Latest Updates
-
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది!
విజయదశమి రోజు ఈ వస్తువులు దానం చేస్తే..ఏడాది పొడవునా సిరిసంపదలే!
దేశమంత దేవి నవరాత్రుల శోభ వెల్లివిరుస్తోంది. తొమ్మిది రోజుల అమ్మవారి ఆరాధన తర్వాత వచ్చే పదవ రోజే విజయదశమి. దీనిని దసరా పండుగ అని కూడా అంటారు. ఈ ఏడాది అక్టోబర్ 2 తేదీన దసరా పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ దసరా పండుగ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. కేవలం వేడుకలు పూజలే కాకుండా ఈ పవిత్ర రోజున చేసే దానధర్మాలకు విశేషమైన శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
దసరా రోజున మన శక్తి మేరకు చేసే చిన్నపాటి దానం కూడా ఏడాది మొత్తం మన జీవితంలో శుభ ఫలితాలను, అష్టైశ్వర్యాలను అందిస్తుందని చెబుతున్నారు. విజయదశమి నాడు ఏ వస్తువులను దానం చేయాలి? ఏ దానం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో ఇక్కడ చూడండి.

పసుపు వస్త్రాల దానం
బిజినెస్ లో రాణించాలనుకునేవాళ్లు, ఆర్థికంగా స్థిరపడాలనుకునే వాళ్లు దసరా నాడు పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఒక బ్రాహ్మణుడికి పసుపు వస్త్రంతో పాటు ఒక కొబ్బరికాయ, కొన్ని మిఠాయిలు, పవిత్రమైన జంధ్యాన్ని కలిపి దానం చేయాలి. పసుపు రంగు బృహస్పతికి ప్రతీక కాబట్టి ఈ దానం వల్ల నిలిచిపోయిన వ్యాపారం తిరిగి పుంజుకుంటుంది, ఆర్థిక లాభాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
తెల్లని వస్త్రాల దానం
తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకు, నిర్మలత్వానికి చిహ్నం. దసరా రోజున తెల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో అనవసరమైన ఆందోళనలు, కలహాలు తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొంటుందని పండితులు తెలిపారు.
గుప్త దానం
అన్ని దానాల కన్నా గుప్త దానం అత్యంత శ్రేష్ఠమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. మన కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. దసరా రోజున మీకు తోచిన సహాయాన్ని (ఆహారం, దుస్తులు, ధనం) ఎవరికీ తెలియకుండా ఎలాంటి ప్రచారం ఆశించకుండా నిరుపేదలకు లేదా ఒక బ్రాహ్మణుడికి రహస్యంగా అందించండి. ఈ దానం మీ ఇంట్లోని నెగిటివ్ శక్తులను పారద్రోలి, సుఖసంతోషాలను నింపుతుంది.
ధాన్య దానం
ఉద్యోగ, వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకునే వారు దసరా రోజున గోధుమలు లేదా బియ్యాన్ని దానం చేయాలి. అన్నదానంతో సమానమైన ఈ పుణ్యకార్యం వల్ల మీ కెరీర్ లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, విజయం మీ సొంతమవుతుంది.
పెసల దానం
వ్యాపారంలో గణనీయమైన లాభాలు ఆర్జించడానికి బుధ గ్రహ అనుగ్రహం కోసం దసరా రోజున పెసలను దానం చేయడం శుభప్రదం. ఇది మీ వ్యాపారానికి కొత్త ఊపును అందించి, లాభాల బాట పట్టిస్తుంది.



Click it and Unblock the Notifications
