Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ!
మకర సంక్రాంతికి నువ్వులను అధికంగా ఎందుకు వాడతారో తెలుసా? దాని వెనక శాస్త్రీయ కారణమేంటంటే..
గొబ్బెమ్మలపై రేగుపండ్లతో పాటు నువ్వులు పోస్తారు. చిన్న పిల్లలకు స్నానం చేయించేటప్పుడు నీటిలో నువ్వులు వేస్తారు. పిండి వంటల్లోనూ నువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెను కూడా ఎక్కువగా వాడుతుంటారు. అసలు నువ్వులకు మకర
చాలా మంది ఎంతో ఎదురుచూసే పండగ మకర సంక్రాంతి. సంక్రాంతి అనగానే రకరకాల పిండి వంటలు, గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, కోడిపందేలు ఇలా చాలా గుర్తుకు వస్తాయి. అయితే సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చే పిండి వంటల్లో నువ్వుల వాడకం ఎక్కువగా ఉంటుంది.

గొబ్బెమ్మలపై రేగుపండ్లతో పాటు నువ్వులు పోస్తారు. చిన్న పిల్లలకు స్నానం చేయించేటప్పుడు నీటిలో నువ్వులు వేస్తారు. పిండి వంటల్లోనూ నువ్వులు ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెను కూడా ఎక్కువగా వాడుతుంటారు. అసలు నువ్వులకు మకర సంక్రాంతికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మత విశ్వాసాల ప్రకారం నువ్వులు యముదర్మరాజుకు ఇష్టమైనవిగా పరిగణిస్తారు. వాటిని అమరత్వపు విత్తనాలుగా చూస్తారు. కొన్ని పురాణాల ప్రకారం విష్ణువు స్వేద బిందువులే నువ్వులుగా మారాయని తెలుస్తోంది.

శాస్త్రీయ ప్రాముఖ్యత:
సూర్యుడి ఉత్తరాయణంలో ధనుస్సు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అందుకే దీనిని మకర సంక్రాంతి అంటారు. సంక్రాంతి తర్వాత వసంతకాలం మొదలవుతుంది. అప్పటి నుండి పగటి కాలం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నువ్వులు తినడం వల్ల శరీరం వాతావరణ మార్పులకు సిద్ధపడుతుందని తేలింది.

నువ్వుల నూనెతో మర్దనా:
మకర సంక్రాంతి పండగ రోజు నది స్నానం చేస్తుంటారు. ఈ పవిత్ర స్నానాల తర్వాత నువ్వుల నూనెత శరీరాన్ని మర్దనా చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. దీని వల్ల ఉపశమనం కలగడంతో పాటు శరీరాన్ని శుభ్రపర్చుకోవచ్చని పెద్దలు చెబుతారు.

నువ్వుల సమర్పణ
సాంప్రదాయ రాగి పాత్రలో తయారు చేసే నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని పంచకపోతే సంక్రాంతి పూర్తి కాదు. మకర సంక్రాంతి రోజు మహిళలు సుహాగన్ సమర్పిస్తారు. అందులో నువ్వే ప్రధానం.

నువ్వుల దానం:
హిందూ సాంప్రదాయం ప్రకారం నువ్వులు చాలా పవిత్రమైనవి. సంక్రాంతి రోజు ఏవైనా వస్తువులు దానం చేస్తే మంచి జరుగుతుందని అంటారు. నువ్వులు దానం చేయడం వల్ల శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు. సంక్రాంతి పండగ రోజు నువ్వులను బ్రహ్మణులకు లేదా పేదవారికి దానం చేయాలని పెద్దలు సూచిస్తారు.



Click it and Unblock the Notifications
