Latest Updates
-
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
Mumps Cases Increase : పెరుగుతున్న గవదబిళ్లల కేసులు.. ఎమ్‌ఎమ్‌ఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారా ?
గవదబిళ్లల కేసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయ్. రాజధాని ఢిల్లీలో ఈ కేసులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయ్. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళలో కూడా ఈ వ్యాధి బారిన పడి చాలా మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గవదబిళ్లలను ఆంగ్లంలో మంప్స్ అని అంటారు. ఈ వ్యాధికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని, నివారణ మార్గాలను తెలుసుకుందాం.
గవదబిళ్లలు అంటే ఏంటి ?
గవదబిళ్లలు ఓ వైరల్ ఇన్‌ఫెక్షన్. ఈ వ్యాధికి సంబంధించిన వైరస్ లాలాజల గ్రంధులపై దాడి చేస్తుంది. చెవి కింది భాగంలో ఈ లాలాజల గ్రంధులుంటాయ్. దగ్గతే లేదా తుమ్మితే వచ్చే తుంపర్ల ద్వారా కూడా ఈ వ్యాధి ప్రభలుతుంది.

గవదబిళ్లల లక్షణాలు ఎంలా ఉంటాయంటే ?
వైరస్ బారిన పడిన 16 నుంచి 18 రోజుల తరువాత కూడా ఈ గవదబిళ్లల లక్షణాలు అలాగే ఉంటాయ్. ఈ వ్యాధి తగ్గాలంటే సుమారు 12 రోజుల నుంచి 25 రోజుల వరకు సమయం పడుతుంది.
వ్యాధి సోకిన వారి దవడల్లో వాపు కనిపిస్తుంది. జ్వరం, తలనొప్పి, నీరసం, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయ్.
కొన్ని గవదబిళ్లల కేసుల్లో లక్షణాలు కనిపించకున్నా వ్యాధి తీవ్రత పెరుగుతుంది.
ఎలా వ్యాపిస్తుందంటే ?
కరోనా వ్యాపించినట్టుగానే ఈ గవదబిళ్లల కేసులు వ్యాపిస్తాయ్. వ్యాధి సోకిన వారు తుమ్మితే, దగ్గితే వారి తుంపర్లు గనక ఎవరి శరీరంలో నోటిద్వారా, ముక్కు ద్వారా, కన్ను ద్వారా వెళ్తే వారికి కూడా సోకుతుంది. వ్యాధి సోకిన వారి నుంచి వచ్చిన తుంపర్లలో ఉండే వైరస్ 7 గంటల పాటు అలాగే బయట ఉండగలుగుతుంది. దీని ద్వారా వ్యాధి త్వరగా వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.
గవదబిళ్లల నివారణ, వ్యాక్సినేషన్
వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఈ గవదబిళ్లలను నివారించవచ్చు. పిల్లలకు ఎమ్‌ఎమ్ఆర్ వ్యాక్సిన ఇవ్వడం వల్ల గవదబిళ్లలతో పాటు చికెన్ పాక్స్, రెబెల్లా, మీజిల్స్ లాంటి వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. ప్రస్తుతం వ్యాధి తీవ్రమవుతున్న కారణంగా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. వ్యాధి సోకిన వారి దగ్గర గానీ వారి ప్రదేశంలో గానీ వెళ్తే చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. గవదబిళ్లలకు సంబంధించిన వైరస్ బయట ప్రదేశంలో, లేదా గాలిలో 7 గంటల పాటు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శుభ్రతను పాటిస్తూ ఉండాలి. వెంట సానిటైజర్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది.



Click it and Unblock the Notifications
