Latest Updates
-
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.!
IAS Tukaram Mundhe: తుకారం ముండే..వ్యవస్థను వణికిస్తున్న రియల్ హీరో..నెటిజన్ల ప్రశంసల వర్షం
తుకారాం ముండే.. ఈ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మీడియాలో, సోషల్ మీడియాలో సెన్సేషన్. సినిమాల చూసేవాళ్లందరికీ హీరో సూర్య నటించిన సింగం సినిమా గుర్తుండే ఉంటుంది. నిజాయితీ పోలీస్ ఆఫీసర్ ఎలా పనిచేస్తాడని సింగం సినిమాలో చూపిస్తారు. అయితే రియల్ లైఫ్ లో నిజమైన సింగం మాత్రం తుకారాం ముండే అని ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా కోడై కూస్తోంది.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన తుకారాం ముండే.. యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియాలో 20 వ ర్యాంకు సాధించారు. 2005 బ్యాచ్ కు చెందిన తుకారాం ముండే తన 21 ఏళ్ల సర్వీస్ లో.. ఏకంగా 25 సార్లు ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఆయన ఎంత నిజాయితీగా ఉన్నారనే దానికి ఈ ట్రాన్స్ ఫర్లే నిదర్శనం.

తుకారాం ముండే..ఈ ఏడాది మే 25న మహారాష్ట్ర FDA(ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్)కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నారు. FDA అనేది మనం తినే ఫుడ్, తాగే పాలు సేఫ్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసే ఒక గవర్నమెంట్ డిపార్ట్ మెంట్. FDA కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లు, హోటల్స్ లో తనిఖీలు స్టార్ట్ చేశారు. సింథటిక్ మిల్క్ యూనిట్స్, కల్తీ పనీర్, బ్యాన్డ్ గుట్కా, సురక్షితం కాని ఎడిబుల్ ఆయిల్ ఉపయోగిస్తున్నహోటల్స్, రెస్టారెంట్లపై కఠినమైన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,100కి పైగా రెస్టారెంట్లు, డెయిరీలు, స్వీట్ షాపులపై మెరుపు దాడులు చేసి లైసెన్సులు రద్దు చేశారు. నకిలీ పనీర్‌పై నిషేధం విధించారు. ఆయన కొరడా దెబ్బకు భయపడి బాంబే హైకోర్టు సైతం ఎఫ్‌డిఎ తీరుపై ఆరా తీసే పరిస్థితి వచ్చింది.
గత 3 నెలల్లో 1000కి పైగా రైడ్స్ నిర్వహించి పెద్ద మొత్తంలో కల్తీ ఫుడ్ ని సీజ్ చేశారు. ఎన్నో బ్రాండ్ ల లైసెన్స్ లను కూడా సస్పెండ్ చేశారు. ఫేక్ మెడిసిన్స్ తయారచేసే ముఠా బరతం కూడా పట్టారు. పవర్ ఫుల్ లాబీలను లెక్క చేయకుండా, ప్రలోభాలను, ఒత్తిళ్లను పట్టించుకోకుండా, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎక్కడ కల్తీ ఉంటే అక్కడ వాలిపోతున్నారు, వాళ్ల అంతు చూస్తున్నారు.
ఒక హోటల్ తమ లైసెన్స్ సస్పెండ్ చేయడంపై బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. ఈ సమయంలో జడ్జి గారు..తుకారాం ముండేకి ఒక ప్రశ్న వేసింది. అదేంటంటే..ప్రైవేట్ హోటల్స్ మీదనే తనిఖీలు ఎందుకు, గవర్నమెంట్ క్యాంటీన్లపై ఎందుకు తనీఖీలు నిర్వహించట్లేదు అని జడ్జి తుకారాం ముండేని ప్రశ్నించారు. దీంతో ఆ మరుసటి రోజే FDA టీమ్..బాంబే హైకోర్ట్ పరిసరాల్లోని ప్రభుత్వ క్యాంటీన్లపై రైడ్స్ చేసింది. ఈ తనిఖీల్లో ఒక క్యాంటీన్ కి FSSAI(ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) లైసెన్ప్ లేకపోవడంతో చర్యలు కూడా తీసుకున్నారు. ఫైవ్ స్టార్ట్ హోటల్స్, టాప్ రెస్టారెంట్లు, ఐస్ క్రీమ్ పార్లర్స్ ఇలా పవర్ ఫుల్ బిజినెస్ లాబీలను కూడా ఎదుర్కొంటూ చేస్తున్న పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
కొత్తగా ఏం చేయట్లేదు
అయితే తుకారం ముండే చర్యలు అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. నిజంగా తుకారాం ముండే అధికారిగా చేయాల్సిందే చేస్తున్నాడు..కానీ పబ్లిక్ అతనిపై ఎందుకు ఇంతలా ప్రశంసల వర్షం కురిపిస్తూ ఆయన్ని హీరోలా చూస్తున్నారంటే..దానికి కారణం మిగతా అధికారులు తాము చేయాల్సిన పనిని సక్రమంగా చేయకపోవడమే అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ అధికారులు కూడా తమ పనిని తాము సక్రమంగా చేస్తూ ఉంటే ఈ తుకారం ముండే ఇంత పాపులర్ వ్యక్తిగా ఉండేవారు కాదు. అందరూ చేయాల్సిన పనిని చేయడం లేదు కనుగ..కనీసం ఒక్కరైనా ఆయన చేయాల్సిన పనిని సక్రమంగా చేస్తున్నాడు గనుకనే తుకారం ముండేకి ఈ క్రేజ్. తానేమీ ప్రత్యేకంగా ఏమీ చేయట్లేదని,తన డ్యూటీనే తాను చేస్తున్నానని ఓ ఇంటర్వ్యూలో కూడా తుకారం ముండే చెప్పారు.
గతంలో కూడా ఇలానే
అయితే ఇప్పుడు కేవలం fda కమిషనర్ గానే కాకుండా గతంలో పలు హోదాల్లో ఆయన చేసిన పనులు కూడా ఈ ప్రశంసలకు కారణం. ఇంతకుముందు ఇసుక మాఫియాను కూడా ఇలా ఎదుర్కొని తీవ్రమైన ఛాలెంజ్ లను కూడా ఎదుర్కొన్నారు. నవీ ముంబై, నాసిక్, నాగ్‌పూర్.. ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్ చూపించారు. నవీ ముంబైలో అక్రమ పెట్రోల్ బంకుల సీజ్, నాసిక్‌లో రెండు లక్షల అక్రమ కట్టడాల గుట్టు రట్టు, నాగ్‌పూర్‌లో కోవిడ్ సమయంలో కఠిన నిబంధనల అమలు.. ఇలా ప్రతి చోటా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు. దీనికి బహుమతిగా రాజకీయ నాయకుల నుంచి అవిశ్వాస తీర్మానాలు, బదిలీలు ఎదుర్కొన్నారు. అయినా సరే, ఆయన వెనక్కి తగ్గకపోవడంతో మహారాష్ట్ర ప్రజలు ఆయనను ముద్దుగా అధికార యంత్రాంగపు 'సింగం' అని పిలుచుకుంటారు. బదిలీలు తనకు శిక్ష కాదని, అదొక దినచర్య అని ఆయన నవ్వుతూ చెబుతారు.
బాలీవుడ్ స్టార్స్ కు నోటీసులు
అక్రమార్కులకే కాదు, ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్లకే ముండే చెమటలు పట్టిస్తున్నారు. షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్, టైగర్ ష్రాఫ్‌లకు ఆయన తాజాగా షాకింగ్ నోటీసులు జారీ చేశారు. విమల్ ఏలకులు ప్రకటనలో నటించినందుకు గాను ఆగస్టు 11న ఈ నోటీసులు పంపారు. అసలు వివాదం ఏమిటంటే.. మహారాష్ట్రలో విమల్ పాన్ మసాలా అమ్మకాలపై నిషేధం ఉంది. కానీ, ఈ స్టార్లు విమల్ ఏలకులను ప్రమోట్ చేస్తూ పరోక్షంగా నిషేధిత పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఎఫ్‌డిఎ భావిస్తోంది.
రెండు ఉత్పత్తులకు ఒకటే బ్రాండ్ నేమ్ ఉన్నప్పుడు, ఏలకులను ప్రమోట్ చేయడం అంటే పాన్ మసాలాను ప్రమోట్ చేయడమే కదా అన్నది ఎఫ్‌డిఎ ప్రశ్న. ఈ ప్రచారాల నుంచి వెంటనే తప్పుకోవాలని, సోషల్ మీడియా ఖాతాల నుంచి ఆ వీడియోలను తొలిగించాలని స్టార్లను ముండే ఆదేశించారు. 15 రోజుల్లోగా సరైన వివరణ ఇవ్వాలని, తమ అగ్రిమెంట్ పత్రాలను సమర్పించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
ఒక్కడున్నా చాలు
ఒక ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకులను ఎదిరించడం, అవినీతిపరుల ఆటలు కట్టించడం, కోర్టు విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గకపోవడం, ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్లనే నిలదీయడం.. ఇవన్నీ చూస్తుంటే ముండేను నిజంగానే 'అన్‌స్టాపబుల్' అనక తప్పదు. జనవరి 1,2026 నాటికి మనదేశంలో 5755 మంది IAS ఆఫీసర్లు డ్యూటీలో ఉన్నారు. ఒక్క ఆఫీసర్ తోనే ఎంత మార్పు ఉందో ఈ కేస్ మనకు చెబుతోంది. నిజాయితీ గల ఆఫీసర్లు అంతరించిపోతున్న జాతిలా మారిన ఈ రోజుల్లో తుకారాం ముండే లాంటి ఆఫీసర్ ప్రతి స్టేట్ కి ఒక్కరు ఉన్నా చాలు అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.



Click it and Unblock the Notifications
