Latest Updates
-
రిలేషన్షిప్లో ఉన్నారా.. మీపై ఉన్నది ప్రేమా లేక వ్యామోహమా.. ఎలా తెలుసుకోవాలంటే.! -
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.! -
ప్రెగ్నెన్సీలో వీటి లోపంతోనే విపరీతమైన క్రేవింగ్స్.. వీటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే.! -
కుబేర మొక్క.. మనీ ప్లాంట్ అనుకుంటే పొరపాటే.. ఇది మీ ఇంట్లో ఉంటే కనకవర్షమే.! -
పైన కరకరలాడుతూ, లోపల జ్యూసీగా.. పొరలు పొరలుగా వచ్చే బెల్లం ఖాజా మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్! -
పోషకాల గని ఈ బీట్ రూట్ ఉప్మా..మజ్జిగతో కలిపి ఇలా చేస్తే టేస్ట్ కేక! -
చుండ్రు వల్ల జుట్టు రాలిపోతోందా? అయితే మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు -
గోవా వెళ్లకుండానే ఆ రుచిని ఎంజాయ్ చేయండి.. నోరూరించే గోవా చికెన్ మసాలా తయారీ విధానం ఇదే! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఆగస్టు 19 నుంచి ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి!
టేస్టీ మంచూరియానే కాదు, కరకరలాడే అప్పాలు సైతం రెడీ.. క్యాబేజ్‌తో ఇలా ఈజీగా చేసేయండి.!
క్యాబేజ్ అనగానే చాలా మందికి వేపుడు మాత్రమే కాదు.. ఈవెనింగ్స్ స్నాక్స్‌గా టేస్టీ మంచూరియా గుర్తొస్తుంది. కానీ వీటితో అప్పాలు కూడా చేసుకోవచ్చు. క్రిస్పీగా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయంలో తినడానికి ఏం లేనప్పుడు క్యాబేజ్లో ఎక్కువ పదార్థాలు కలపకుండా టేస్టేగా పదే నిమిషాల్లో సింపుల్‌గా చేసుకోవచ్చు. క్యాబేజ్ అప్పాలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

క్యాబేజ్ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు
క్యాబేజ్- రెండు కప్పులు
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- పావు టీస్పూన్
క్యాబేజ్ అప్పాలు తయారీలో స్టఫ్ కోసం కావాల్సిన పదార్థాలు
పచ్చిమిర్చి- రెండు
ఎండుమిర్చి- రెండు
ధనియాలు- టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
అల్లం- చిన్న ముక్క
వెల్లుల్లి- మూడు రెబ్బలు
కొత్తిమీర- అరకప్పు
కరివేపాకు- కొద్దిగా
బియ్యం పిండి- ముప్పావు కప్పు
క్యాబేజ్ అప్పాలు తయారీ విధానం
క్యాబేజ్ అప్పాలు తయారీ కోసం ముందుగా క్యాబేజ్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెండు కప్పుల వరకు తీసుకోవాలి.
ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి.
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.!
ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి బరకగా రుబ్బుకోవాలి.

ఈ మిశ్రమాన్ని క్యాబేజ్ మిశ్రమంలో కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకును కడిగి వేసుకోవాలి. ఇప్పుడు ముప్పావు కప్పు బియ్యం పిండిని వేసుకుని నీళ్లు పోయకుండా కలుపుకోవాలి.
క్యాబేజ్లో నీటి శాతం ఎక్కువగా ఉన్న కారణంగా నీళ్లు అవసరం ఉండదు. పిండి ముద్దను వేళ్లతోనే మెత్తగా కలుపుకోవాలి. క్యాబేజ్‌లోని నీటితో బియ్యం పిండి తడిసి సాఫ్ట్‌గా అవుతుంది.
ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. దీని ద్వారా మసాలాలు పిండిలోకి బాగా ఊరుతాయి.
ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె కాగనివ్వాలి.
కరకరలాడే చికెన్ ముక్కలు, ఘాటైన మసాలా.. చెట్టినాడ్ చికెన్ పాప్‌కార్న్‌తో ఈవెనింగ్ సూపర్!
ఈ లోపు తడి క్లాత్ తీసుకుని పరచుకోవాలి. క్యాబేజ్ పిండి ముద్దను చిన్న ముద్దలుగా తీసుకుని వడల మాదిరిగా దానిపై ఒత్తుకుని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి.
వీటిని నూనెలో వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. వీటిని మామూలుగా తినవచ్చు లేదా టమాటా సాస్‌తో తిన్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications