ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!

జుట్టుకి సంబంధించి ఆడామగవారిలో కామన్‌గా ఎదురయ్యే సమస్య చుండ్రు. ఒకసారి చుండ్రు తలకు పట్టిందంటే అది వదలడానికి చాలా టైం తీసుకుంటుంది. ఆలోపు జుట్టు ఊడిపోవడం, తల చర్మం దెబ్బతినడం జరుగుతుంది. ఈ క్రమంలో డాండ్రఫ్‌ తగ్గడానికి ఖరీదైన షాంపూలు లాంటి పరిష్కారాలను చూస్తుంటాం. కానీ ఒక్కోసారి వీటివల్ల సమస్య తగ్గకపోగా మరింత దెబ్బతింటుంది. కానీ ఈ సారి మీరు ఈ సింపుల్‌ ఇంటి చిట్కాను పాటించండి. కొన్ని వారాల్లోనే సత్ఫలితం కనపడుతుంది.

Applying a mixture of coconut oil and lemon juice to the scalp reduces dandruff

చర్మ సంరక్షణలో భాగంగా జుట్టుకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే బాహ్య శరీర భాగాల్లో అత్యంత ఎక్కువగా ప్రభావితమయ్యేది కురులు మాత్రమే. బయటకు వెళ్లినప్పుడు దుమ్ము, ధూళి, ఎండ, వర్షం వల్ల జుట్టు దెబ్బతింటుంది. దీంతో ఒక్కోసారి చుండ్రు ఎక్కువై జుట్టు ఊడిపోవడం, ఎక్కువగా దురదకి కారణమవుతుంది. కురులు దెబ్బతింటాయి. ఈ క్రమంలో చుండ్రు తగ్గడం కోసం ఖరీదైన షాంపూలు వాడటం, లేదా వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కానీ ఇది అందరిపైనా ప్రభావం చూపించకపోవచ్చు. దీంతో డబ్బు వృథాతో పాటు కురులు కూడా దెబ్బతింటాయి. ఈ క్రమంలో మీరు ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఈ సింపుల్‌ చిట్కాను ట్రై చేయండి. చుండ్రు సమస్య తొలగడంతో పాటు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

కొబ్బరి నూనెలో నిమ్మరసం

జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండేందుకు మంచి నాణ్యమైన కొబ్బరి నూనె తప్పనిసరిగా వాడతాం. అయితే చుండ్రు సమస్య ఉన్నవారు ఈ సారి కొబ్బరి నూనెలో కాస్త నిమ్మరసం కలిపి తలకు అప్లై చేయండి. ఈ కాంబినేషన్‌ వల్ల మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

ఇలా అప్లై చేయండి

Applying a mixture of coconut oil and lemon juice to the scalp reduces dandruff

నిమ్మరసంలో విటమిన్‌ సితో పాటు యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనికి తలకు పట్టించడం ద్వారా ఫంగస్‌ను, మృత కణాలను సమూలంగా తొలగిస్తుంది. ఒక స్పూన్‌ నిమ్మరసంలో రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి తలకు మర్దన చేసుకోండి. దూదితో తల చర్మం భాగంలో అప్లై చేసుకోవడం ద్వారా చుండ్రును ప్రభావవంతంగా తొలగిస్తుంది.

వారానికి రెండు సార్లు

అప్లై చేసిన ఒక 30 నిమిషాల తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో సున్నితంగా తలస్నానం చేయండి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం ద్వారా చుండ్రు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా జుట్టు సహజంగా మెరుస్తూ కనిపిస్తుంది. కుదుళ్ల పోషణకు దోహదపడుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, October 3, 2026, 11:45 [IST]
Desktop Bottom Promotion