Latest Updates
-
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.!
పిల్లల ముందే బట్టలు మార్చుకుంటే ఏమవుతుంది?.. వారిలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?
పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడం, మంచి పాఠాలు చెప్పడం, అలాగే వారిని సరైన దిశగా పెంచడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ, దానికి తగిన విధంగా తమ ప్రవర్తనను తీర్చిదిద్దుకుంటారు. తల్లిదండ్రులు చేసే ప్రతి చిన్న పని, వారి మనసుపై ఒక చిన్న ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ పని చిన్నదైనా, పెద్దదైనా అది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే వారి ముందు ఎలాంటి పని చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలి. పిల్లల ముందు మనం సాధారణంగా చేసే పని బట్టలు మార్చుకోవడం. అయితే ఇది కూడా వారిపైన కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే ఏమవుతుంది? మార్చుకోవచ్చా లేదా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లలు గమనించి నేర్చుకుంటారు
పిల్లలు పెరుగుతున్నప్పటి నుండి వారి చుట్టూ జరుగుతున్న ప్రతి పనిని గమనించి, వాటిని అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కనీసం రెండు సంవత్సరాల వయస్సు నుంచి పిల్లలు ఆలోచించడం, వాటిని అనుసరించడం వంటివి మొదలుపెడతారు. తమ కళ్ళతో చొసి ప్రతి పనిని చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ విధంగా ఉండడానికి ట్రై చేస్తుంటారు. అయితే పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం అనేది చాలా ప్రభావాన్ని చూపిస్తుంటుంది. వారిలో ఎదో తెలియని అభదత్రా భావం కలుగుతుంది.

ప్రైవసీని అర్థం చేసుకోవడం
ప్రతి వ్యక్తికి ప్రైవసీ అవసరం. చిన్నప్పటి నుంచే ఈ సాంప్రదాయాన్ని పిల్లలకు నేర్పించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు తమ వ్యక్తిగత ప్రదేశంలోనే బట్టలు మార్చుకుంటే, పిల్లలు ఆ ప్రదేశం, ఆ సందర్భం గురించి తెలుసుకుంటారు. కానీ అదే పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వలన బట్టలు మార్చుకోవడం అనేది సాధారణ ప్రక్రియగా అర్ధం అవుతుంది. పిల్లలు కూడా అది అందరి ముందు చేయడానికి అనువైనదిగా భావిస్తారు. ఇది వారిలో కొన్ని గందరగోళాలనూ, అనవసరమైన అలవాట్లనూ కలిగించే అవకాశం ఉంటుంది.
మానసిక ప్రభావం
పిల్లల ముందే బట్టలు మార్చుకోవడం అనేది వారి మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. వారి ముందు బట్టలు మార్చుకోవడం వలన వారికి అసౌకర్యంగా ఉండడంతో పాటు వారిలో ఎదో తెలియని మార్పు కనిపిస్తుంది. అలాగే వారిలో కొత్త ప్రశ్నలు, కొత్త భావాలూ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నలు, భావాలు భవిష్యత్తులో ప్రమాదకరమైనదిగా, భయంకరమైనవిగా మారే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రుల ప్రవర్తనలో జాగ్రత్తలు
పిల్లలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు ఎక్కువగా తల్లిదండ్రుల ప్రవర్తన ఆధారపడి ఉంటాయి. అందుకే, తల్లిదండ్రులు తమ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండి, పిల్లలకు సరైన మార్గాన్ని చూపించాలి. దుస్తులు మార్చుకోవడం వంటి సాధారణ విషయాలను ప్రత్యేక ప్రదేశంలోనే చేయాలని, పిల్లలు అర్థం చేసుకునే విధంగా ప్రవర్తించాలి.
భవిష్యత్తులో మంచి అలవాట్లు
పిల్లలు చిన్నప్పటి నుండి ఈ అలవాట్లను అలవర్చుకుంటే.. వారు పెద్దయినప్పుడు, సమాజంలో ఒక స్థాయిలో ఉన్నప్పుడు వారికి చాలా ఉపయోగపడతాయి. సమాజంలో వారిని గొప్ప వ్యక్తులుగా, మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా ఎదగగలుగుతారు. పిల్లలు తమ తల్లిదండ్రుల ప్రవర్తన ఆధారంగా పెరుగుతారు. తల్లి లేదా తండ్రి చూపించే ప్రతి చిన్న అలవాటు, వారి అభ్యాసాన్ని ప్రభావితం చేస్తుంది. పిల్లల భవిష్యత్తు మంచి వైపు ఉండాలంటే తల్లిదండ్రులు ఈ విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం.



Click it and Unblock the Notifications
