Latest Updates
-
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా..
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు!
ఏ శుభకార్యం తలపెట్టినా, ఎలాంటి ఆటంకాలు రాకూడదని తొలిపూజ అందుకునే దేవుడు గణనాథుడు. విజ్ఞానానికి, కొత్త ఆరంభాలకు, విజయానికి ప్రతీక అయిన బొజ్జ గణపయ్య పుట్టినరోజే వినాయక చవితి. హిందువులే కాకుండా అనేక ఇతర మతాల వ్యక్తులు కూడా అత్యంత భక్తిశ్రద్దలతో వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటారు. వినాయక చవితికి కొన్ని రోజుల ముందు నుంచే మనదేశంలో ప్రతి ఊర్లో పండగ వాతావరణం నెలకొంటుంది. వినాయక మండపాలు ఏర్పాటు చేయడం, వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తుంటారు.
ముఖ్యంగా ఏపీ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఈ పది రోజులూ ఒక ఆధ్యాత్మిక, పండుగ వాతావరణం నెలకొంటుంది. 2026 సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు? పూజా ముహూర్తం, ఆచారాలు, ఇతర ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ చూడండి.

2026లో వినాయక చవితి ఎప్పుడు
హిందూ పంచాంగం ప్రకారం..భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు వినాయక చవితిని జరుపుకుంటారు. అందుకే దీనిని భాద్రపద చతుర్థి అని కూడా అంటారు. 2026లో సెప్టెంబర్ 14, సోమవారం నాడు వినాయక చవితి జరుపుకుంటారు.
ఈ ఏడాది చతుర్థి తిథి సెప్టెంబర్ 14న ఉదయం 7:06 గంటలకు ప్రారంభమై..సెప్టెంబర్ 15న ఉదయం 7:44 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం పూట తిథి ప్రారంభమైనప్పటికీ, గణపతి ఆరాధనను మధ్యాహ్నం వేళలో చేయడం ఆనవాయితీ. సెప్టెంబర్ 14న మొదలయ్యే ఈ వినాయక నవరాత్రోత్సవాలు పది రోజుల పాటు కన్నులపండువగా సాగి సెప్టెంబర్ 25 అనంత చతుర్దశి రోజున జరిగే గణేష్ నిమజ్జనంతో ముగుస్తాయి.

విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం
పురాణాల ప్రకారం..పార్వతీపరమేశ్వరుల ముద్దుల పట్టి అయిన వినాయకుడు మధ్యాహ్న సమయంలో అవతరించాడు. కాబట్టి గణనాథుని విగ్రహ ప్రతిష్ఠాపన, పూజ మధ్యాహ్నం వేళల్లో నిర్వహించడం మంచిది. 2026 సెప్టెంబర్ 14న విగ్రహ ప్రతిష్ఠకు సుమారుగా ఉదయం 11:02 గంటల నుండి మధ్యాహ్నం 1:31 గంటల వరకు అత్యంత అనువైన ముహూర్తం ఉన్నట్లు పండితులు చెబుతున్నారు.
ఇంట్లో పూజా విధానం, నైవేద్యాలు
పండుగకు ముందుగానే ఇళ్లను, పూజా మందిరాలను శుభ్రం చేసి మామిడి తోరణాలు, పూలతో అందంగా అలంకరిస్తారు. ఒక ప్రత్యేకమైన పీఠంపై మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రాణ ప్రతిష్ఠ అనే క్రతువును నిర్వహిస్తారు. గణపతికి ఇష్టమైన గరిక, ఎర్రటి పూలు, పండ్లు, కొబ్బరికాయలను భక్తితో సమర్పిస్తారు. నైవేద్యంగా స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన కుడుములు, ఉండ్రాళ్లు, లడ్డూలను నైవేద్యంగా పెట్టి హారతి ఇస్తారు.
నిమజ్జనం
పది రోజుల పాటు అత్యంత వైభవంగా, కన్నులపండువగా పూజలందుకున్న గణనాథుడికి వీడ్కోలు పలికే ఉద్వేగభరితమైన ఘట్టమే నిమజ్జనం. సృష్టి, ప్రళయాల చక్రానికి ప్రతీకగా మట్టితో చేసిన విగ్రహాన్ని తిరిగి నీటిలో కలపడమే ఈ నిమజ్జనం వెనకున్న పరమార్థం. 2026లో ఈ ఘట్టం సెప్టెంబర్ 25 శుక్రవారం నాడు అనంత చతుర్దశి పర్వదినాన అత్యంత ఉత్సాహంగా జరగనుంది. ఆ రోజున భక్తులందరూ శోభాయాత్రగా వెళ్లి, గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ రా అనే నినాదాలతో స్వామివారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు.



Click it and Unblock the Notifications
