Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Dream Job: నో బాస్,నో టార్గెట్స్..ఏడాదికి రూ.10 కోట్ల జీతం..వైరల్ జాబ్ ఆఫర్
చదువు అయిపోగానే సొంత వ్యాపారం,కొత్త ఐడియాస్ బిజినెస్ చేద్దాం అనుకునేవాళ్ల కంటే ఉద్యోగం చేద్దామనుకునేవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు మనదేశంలో. అయితే ఉద్యోగం వచ్చాక అందులో జీతానికి తగ్గట్లు టార్చర్ కూడా పెరిగిపోతుంది. బాస్ తో మీటింగ్ లు, మెయిల్స్, టార్గెట్లతో జీవితం నరకప్రాయంగా మారిపోతుంది. కొందరు అయితే ఉద్యోగంలో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అయితే ఓ కంపెనీ ఇచ్చిన ఉద్యోగ ప్రకటన అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన ప్రకారం..సంవత్సరానికి రూ. 10 కోట్ల పైనే జీతం..మీకు బాస్ ఉండరు, మీటింగ్ ల టెన్షన్ లేదు. పని కేవలం ఒక లైట్ ను ఆన్ చేసి ఉంచడమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లయ్ చేసుకోండి అంటూ ఈ ప్రకటన విపరీతంగా వైరల్ అవుతుంది. వినడానికే అద్భుతంగా ఉంది కదా. ఇలాంటి ఉద్యోగాన్ని ఎవరు మాత్రం వద్దనుకుంటారు. ఈ ప్రకటన చూసిన నెటిజన్లు నేను అప్లయ్ చేస్తున్నా నేను అప్లయ్ చేస్తున్నా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. వినడానికే అద్భుతంగా ఉంది కదూ? ఈ పని దరికితే చాలు దేవుడా అని కొందరు గుళ్ల చుట్టూ ప్రదక్షణలు కూడా చేస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న ఈ ఉద్యోగ ప్రకటన వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ కథనం ప్రకారం ఈ ఉద్యోగం ఫ్రాన్స్ లోని ప్రమాదకరమైన జుమోన్ లైట్ హౌస్ కీపర్ ది. సముద్రం మధ్యలో ఒంటరిగా ఓ కోటలాంటి లైట్ హౌస్ లో నివసించాలి. చుట్టూ మైళ్ల దూరం వరకు మనుషుల నీడ కూడా కనిపించదు. మాట్లాడటానికి తోడుండదు. భయానక తుఫానులు, ఆకాశాన్ని తాకే అలల మధ్య ధైర్యంగా నిలబడాలి. ఒక్కోసారి ఆ రాకాసి అలలు లైట్ హౌస్ ను కప్పేస్తుంటాయి, ప్రాణాలకే ప్రమాదం. ఇంతటి సాహసానికి ప్రతిఫలంగానే రూ. 30 కోట్ల జీతం అని ప్రచారం జరుగుతోంది. కేవలం 10వ తరగతి పాసై, కాస్త టెక్నికల్ పరిజ్ఞానం ఉంటే చాలని చెప్పడంతో చాలామంది ఈ ఉద్యోగంపై ఆశలు పెంచుకున్నారు.
నిజం ఇదే
ఈ అద్భుతమైన ఆఫర్ పూర్తిగా ఒక కట్టుకథ. ఫ్రాన్స్ లోని జుమోన్ లైట్ హౌస్ ఇప్పుడు పూర్తిగా ఆటోమేటెడ్. అంటే లైట్లను ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి మనిషి అవసరమే లేదు. అక్కడ లైట్ హౌస్ కీపర్ అనే ఉద్యోగమే లేదు. ఇక రూ. 30 కోట్ల జీతం అనేది కేవలం నెటిజన్లను ఆకర్షించడానికి సృష్టించిన అతిశయోక్తి మాత్రమే. వాస్తవానికి ప్రపంచంలో ఇంకా లైట్‌హౌస్ కీపర్ ఉద్యోగాలు కొన్ని చోట్ల ఉన్నప్పటికీ వారి జీతం ఏడాదికి సుమారు రూ. 30 లక్షల నుండి 50 లక్షలు. ఈ ఉద్యోగాలను కూడా ప్రభుత్వ ఏజెన్సీలే నిర్వహిస్తాయి. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ప్రతి అద్భుతమైన ఉద్యోగ ప్రకటనను నమ్మే ముందు ఒక్కసారి వాస్తవాలను పరిశీలించడం ముఖ్యం.



Click it and Unblock the Notifications
