అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.?

గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి ఈ సమస్యలన్నీ ఒకటే. అదే ఎసిడిటీ. పొట్ట, కాలేయం, సరిగా జీర్ణం కాకపోవడం కారణంగా ఎసిడిటీ బారిన పడుతుంటారు. అయితే ఆందోళన కూడా ఎసిడిటీకి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆందోళన వల్ల ఈ ప్రాబ్లమ్‌ ఏంటి అనుకుంటున్నారా.. దానికి సరైన కారణాలు ఏంటో తెలుసుకుందాం..

Excessive anxiety can lead to acidity Here are the reasons

ఆహారపు అలవాట్లలో మార్పులు, జీర్ణక్రియ సరిగా కాకపోవడం వల్ల ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. ఇది పక్కన పెడితే చాలా మందికి కొన్ని సందర్భాల్లో కంగారు, ఆందోళన పడటం సహజమే. కానీ దీనికి, ఎసిడిటీకి కూడా సంబంధం ఉండొచ్చని నిపుణులు పేర్కొనడం కాస్త వింతగా అనిపించినా.. ఇందుకు కారణాలు తెలుసుకోవడం ముఖ్యం.

ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!

ఆందోళన కారణంగా యాసిడ్‌ రిఫ్లక్స్‌ లక్షణాలు మరింత తీవ్రం కావచ్చని నిపుణులు అంటున్నారు. అయితే టెన్షన్‌కి, యాసిడ్‌ రిఫ్లక్స్‌కి సంబంధమేంటో తెలుసుకుందాం..

ఎసిడిటీ అంటే కడుపులో ఆమ్లం ఉత్పత్తి కావడం. అయితే ఆందోళన వల్ల మీ కడుపులో అధిక మోతాదులో ఆమ్లం ఉత్పత్తి అవుతుందని అర్థం కాదు. మీరు తీసుకునే ఒత్తిడితో జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో కడుపులో, అన్నవాహికలో అసౌకర్యం ఏర్పడుతుంది. ఫలితంగా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. ఫలితంగా కడుపు నుంచి వచ్చే సంకేతాలకు మెదడు సున్నితంగా మారిపోతుంది. ఇది కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గుండె మంట లేదా అసౌకర్యానికి దారితీయవచ్చు.

Excessive anxiety can lead to acidity Here are the reasons

యాసిడ్ రిఫ్లక్స్‌కి కారణాలు

కడుపులోని ఆహారం లేదా ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవేశిస్తే యాసిడ్‌ రిఫ్లక్స్‌ సంభవించి గుండెల్లో మంట, నోరు పుల్లగా మారడం, త్రేన్పులు, అసౌకర్యానికి దారితీస్తుంది. అయితే ఆందోళన ఒక్కటే అసిడిటీకి కారణం కాదు.. ఎక్కువగా తినడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, మసాలాలు వేయించిన ఆహారాలు విపరీతంగా తీసుకోవడం, ధూమపానం అలవాటు, అధికంగా బరువు ఉండటం, మందుల ప్రభావం యాసిడ్‌ రిఫ్లక్స్‌కి దారితీస్తాయి.

బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్?

డాక్టర్‌ను ఎప్పుడు కలవాలి..

మీకు పదేపదే యాసిడ్‌ రిఫ్లక్స్‌ సమస్య రావడం, నిరంతరం వాంతులు, అన్నం మింగడంలో ఇబ్బంది, వాంతి చేసుకునేటప్పుడు రక్తం పడటం, మలం నల్లగా రావడం, ఒక్కసారిగా బరువు తగ్గినట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సరైన కారణాన్ని తెలుసుకుని చికిత్స తీసుకోవడం మేలు చేస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, October 3, 2026, 16:52 [IST]
Desktop Bottom Promotion