Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Valmiki Jayanti Wishes in Telugu 2024: వాల్మీకి జయంతి శుభాకాంక్షలను ఈ విధంగా చెప్పండి.. వాల్మీకి బోధనలు పంచుకో
రామాయణాన్ని రచించి, ఆది కవిగా పేరు ప్రఖ్యాతలు గావించిన వాల్మీకి మహర్షి జయంతి నేడు. ఈ వాల్మీకి జయంతిని కార్తీకమాసంలో పౌర్ణమి నాడు జరుపుకుంటారు. సంస్కృత సాహిత్యంలో అతను మొదటి పురాణ గాథను రచించారు కాబట్టి ఆయనకు ఆదికవి అనే బిరుదు ఉంది. వాల్మీకి రచించిన రామాయణానికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు, జీవితంలో నైతిక, ఆధ్యాత్మిక విలువలు నేర్పే.. జీవిత పాఠంగానూ గుర్తింపు ఉంది.
అలాంటి గొప్ప గ్రంథాన్ని అందించిన వాల్మీకి మహర్షికి నివాళులు అర్పిస్తూ.. ఆయన జయంతి అయిన ఈరోజు దేశ వ్యాప్తంగా పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాంటి గొప్ప మహర్షికి నివాళులు అర్పించేందుకు తెలుగులో మంచి మంచి కొటేషన్స్ ఇక్కడ ఆడించాము. వాటిని ఒకసారి చూడండి.

వాల్మీకి జయంతి శుభాకాంక్షలు
> మీకు, మీ కుటుంబ సభ్యులకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. వాల్మీకి మహర్షి బోధనలు మీరు ధర్మ బద్ధంగా, కరుణతో కూడిన జీవితాన్ని గడపడానికి ప్రేరేపించాలని కోరుకుంటున్నాము.
> వాల్మీకి జయంతి శుభ సందర్భంగా.. మీరు రామాయణంలోని జ్ఞానాన్ని, బలాన్ని, ప్రేరణను పొందాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు.
> అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించే రామాయణాన్ని రచించిన వాల్మీకి జయంతి శుభాకాంక్షలు నేడు. ఆయన జయంతి సందర్భంగా జ్ఞానాన్ని అందించే గురువులందరికీ శుభాకాంక్షలు.
> వాల్మీకి మహర్షి ఆత్మ మిమ్మల్ని సత్యం, ధర్మం వైపు నడిపించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు.
> ప్రేమ, కర్తవ్యం, ధర్మం యొక్క ప్రాముఖ్యతను మనకు నేర్పిన మహర్షి వాల్మీకి జయంతిని నేడు ఘనంగా జరుపుకుందాం. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు.
> వాల్మీకి జయంతి నాడు, ఆయన జ్ఞానం, వివేకం మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయాలని, మీకు శాంతి మరియు ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటూ.. వాల్మీకి జయంతి శుభాకాంక్షలు.
సూక్తులు కూడా..
ఈ వాల్మీకి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడమే కాకుండా.. ఆయన నేర్పిన కొన్ని సూక్తులను కూడా నెమరేసుకుందాం. అప్పుడే ఆ మహానుభావుడికి మనం నిజమైన నివాళులు ఇచ్చినట్లు అవుతుంది. అలాగే ఆయన సూచించిన మార్గాన పయనిస్తున్నట్లు అవుతుంది.
> "దురదృష్టమే ఒక ఉత్తమమైన అదృష్టం. అందరిచేత తిరస్కరించబడడమే ఒక గొప్ప విజయం" - వాల్మీకి
> "ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అనేది చాలా కష్టం. ఒకరి జీవితంలో సంతోషం, మరొకరి జీవితంలో దుఃఖప్రాయంగా ఉంటుంది. ఇది అవిచ్చిన్న ఆనందం మాత్రమే" - వాల్మీకి
> "కాలం కంటే శక్తివంతమైన దైవం మరేదీ లేదు" - వాల్మీకి మహర్షి
> "ప్రతి మనిషి మంచి లేదా చెడు ఎదో ఒకటి చేస్తాడు. అయితే అతను చేసిన పని తన జీవితంలో ఎదో ఒక రోజు తనకు తిరిగి చెల్లిస్తుంది. అతను ప్రతీదానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది" - వాల్మీకి



Click it and Unblock the Notifications
