Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Vijay Diwas 2022: విజయ్ దివాస్ అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటాం, ప్రాముఖ్యత ఏంటంటే?
1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత దేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఏటా డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ పేరుతో వేడుకలు జరుపుకుంటాం.
Vijay Diwas 2022: 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత దేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ ఏటా డిసెంబర్ 16వ తేదీన విజయ్ దివస్ పేరుతో వేడుకలు జరుపుకుంటాం.

భారత రక్షణ దళాల ధైర్యాన్ని, త్యాగాలను స్మరించుకోవడానికి ఏటా విజయ్ దివస్‌గా స్మరించుకుంటాం. దీంతో పాటు 1999 కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత దేశం సాధించిన విజయానికి గుర్తుగా జులై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటాం.

విజయ్ దివస్ చరిత్ర, ప్రాముఖ్యత
1970 ఎన్నికల్లో పాకిస్థాన్‌లో ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ అవామీ లీగ్ గెలుపొందింది. ఆ తర్వాత తూర్పు పాకిస్థాన్ అయిన ఇప్పటి బంగ్లాదేశ్‌లో బెంగాలీ మాట్లాడే మెజారిటీ ప్రజల పట్ల పాక్ మిలిటరీ అనుచితంగా ప్రవర్తించడం ప్రారంభించింది. స్వతంత్ర్యం కోసం అక్కడి ప్రజలు అలుపెరగని పోరాటం చేశారు. ఆ పోరాటం ఉద్ధృతమై 1971లో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైంది.
బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్ పాక్‌తో పోరాడింది. 13 రోజుల యుద్ధంలో భారత్ పైచేయి సాధించింది. డిసెంబర్ 16న పాక్ సైన్యం లొంగిపోయి, యుద్ధంలో ఓడిపోయినట్లు అంగీకరించింది. అలా పాక్ నుండి బంగ్లాదేశ్ విముక్తి పొందింది.
అప్పటి నుండి డిసెంబర్ 16ను భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లో విజయ్ దివస్ గా జరుపుకుంటున్నాం.

ఈ సంవత్సరం వేడుకలు:
దిల్లీ ఆర్మీ హౌస్‌లో విజయ్ దివస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యవేక్షణలో విజయ్ దివస్ వేడుకలు జరిగాయి. ఎట్ హోం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, సైనికాధికారులు పాల్గొన్నారు.
ఆర్మీ హౌస్ ఆవరణలో విజయ్ దివస్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. 93 వేల మంది పాక్ సైనికుల లొంగుబాటు, బంగ్లాదేశ్ యుద్ధం, పాక్ నుండి విముక్తి పొంది బంగ్లాదేశ్ సన్నివేశాలను ప్రదర్శించారు. వీటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తిలకించారు.



Click it and Unblock the Notifications