Latest Updates
-
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి?
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.!
ప్రతి మనిషీ తన కుటుంబంలో, సమాజంలో, పనిచేసే చోట గౌరవం, నమ్మకం ఆశిస్తారు. కానీ ఆ గౌరవం, నమ్మకం ఊరికే దక్కదనే విషయం చాలా మందికి తెలియదు. వారి ప్రవర్తన, భాష, ఆలోచనా విధానం, ఇతరుల పట్ల ప్రవర్తించే విధానం.. వారికి గుర్తింపును అందిస్తాయి. ఈ క్రమంలో సమాజంలో మనిషి గుర్తింపు పొంది గౌరవంగా బతకాలంటే ఈ మూడు విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని ఆచార్య చాణక్య తన నీతి సూత్రాల్లో వివరించారు.

జ్ఞాన సముపార్జన
ఆచార్య చాణక్యుని ప్రకారం.. ప్రతి మనిషికి సంబంధించి గొప్ప శక్తులలో జ్ఞానం ప్రధానం. చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడం, డిగ్రీ సంపాదించడం కాదు. సొంత అనుభవాల నుంచి నేర్చుకోవడం, తప్పులను అర్థం చేసుకోవడం, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం, ప్రతి పరిస్థితి నుంచి పాఠాలు నేర్చుకోవడం వంటి వాటి ద్వారా జ్ఞానం పెంచుకోవచ్చు. నిరంతరం నేర్చుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి కాలక్రమేణా పరిణతి చెందిన వ్యక్తిగా మారుతారు. దీని ద్వారా క్లిష్ట పరిస్థితుల్లోనూ మెరుగైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇతరులతో సమర్థవంతంగా సంభాషించడం తెలుస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ నేర్చుకునే అలవాటును మరిచిపోకూడదు.
సొంత పొగడ్తలు వద్దు
చాణక్య నీతి సలహా ప్రకారం ఏ మనిషైనా తనను తాను పొగుడుకోకూడదు. మీ జీవితంలో మీరు సాధించిన విజయాలు, బలాల గురించి ఇతరుల వద్ద పదేపదే ప్రస్తావించకండి. ఇది మీ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మీ కెపాసిటీని నిరూపించుకోవడం కంటే ఆ కెపాసిటీని మీరు చేసే పనుల్లో ప్రదర్శించాలి. మీ విజయం పట్ల మీకు గర్వం ఉండటంలో తప్పు లేదు.. కానీ మాటల్లో, చేతల్లో వినయం పాటించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇతరులు మీ ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ప్రశంసిస్తే అందులోనే కిక్ ఉంటుంది.

ఇతరుల పట్ల గౌరవం
మిమ్మల్ని ఇతరులు గౌరవించాలంటే.. ముందుగా మీరు ఇతరులను గౌరవించాలి. ఎదుటి వ్యక్తికి సొసైటీలో ఉన్న హోదా, పొజిషన్, ఆర్థిక స్థితిగతులు వంటి వాటితో సంబంధం లేకుండా వారితో మర్యాదగా ప్రవర్తించడం అనేది సమాజంలో మీ గౌరవం, గుర్తింపును నిర్ణయిస్తుంది. కుటుంబీకులు, స్నేహితులు, సహోద్యోగులు మాత్రమే కాదు సమాజంలో ఇతరులతో మర్యాదగా మాట్లాడటం కూడా మీ సంబంధాలు బలపడేలా చేస్తుంది. వయసు, హోదాతో సంబంధం లేకుండా గౌరవం చూపడం నేర్చుకోవాలి.
మొత్తంగా జ్ఞానాన్ని పెంచుకోవడం, సొంత పొగడ్తలను విడనాడటం, ఇతరులను గౌరవించడం అనే చాణక్యుని మూడు బోధనలు పాటించడం ద్వారా మీ బలమైన, ప్రభావవంతమైన వ్యక్తిత్వానికి పునాదిగా నిలుస్తాయి. గౌరవాన్ని పొందాలంటే, గొప్ప విజయాల కన్నా మీ ప్రవర్తనే ముఖ్యమని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇతరులపై పాజిటివ్ ఒపీనియన్ పెంచుకోవడం కూడా చాలా ముఖ్యమని గమనించాలి.



Click it and Unblock the Notifications
