Latest Updates
-
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.!
ఈ సారి రెండు తేదీల్లో వరలక్ష్మీ వ్రతం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన వ్రత ప్రాముఖ్యత.!
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. పండుగలు, వ్రతాలు, ప్రత్యేక పూజలతో ప్రతి ఇంటా, ఆలయాల్లోనూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత. కోరిన వరాలిచ్చే కరుణామయి అమ్మవారిని ఆరాధిస్తూ కలశంలోకి లక్ష్మీదేవిని ఆవాహనం చేసి మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ సారి వరలక్ష్మీ వ్రతం రెండు తేదీల్లో వచ్చింది. మరి ఏయే తేదీల్లో ఈ పండుగ ఉంది.. ఈ సమయాల్లో వ్రతం ఆచరించాలి.. పండితుల సలహాలు చూద్దాం..

తెలుగు పంచాంగ తిథుల ప్రకారం ప్రతి యేటా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ దేవి వ్రతం నిర్వహిస్తారు. ఆ ప్రకారం చూసుకుంటే ఆగష్టు 21న ఈ వ్రతం జరుపుకోవాలి. అయితే ఈ నెల 28న పౌర్ణమి తిథి శుక్రవారం రావడంతో ఈ రెండు తేదీల్లో ఏ రోజు అనేది భక్తుల్లో సందేహం నెలకొంది. కాగా, ఈ రెండు తేదీల్లోనూ వరలక్ష్మీ వ్రతం జరుపుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.
శృంగేరీ శ్రీశారదాపీఠం సంప్రదాయం మేరకు వరలక్ష్మీ వ్రతం ఆచారాన్ని సంధ్యాసమయంలో నిర్వహిస్తారు. ఆగష్టు 28న పూర్ణిమ తిథి సాయంత్రం లేకపోవడంతో దానికి ముందు వచ్చే శుక్రవారం 21వ తేదీన ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇక ఉదయం వ్రత పూజలు నిర్వహించేవారు ఆగష్టు 28న పౌర్ణమి తిథి నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.
వ్రత ప్రాముఖ్యత
కోరిన వరాలిచ్చే కరుణామయి, శక్తి స్వరూపిణి శ్రీ వరమహాలక్ష్మీ దేవి వ్రతం రోజు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. అమ్మవారిని కలశంలో ఆవాహన చేసి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వ్రత సమయంలో మహిళలు షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామార్చన, తోరపూజ, వాయనదాన వంటి పూజా కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. కుటుంబీకుల క్షేమం, భర్త ఆయురారోగ్యాలు, సంతానం అభివృద్ధి, ధనధాన్యాల అభివృద్ధి, సౌభాగ్యం కోసం మహిళలు ఈ ప్రతాన్ని పాటిస్తారు.

శ్రావణ మాసంలోనే ఎందుకు..
ప్రతి యేటా శ్రావణ మాసంలోనే వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పరమేశ్వరుడితో పాటు లక్ష్మీదేవి, గౌరీదేవి, శ్రీ మహావిష్ణువు, నాగేంద్రులను ఆరాధిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రత్రం, మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతం పాటిస్తారు. ఈ నెలలో వరలక్ష్మీ దేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్టేనని భక్తులు విశ్వసిస్తారు.
వాయినాలు, దానాలు
శ్రావణ మాసంలో ముత్తైదువు మహిళలు నోములు, వ్రతాలను ఆచరించి.. పసుపు, కుంకుమ, పండ్లు, ధాన్యాలు వంటితో వాయినం, తాంబూలం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయడం ద్వారా తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం అనే ఆధ్యాత్మిక సందేశాన్ని పంపడంగా శాస్త్రాలు చెబుతున్నాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ధాన్యాలతో పాటు వివిధ రకాల దానాలు చేయడం అనేది గ్రహాలకు సంబంధం ఉంటుంది. ముఖ్యంగా తెల్లని వస్తువులు, తెల్లని మిఠాయిలు దానం చేయడం వల్ల గురు, శుక్ర గ్రహాల అనుగ్రహం లభించి ఇంట్లో సంపద, సంతోషం, సౌభాగ్యం సిద్ధిస్తుంది.



Click it and Unblock the Notifications
