Latest Updates
-
హై బీపీ కంటే లో బీపీనే డేంజర్? ఇంట్లోనే రక్తపోటును నార్మల్ చేసే 5 హోమ్ రెమెడీస్! -
ఆఫీసు కుర్చీలతో ఆరోగ్య సమస్యలు.. గుండెతో పాటు వీటికి ఎనలేని రిస్క్.! -
ఇంట్లో కూరగాయలు లేవా? 2 ఉల్లిపాయలతో సూపర్ టేస్టీ పరాఠాలు..బ్రేక్ ఫాస్ట్, లంచ్ బాక్సుల్లోకి పర్ఫెక్ట్ -
గల్లీలో పుట్టి.. నేడు రూ.75 వేల కోట్ల సామ్రాజ్యంగా..ఇది చిన్న యవ్వారం కాదుగా! -
పప్పు అంటే ముఖం తిప్పుకునే వారు కూడా.. లొట్టలేసుకుని తినే షాహీ మొఘలాయ్ పెసరపప్పు -
40 ఏళ్లు దాటిన పురుషులకు ఈ టెస్టులు తప్పనిసరి! -
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే! -
మీ ఫ్రెండ్ నమ్మదగినవారేనా..చాణక్యుడు చెప్పిన ఈ టెస్ట్ ఉపయోగిస్తే తెలిసిపోతుంది! -
రెస్టారెంట్ స్టైల్ పనీర్ ఫ్రై పీస్ బిర్యానీ..ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే తినాల్సిన బ్రేక్ ఫాస్ట్ లు ఇవే..న్యూట్రిషనిస్ట్ చెప్తున్న సీక్రెట్
బక్రీద్ సందర్భంగా మీ ప్రియమైన వారికి ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.!
ప్రతియేటా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే పండుగల్లో బక్రీద్ ఒకటి. ఈ పండుగనే ఈద్-ఉల్-అధా, బక్రా ఈద్, ఈద్ అల్-అధా, ఈద్ ఖుర్బాన్ లేదా ఖుర్బాన్ బాయారామీ అని పిలుచుకుంటారు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఈ మే 27న బక్రీద్ ఉండగా.. పండుగను ఈ రోజు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 28న జరుపుకొంటున్నారు. త్యాగానికి, భక్తికి ప్రతీకగా భావించే బక్రీద్ నాడు దానధర్మాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

త్యాగానికి ప్రతీక
ఇస్లాం బోధనల ప్రకారం.. ప్రవక్త అబ్రహాంకి కలలో కనిపించిన అల్లా.. తనపై భక్తిని నిరూపించుకునేందుకు అబ్రహాం కుమారుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు. అల్లా ఆజ్ఞలతో అబ్రహాం తన కుమారుడిని బలివ్వడానికి సిద్ధపడతాడు. ప్రవక్త భక్తికి మెచ్చిన అల్లా.. ఇస్మాయెల్ స్థానంలో ఒక మూగజీవిని(మేక/పొట్టేలు/గొర్రె) ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు. ఈ త్యాగాన్ని స్మరిస్తూ బక్రీద్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే బక్రీద్ సందర్భంగా మేక లేదా పొట్టేలును బలిచ్చి మూడు భాగాలుగా చేసి ఇంట్లోకి, బంధువులకి, పేదలకు సమానంగా పంచి పండుగ చేసుకుంటారు.
బక్రీద్ కేవలం పండుగ మాత్రమే కాదని.. ఇది మనిషిలో ఉండే స్వార్థం, అసూయ, రాగద్వేషాలను పారదోలుతుందని విశ్వాసం. మానవత్వాన్ని, దాతృత్వాన్ని అలవర్చుకోవాలనే గొప్ప సందేశాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది. పండుగ రోజు ఉదయాన్నే ముస్లిం సోదరులు కొత్త బట్టలు ధరించి.. మసీదులు, ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు.
హజ్ యాత్ర
ప్రధానంగా ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా పవిత్ర మక్కాను దర్శించుకోవాలనుకుంటారు. అదే హజ్ యాత్ర. మక్కా నగరంలోని 'హజ్' యాత్ర బక్రీద్‌తోనే ముగుస్తుంది. అందుకే ఈ రోజున ముస్లింలందరూ మక్కాలోని 'కాబా' వైపు తిరిగి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ పండుగను జరుపుకొనే మీ ప్రియమైన వారికి వినూత్నంగా ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
ఈద్-ఉల్-అధా విషెస్
ఈద్ అల్-అధా ముబారక్! ఈ బక్రీద్ మీతో పాటు మీ కుంటుబీకులకు శాంతి, ఆనందంతో పాటు అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
మీకు, మీ కుటుంబానికి బక్రీద్ ముబారక్ శుభాకాంక్షలు! ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా మీ జీవితంలో ప్రతిరోజూ విశ్వాసం, ప్రేమ, ఐక్యతతో పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నాను.
ఈద్ అల్-అధా ముబారక్! మీ స్వార్థం లేని కోరికలు నెరవేరాలని, మీ త్యాగాలు గుర్తింపు పొందాలని, మీ మనసు కృతజ్ఞత, ఆనందంతో నిండిపోవాలని ఆకాంక్షిస్తున్నాను.
బక్రీద్ ముబారక్ 2026! ఈద్ పండుగ సందర్భంగా మీతో పాటు మీ ప్రియమైన వారి జీవితాల్లో దయ, విశ్వాసం, శ్రేయస్సు, శాంతి చేకూరాలని భావిస్తున్నాను.
ఈద్ అల్-అధా శుభాకాంక్షలు! మీ ప్రతీ సంబరంలో ప్రేమ, నవ్వులు పుష్కలంగా ఉండాలని, ఏడాది పొడవునా మీకు అల్లా ఆశీస్సులు లభించాలని వేడుకుంటున్నాను.
ఈద్-ఉల్-అధా విషెస్! మీ జీవితంలో విశ్వాసం, త్యాగం, కరుణ గొప్ప వరాలని.. మీ విశ్వాసాన్ని బలపరచి, మీకు శాంతిని చేకూర్చి, మీ కుటుంబలో అంతులేని ఆశీర్వాదాలు ఉండాలని ఆశిస్తున్నాను.
బక్రీద్ ముబారక్! ఈద్ పవిత్రమైన సందర్భం రోజు మీ త్యాగాలను అల్లా స్వీకరించి, మీ ప్రార్థనలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను.
ఈద్ అల్-అధా పండుగ రోజు కృతజ్ఞత నిండిన మనసుతో, ప్రపంచమంతా ఆనందం నిండాలనే స్ఫూర్తితో, ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలతో ఈద్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని వేడుకుంటున్నాను. బక్రీద్ ముబారక్ 2026!



Click it and Unblock the Notifications