Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
హ్యాపీ క్రిస్మస్ అనకుండా మెరీ క్రిస్మస్ అని ఎందుకంటారో తెలుసా?
బర్త్‌డేలు, వార్షికోత్సవాలు, పండగల వేళ హ్యాపీ.. అంటూ విష్ చేస్తుంటారు. కానీ క్రిస్మస్ రోజున మాత్రం అందరూ మెర్రీ క్రిస్మస్ అనే అంటారు. అలా ఎందుకంటారో తెలుసా?
మరో రెండు రోజుల్లో క్రిస్మస్. ప్రపంచదేశాల్లోని ప్రజలంతా క్రిస్మస్ సంబరాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సంబరాలు మొదలయ్యాయి. షాపింగ్ మాల్స్, దుకాణాలు, థియేటర్లు అన్నింటిని ముస్తాబు చేశారు. ఎక్కడ చూసినా రంగురంగుల లైట్లు, క్రిస్మస్ ట్రీలు కనిపిస్తున్నాయి. మెర్రీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు చెప్పడానికి అంతా సిద్ధమైపోయారు. అయితే ఇక్కడ ఎవరైనా ఒకటి గమనించారా.. క్రిస్మస్ రోజున ప్రతి ఒక్కరూ మెర్రీ క్రిస్మస్ అనే శుభాకాంక్షలు చెబుతుంటారు. మిగతా పండగల్లా హ్యాపీ అంటూ విష్ చేయరు. ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా..

బర్త్‌డేలు, వార్షికోత్సవాలు, పండగలు, న్యూ ఇయర్ ఇలా ప్రత్యేక సందర్భాల్లో హ్యాపీ.. అంటూ విష్ చేస్తుంటారు ప్రతి ఒక్కరూ. కానీ క్రిస్మస్ రోజున మాత్రం అందరూ మెర్రీ క్రిస్మస్ అనే అంటారు కానీ హ్యాపీ క్రిస్మస్ అనడం ఎవరూ విని ఉండరు. ఇలా చెప్పడం ఈమధ్యకాలంలో మొదలైందేం కాదు. చాలా సంవత్సరాల నుండి మెర్రీ క్రిస్మస్ అనడం పరిపాటిగా మారింది.

మెర్రీ క్రిస్మస్ VS హ్యాపీ క్రిస్మస్:
మెర్రీ క్రిస్మస్ అంటే దానికొక భావోద్వేగ కనెక్షన్‌ను తీసుకువస్తుంది. అనియంత్రిత అర్థాన్ని ఇస్తుంది. హ్యాపీ క్రిస్మస్ అనే పదంలో ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉండదు. సాధారణంగా విష్ చేసినట్లుగా అనిపిస్తుందని కొందరు అంటారు.
18, 19 వ శతాబ్దాల్లో ప్రజలు క్రిస్మస్ శుభాకాంక్షలను మెర్రీ క్రిస్మస్ అని కాకుండా హ్యాపీ క్రిస్మస్ అనే చెప్పుకునే వాళ్లని చరిత్ర చెబుతోంది. ఇంగ్లండ్‌లోని చాలా మంది ఇప్పటికీ మెర్రీ క్రిస్మస్‌కు బదులు హ్యాపీ క్రిస్మస్ అనే అంటారు.

క్వీన్ ఎలిజబెత్ 'హ్యాపీ' అనే అంటారు:
ప్రతి సంవత్సరం ఇంగ్లాండ్ క్వీన్ ఎలిజబెత్ II క్రిస్మస్ రోజున యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజలను ఉద్దేశించి 'మెర్రీ క్రిస్మస్'కు బదులు 'హ్యాపీ క్రిస్మస్' అనే చెప్పేవారు. ఇంగ్లాండ్ కింగ్ జార్జ్ V కూడా హ్యాపీ అనే పదాన్నే వాడేవారు.
బ్రిటన్‌లోని అనేక ఇతర ఉన్నత తరగతి ప్రజలు కూడా మెర్రీ స్థానంలో హ్యాపీ అనే పదాన్ని ఉపయోగిస్తారు.

మెర్రీ VS హ్యాపీ:
మెర్రీ అనే పదం వాడినా, హ్యాపీ అనే పదం వాడినా అవి ఒకే తరహా అర్థాన్ని అందిస్తాయి. ఆనందం, సంతోషం, ఉల్లాసం అనే పదాల అర్థాలనే ఇస్తాయి. కానీ మెర్రీ అనే పదానికి ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
మెర్రీ క్రిస్మస్ అని చెప్పినా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పినా అందులో ఎలాంటి తప్పు లేదని భాషాపండితులు చెబుతున్నారు.

చారిత్రక కారణాలు:
గ్రేట్ బ్రిటన్‌లోని గత చర్చి బిషప్‌లు మెర్రీ అనే పదానికి బదులు హ్యాపీ అనే పదాన్నే వాడాలని ప్రజలకు సూచించే వారిని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బ్రిటీష్ ఇంగ్లీష్ ప్రకారం 'హ్యాపీ' అనేది భావోద్వేగాన్ని, 'మెర్రీ' అనే పదం ప్రవర్తనను సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
1534 నాటిలో ఓ లేఖలో బిషప్ జాన్ ఫిషర్ హెన్రీ VIII ముఖ్యమంత్రి థామస్ క్రోమ్‌వెల్‌కు రాసిన లేఖలో 'హ్యాపీ క్రిస్మస్'కు బదులు 'మెర్రీ క్రిస్మస్' అని వాడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

సాంస్కృతిక, సాహిత్య కారణాలు:
16వ శతాబ్దంలో 1843లో చార్లెస్ డికెన్స్ రాసిన నవల 'ఏ క్రిస్మస్ కరోల్'లో మెర్రీ క్రిస్మస్ అనే పదాన్ని వాడారు. ఆ సంవత్సరం నుండే 'మెర్రీ' క్రిస్మస్ అనే పదం వాడకం మొదలైంది. వాణిజ్య క్రిస్మస్ కార్డులపైనా 'మెర్రీ క్రిస్మస్' ఉండటం ప్రారంభించారు.
క్రమంగా 'మెర్రీ' అనే పదం చాలా ప్రజాదరణ పొందింది. ప్రతి ఒకరూ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పే సమయంలో 'మెర్రీ' పదాన్ని వాడటం మొదలుపెట్టారు.
'మెర్రీ క్రిస్మస్' అనే పదబంధాన్ని ఎక్కువగా యునైటెడ్ స్టేట్స్‌లో వాడతారు. బ్రిటన్‌లో మాత్రం 'హ్యాపీ క్రిస్మస్' అనే పదబంధం బాగా ప్రాచుర్యం పొందింది.
ఫుట్‌బాల్‌ను అమెరికాలో సాకర్ అని, బ్రిటన్‌లో ఫుట్‌బాల్ అంటున్నట్లుగా ఇది కూడా అలా మారిపోయింది.



Click it and Unblock the Notifications