్నెలో వేసి ఎక్కడా మట్టిగడ్డలు వంటివి లేకుండా చూసుకోండి. తర్వాత నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత జొన్నలు మునిగేదాకా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి.

-రాత్రంతా నానిన జొన్నల్లోని నీళ్లు వంపేసి, ఆ జొన్నలను ఒక పొడి వస్త్రంపై పరుచుకున్నట్లుగా వేసి వాటిలోని తడి అంతా పోయేవరకు సమారు 15 నిమిషాలు ఆరబెట్టుకోవాలి. ఎండలో పెట్టకూడదు. ఫ్యాన్ గాలి కింద ఉంచవచ్చు.

-జొన్నల్లోని తడి ఆరిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి మీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి

-తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో 4 గ్లాసుల నీళ్లు పోసి మూతపెట్టి వేడి చెయ్యాలి. నీళ్లు కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో పావు టీస్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి.

-ఇప్పుడు ఆ నీళ్లలోనే మిక్సీ పట్టుకున్న జొన్న రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మధ్యమధ్యలో కలుపుకుంటూ అది దగ్గరపడే వరకు మీడియం మంట మీద మూతపెట్టి ఉడికించాలి. దీనికి సుమారు 10- 15 నిమిషాల సమయం పడుతుంది.

-దగ్గరపడే వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి. జొన్న సంగటి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోండి. తర్వాత జొన్న సంగటిని చేతిలోకి తీసుకుని

-అంతే పాతకాలం పద్ధతిలో జొన్న సంగటి రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, September 21, 2026, 13:22 [IST]
Desktop Bottom Promotion