Latest Updates
-
కరకరలాడే బెండకాయ భుజియా.. జిగురు లేకుండా ఈ స్నాక్ చేస్తే పిల్లలు కూడా వదిలిపెట్టరు! -
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
చితి మంటల్లో కూడా కాలిపోని శరీర భాగం ఇదే..99శాతం మందికి తెలియని నిజం!
పుట్టిన ప్రతి జీవి మరణించాల్సిందే..ఇది సృష్టి నియమం. అయితే మరణం తర్వాత మనుషులను వారి వారి మతాలు, ఆచారాలను బట్టి వారి అంత్యక్రియలు ఉంటుంటాయి. కొందరు పూడ్చిపెడతారు, మరికొందరు చితిపై శవన్ని కాల్చుతారు. మనిషి మరణం తర్వాత హిందూ సాంప్రదాయంలో దహన సంస్కారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది.

భౌతికకాయాన్ని చితిపై ఉంచి నిప్పంటించినప్పుడు, అగ్ని దేవుడు శరీరాన్ని పూర్తిగా దహించి బూడిద చేస్తాడని, దేహం పంచభూతాల్లో కలిసిపోతుందని మనమంతా భావిస్తాం. కానీ మీరు వింటున్నది పూర్తిగా నిజం కాదు. సాధారణ చితి మంటల్లో మానిషి శరీరం నూటికి నూరు శాతం బూడిదగా మారదని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. భగభగ మండే మంటలను సైతం ఎదిరించి నిలిచే కొన్ని భాగాలు మన శరీరంలో ఉన్నాయి. ఆ ఆసక్తికరమైన శాస్త్రీయ రహస్యాలు ఏమిటో ఇక్కడ చూడండి.
అసలు దహన ప్రక్రియలో ఏం జరుగుతుంది?
చితికి నిప్పంటించిన తర్వాత ముందుగా చర్మం, కండరాలు, మాంసం, రక్తనాళాలు, లోపలి అవయవాలు కాలిపోతాయి. ఆ తర్వాతే మంటల వేడి ఎముకలకు చేరుకుంటుంది. అయితే మానవ ఎముకలు పూర్తిగా బూడిదగా మారాలంటే అత్యధిక ఉష్ణోగ్రత అవసరం. మన సంప్రదాయ పద్ధతిలో పేర్చే కట్టెల చితిలో ఆ స్థాయి ఉష్ణోగ్రత కంటిన్యూగా ఉండదు. అందుకే దహనం పూర్తయ్యాక కూడా బూడిదలో ఎముకల శకలాలు స్పష్టంగా కనిపిస్తాయి.
అగ్నిని జయించే ఆ శరీర భాగాలు ఇవే
-మానిషి శరీరంలో అత్యంత కఠినమైన, బలమైన పదార్థం పంటిపై ఉండే ఎనామెల్. ఇది ఎంత దృఢమైనదంటే, అత్యంత తీవ్రమైన మంటలకు కూడా సులభంగా కరగదు. అందుకే చితి ఆరిపోయాక కూడా దంతాలు పూర్తిగా కాలిపోకుండా మిగిలిపోతాయి.
-మన వెన్నెముక అడుగుభాగంలో ఉండే తోక ఎముక చాలా గట్టిగా, సాంద్రంగా ఉంటుంది. ఇది కూడా మంటల వేడిని తట్టుకుని చిన్న చిన్న శకలాలుగా మిగిలిపోతుందని సైన్స్ చెబుతోంది.
-వైద్య అవసరాల నిమిత్తం చాలామందికి ఆపరేషన్ల ద్వారా పేస్ మేకర్లు, స్టీల్ రాడ్లు, స్క్రూలు, తుంటి మార్పిడి ఇంప్లాంట్లు అమర్చుతున్నారు. ఇవి అత్యంత కఠినమైన లోహాలతో తయారవుతాయి. కాబట్టి ఇవి మంటల్లో కరగవు. అంత్యక్రియల అనంతరం బూడిద నుంచి వీటిని సులభంగా గుర్తించి వేరు చేస్తారు.
బొడ్డు కాలిపోదా? ఇది నిజమా.. అపోహా?
శరీరం అంతా కాలిపోయినా బొడ్డు భాగం మాత్రం కాలిపోకుండా అలాగే ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని, ఇదొక మూఢనమ్మకం మాత్రమేనని వైద్యశాస్త్రం కొట్టిపారేస్తోంది. బొడ్డు అనేది విడిగా ఉండే ప్రత్యేక అవయవం కాదు. అది కేవలం చర్మం, కండరాలతో ఏర్పడిన మృదువైన కణజాలం మాత్రమే. మిగతా చర్మం, మాంసం ఎలాగైతే కాలిపోతుందో.. బొడ్డు కూడా మంటల్లో పూర్తిగా బూడిదవుతుందని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
