Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Christmas 2024: హిందువులు క్రైస్తవ మతంలో చేరొచ్చా?.. క్రీస్తును ఇండియాలో ఎందుకు నమ్ముతారంటే?
మన దేశంలో క్రిస్టియానిటీ చాలా పెరిగిన విషయం తెలిసిందే. ప్రతి గ్రామంలో ఇప్పుడు క్రీస్తు మతస్థులు ఉన్నారు. ఊరికి ఒక చర్చ్ కట్టిస్తున్నారు. గతంతో పోలిస్తే క్రీస్తు మతంలో మారేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో వీరి సంఖ్య రోజు రోజుకూ అధికమవుతుంది. ఇంతకీ క్రిస్టియానిటీ తీసుకోవడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఎందుకు క్రీస్తు మతంలో మారేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు? యేసు ఎలాంటి పనులు చేయడం వల్ల క్రిస్టియానిటీ పెరుగుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండియాలో క్రిస్టియానిటీ ఎలా వచ్చిందంటే
మన దేశం హిందూ దేశం. అందుకే మనదేశాన్ని హిందుస్థాన్ అని కూడా పిలుస్తుంటారు. అయితే పదిహేనో శతాబ్దంలో వాస్కోడిగామా ఇండియాకు వర్తకం కోసం వచ్చినప్పుడు క్రీస్తు మతాన్ని మన దేశంలోకి తీసుకొచ్చారు. అతను బోధనలు చేయడం, క్రీస్తు గురించి ప్రజలకు వివరించడం ద్వారా ఈ మతం మన దేశంలో ప్రాచుర్యం పొందిందని చెప్పుకుంటారు. వాస్కోడిగామా కేరళ తీరంలో వచ్చారు కాబట్టి దక్షిణ భారతదేశంలో క్రీస్తుమతం ఎక్కువగా ప్రాచుర్యం పొందిందని, క్రమ క్రమంగా అది అన్ని రాష్ట్రాలకు విస్తరించిందని చెప్పుకుంటారు.

క్రైస్తవ మతంలో ఎందుకు చేరుతున్నారు?
యేసు క్రీస్తు ద్వారా వచ్చిందే ఈ క్రైస్తవ మతం. ప్రపంచంలో ఈ మతస్థులు మాత్రమే ఎక్కువగా ఉంటారు. అయితే సమానత్వం, నమ్మకం, ఆశ అనే ప్రధాన అంశాలతో ఈ క్రైస్తవ మతం మన దేశంలో మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ మతంలో సమానత్వం ఉంటుందని, చిన్న పెద్ద, డబ్బు, పేద అనే తేడా లేకుండా తమ మతంలో అందరినీ సమానంగా చూస్తామని చెప్పడం. ఇది అన్ని కారణాల్లో అత్యంత ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు. దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు, మీ పాపాలు పోగొడతాడు అని పాస్టర్లు చెప్పడం వల్ల చేరికలు ఎక్కువ అవుతున్నాయని చెబుతుంటారు.
మన దేశంలో దేవుళ్లతో మూఢనమ్మకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే క్రీస్తు డాకర్లు కూడా నయం చేయలేని జబ్బులను నయం చేస్తారని, క్రైస్తవంలో చేరితే ఎలాంటి సమస్యలు ఉండవని నమ్ముతారు. ఈ విధంగా మత ప్రచారకులు కూడా భారీగా ప్రచారం చేయడం ద్వారా ఈ మతంలో చేరే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. దయ్యాలను వదిలియ్యటం, ఇలా అనేక సంఘటనలను ప్రచారం చేయడం వల్ల ఎక్కువ ప్రాముఖ్యత చేరిందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
అన్ని మతాల్లో ఉన్న విధంగానే క్రైస్తవ మతంలో కూడా భారీగా తాయిలాలు ఉన్నాయి. అంటే ఆశ ఎక్కువగా ఉంటుంది. క్రీస్తు మతంలో చేరితే ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, డబ్బుల సమస్య ఉండదు, ఆరోగ్య సమస్యలు ఉండవు అనే ఆశ కారణంగా ఈ మతంలో చేరుతున్న వారి సంఖ్య కూడా ఇంక్రీజ్ అవుతోంది.
ఇంకొందరి అవకాశం వల్ల, డబ్బు సంపాదించాలనే కోరిక వల్ల ఆ కొందరు చాలా మందిని క్రైస్తవ మతంలో చేర్పుతున్నారు. ఎదుటి వారి బలహీనతను అవకాశంగా మార్చుకొని ఉన్నది లేనిది నమ్మబలికి వారిని బలి పశువులను చేసి తమ స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం క్రైస్తవ మతంలో చేర్చుకుంటున్నారు. ఈ కారణాల వల్ల ఇండియాలో ఎక్కువగా క్రైస్తవ మతం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అది కూడా మన దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
గమనిక: ఇది ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం, నిపుణుల అభిప్రాయం ప్రకారం అందించబడిన స్టోరీ. దీనిని మేము కరెక్ట్ అని చెప్పట్లేదు. విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.



Click it and Unblock the Notifications