Latest Updates
-
రొటీన్ చికెన్ కూరతో బోర్ కొట్టిందా? అయితే ఈ సండే మధురై చికెన్ కొత్తు కర్రీ ట్రై చేయండి -
పెళ్లైన ఏడు నెలలకే నవ దంపతుల విషాదాంతం… అసలు ఏం జరిగింది? షాకింగ్ నిజాలు! -
పరగడుపున ఈ జ్యూస్ తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు..కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోతుంది! -
NEET రాసేటప్పుడు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు, ఈ చిట్కాలు పాటిస్తే చాలు! -
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే! -
మే 3, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరించనుంది.. పట్టిందల్లా బంగారం కావాల్సిందే! -
వరియాన్ యోగం, విశాఖ నక్షత్రం.. ఈరోజు మీ సంపదను ఎలా పెంచుతాయో తెలుసా? -
ఈ ఆమ్లెట్ రుచి చూశారంటే మతి పోవాల్సిందే..నోట్లో వెన్నలా కరిగిపోతుంది -
హనుమాన్ జయంతి వేడుకలు: మాల విరమణకు సిద్ధమవుతున్నారా? భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే! -
శని దేవుడి కరుణ: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, మరికొందరికి కఠిన పరీక్ష!
బంపర్ ఆఫర్: ఫ్రీగా ఫిన్ లాండ్ వెళ్లే ఛాన్స్..ఒక్క రూపాయి లేకుండా 7 రోజుల ట్రిప్..పూర్తి వివరాలు చూడండి..
నిజమైన సంతోషం అంటే ఏమిటి? దాన్ని ఎలా సొంతం చేసుకోవాలి? శతాబ్దాలుగా ఎందరో తత్వవేత్తలు, మేధావులు, విద్యావేత్తలు ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉన్నారు. కానీ అత్యంత ఆకట్టుకునే ఆన్సర్, ఆచరణాత్మక విధానం మాత్రం ఫిన్లాండ్ (Finland) దేశం దగ్గర ఉంది. ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్ లాండ్.
ఆదాయం, మెరుగైన ఆరోగ్య సంరక్షణ, స్వేచ్ఛ, ఉదారత, అవినీతి లేని పారదర్శక వ్యవస్థ వంటి కచ్చితమైన ప్రమాణాలతో ఐక్యరాజ్యసమితి (UN) ప్రతి ఏడాదీ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల లిస్ట్ ను ప్రకటిస్తుంది. వరుసగా ఎనిమిదో సంవత్సరం కూడా ఫిన్లాండ్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అక్కడి ప్రజల ఆయుర్దాయం, స్నేహభావం, ఒత్తిడి లేని జీవనవిధానమే వారి సంతోషానికి అసలు కారణం.

ఆ అంతుచిక్కని సంతోష రహస్యాన్ని ఇప్పుడు ప్రపంచంతో పంచుకునేందుకు ఫిన్లాండ్ సిద్ధమైంది. కేవలం చెప్పడమే కాదు, ఏకంగా తమ దేశానికి వచ్చి ఆ ఆనందాన్ని స్వయంగా అనుభవించే అద్భుతమైన అవకాశాన్ని అక్కడి పర్యాటక శాఖ విజిట్ ఫిన్లాండ్ (Visit Finland) కల్పిస్తోంది. అదే చిల్ లైక్ ఎ ఫిన్(Chill Like a Finn) క్యాంపెయిన్.
ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఆరు జంటలను ఎంపిక చేసి, వారికి 7 రోజుల పాటు ఫిన్లాండ్ లో అన్ని ఖర్చులూ భరించి ఉచిత పర్యటనను అందిస్తోంది. ఎంపికైన ఆరు జంటలకు వసతి, కారు అద్దె, సౌనా బాత్ అనుభూతులు, కయాకింగ్, సైక్లింగ్ తదితర ఖర్చులన్నీ ఫ్రీ. 2026 జూన్ 11న హెల్సింకి చేరుకొని, జూన్ 17 వరకు ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. వీసా, ట్రావెల్ ఇన్సూరెన్స్ మాత్రం పర్యాటకులే చూసుకోవాలి.
ఈ ప్రయాణంలో పర్యాటకులను అద్భుతమైన ప్రకృతి రమణీయతకు నెలవైన ఫిన్నిష్ లేక్ ల్యాండ్ (Finnish Lakeland) ప్రాంతానికి తీసుకువెళ్తారు. ఎటు చూసినా కనువిందు చేసే ప్రకృతి దృశ్యాలు, నీలిరంగులో మినుకుమినుకుమంటూ మెరిసిపోయే వందలాది సరస్సులు, దట్టమైన పచ్చని అడవులు, అందమైన కొండలతో.. ఆ ప్రాంతం భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. ఫిన్లాండ్ ప్రజలు తమ రోజువారీ ఉరుకులు పరుగుల జీవితం నుంచి విశ్రాంతి కోరుకున్నప్పుడు సేదతీరే ప్రాంతం ఇది.
ఈ వారం రోజుల యాత్రలో మీ ఉదయాలు కొలొవేసి నేషనల్ పార్క్ లో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ హైకింగ్ చేయడం,చల్లని సరస్సుల్లో ఈత కొట్టడంతో ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం వేళ సాంప్రదాయ సౌనాలలో స్నానం చేస్తూ, ఉయ్యాలలో పడుకుని ఇష్టమైన పుస్తకాలు చదువుతూ గడపొచ్చు. ఇక సాయంత్రాలు వెచ్చని చలిమంటల దగ్గర, క్యాండిల్ లైట్ డిన్నర్లతో ప్రశాంతంగా ముగుస్తాయి. డిజిటల్ ప్రపంచానికి దూరంగా, ప్రకృతితో మమేకమై ఆనందాన్ని ఎలా పొందాలో ఈ యాత్ర మీకు నేర్పుతుంది.

ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేయాలి?
18 ఏళ్లు నిండిన ఫిన్ లాండ్ మినహా ఇతర దేశాలకు చెందిన వారెవరైనా ChillLikeaFinn.com వెబ్ సైట్ లో అప్లయ్ చేసుకోవచ్చు. ఇది రెండు దశల ప్రక్రియ. ఇందులో భాగంగా ఒక సోషల్ మీడియా వీడియో ఛాలెంజ్ ఉంటుంది. దాని ద్వారా మీరు ఎందుకు ఈ యాత్రకు సరైన వారో నిరూపించుకోవాలి.
మీ స్నేహితులు, జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఫిన్ లాండ్ వేసవి విడిదిని ఎలా ఆస్వాదిస్తారో వివరిస్తూ ఓ వీడియో తీయాలి. ఈ వీడియో రూపకల్పనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అస్సలు వాడకూడదు. ఆ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లేదా టిక్ టాక్ లో #ChillLikeAFinn అనే హ్యాష్ ట్యాగ్ తో అప్ లోడ్ చేసి.. @ourfinland (Instagram) లేదా @visitfinland.com (TikTok) కు ట్యాగ్ చేయాలి. అనంతరం అధికారిక క్యాంపెయిన్ వెబ్ సైట్‌లో ఆ లింక్ జతచేసి అప్లికేషన్ ఫారాన్ని నింపాలి.
జంటలో ఒకరికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కొద్దిపాటి ఇంగ్లీష్ నాలెడ్జ్ అవసరం. మార్చి 29, 2026 అప్లయ్ చేయడానికి చివరి గడువు. క్రియేటివిటీ, రియాలిటీ ఆధారంగా ఏప్రిల్ 21, 2026న విజేతలను ప్రకటిస్తారు.



Click it and Unblock the Notifications