Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందా..? మిసైళ్లతో దేశాల దాడులే సంకేతమా..?
ఇప్పటి వరకు ప్రపంచంలో రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయ్. ఆ యుద్ధాలతో ప్రపంచం అతలాకుతలమైంది, కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం తిండి దొరక్కుండా కోట్ల మంది ప్రాణాలు కోల్పోవడానికి మానసికంగా సిద్ధమయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 మధ్య జరిగితే రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 మధ్య జరిగింది. ఇక మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది, నిజంగా జరుగుతుందా లేదా అనే అనుమానాలు భయాలు అందరిలో నెలకొని ఉన్నాయ్.

మూడవ ప్రపంచ యుద్ధం మొదలైందా..?
ప్రస్తుతం ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం భీకరంగా జరుగుతోంది. ఇప్పటికే 35వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారని అంచనా. ఇజ్రాయిల్‌పై పాలస్తీనాలోని హమాస్‌ను మొదటగా వేల రాకెట్లను ప్రయోగించారు. దీంతో ఇజ్రాయిల్ పాలస్తీనా, గాజాపై బలంగా దాడి చేస్తోంది. పాలస్తీనాకు మద్దతాగా లెబనన్, ఇరాన్ యుద్ధం చేస్తున్నాయ్. పాలస్తీనా ఏర్పాటు చేయాలా వద్దా అనే దానిపై ఐక్యరాజ్యసమితిలో కూడా ఇటీవల పెద్ద చర్చ జరిగింది.
మూడవ ప్రపంచ యుద్ధంలో అమెరకా ఇజ్రాయిల్
అమెరికా కూడా పాలస్తీనా ఏర్పాటు చేయాల్సిందేనని ఎంత చెప్పినా ఇజ్రాయిల్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. ఇరాన్ కూడా ఇజ్రాయిల్ పై 200ల మిసైళ్లతో విరుచుకుపడింది. పాలస్తీనా విషయంలో ప్రపంచంలోని దేశాలన్నీ రెండుగా విడిపోయాయ్. ప్రపంచంలోని కొన్ని దేశాలు పాలస్తీనా ఏర్పాటుపై మద్దతుగా నిలిస్తే మరికొన్ని దేశాలు భిన్నంగా ఉన్నాయ్. మనదేశం భారత్.. పాలన్తీనా ఏర్పాటుకు మద్దతు తెలిపింది.
పాలస్తీనా ఏర్పాటును ఒప్పుకోమని దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా చేస్తామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరిస్తున్నారు. తమకు అమెరికా మద్దతు ఉందన్నారు. బ్రిటెన్, ఫ్రాన్స్ మద్దతుకూడా ఉందని చెప్పాడంతో కొలంబియా అధ్యక్షుడు గుస్తవో పెట్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటెన్, ఫ్రాన్స్, అమెరికా ఇజ్రాయిల్‌తో కలిసి యుద్ధానికి దిగడం మూడవ ప్రపంచ యుద్ధానికి సంకేతంగా ఉందన్నారు. యుద్ధం ఎప్పుడు మొదలౌతుందో అందిరికీ తెలుసుకానీ యుధ్దం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరికీ తిలియదని కొలంబియా అధ్యక్షుడు స్పష్టం చేశారు.
మూడవ ప్రపంచ యుద్ధంపై ఇన్‌స్టీన్
ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ రెండు ప్రపంచ యుద్ధాలను ఆయన కళ్లతో చూశారు. ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలు చేసిన ఆయన మూడవ ప్రపంచ యుద్ధంపైన కూడా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. "రెండు ప్రపంచ యుద్ధాలు బాంబులతో దాడి చేసుకున్నారు గానీ మూడవ ప్రపంచ యుద్ధం మాత్రం కర్రలతో దాడి చేసుకుంటారు." అని ఐన్‌స్టీన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆయన అంతర్గతం ఏంటని పరిశీలిస్తే భూమిపై దాడి చేసుకోవడానికి కూడా ఏమీ మిగలనంత భయానక నిర్మానుష్య పరిస్థితి వస్తుందని అనుకోవచ్చు.



Click it and Unblock the Notifications