Latest Updates
-
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
World Music Day 2024 : మ్యూజిక్ వింటే ఇన్ని ఆరోగ్యప్రయోజనాలు వున్నాయని మీకు తెలసా..?
ప్రతీ సంవత్సరం జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవాన్ని, మ్యూజిక్ డే ను జరుపుకుంటూ వస్తున్నాం. జీవితం ఎంత బిజీగా వున్నప్పటికీ, ఎన్ని బాధలు వున్నా సంగీతాన్ని వింటూనే వుంటాం. మన జీవితంలో విడదీలేని సంగీతం గురించి, సంగీతం వినడం వల్ల కలిగే లాభాల గురించి ఈ మ్యూజిక్ డే సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.

మ్యూజిక్ వింటే ఎన్నో లాభాలు
మ్యూజిక్ వినడం ద్వారా గుండె గనుక వేగంగా కొట్టుకుంటే కొంచం తగ్గుతుంది. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఒత్తిడిని పెంచే కార్టిజాల్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. మ్యూజిక్ వినడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ తగ్గి, హ్యాపీ, మంచి హార్మోన్లు ఉత్పత్తి అవుతాయ్. డోపామైన్, సెరటోనిన్, ఆక్సిటాసిన్, ఎండార్ఫిన్ లాంటి హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయ్.
మ్యూజిక్ వినడం వల్ల మంచి మూడ్‌లోకి వస్తారు. మెదడులో ఎమిగ్డలా సెంటర్లో ఎమోషన్స్‌ను రిలాక్స్ చేసి డిప్రెషన్‌ను, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మ్యూజిక్ బాగా ఉపయోగపడుతుంది. ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ లాంటి వాటిని ఉత్పత్తి చేసి స్టెస్ తగ్గేలా చేస్తుంది. ఎప్పుడైనా గొడవలై నిరాశలోకి జారుకున్నప్పుడు, లేదా మూడ్ బాగా లేనప్పుడు మీకు నచ్చిన పాటలను సంగీతాన్ని పెట్టుకొని వినడం వల్ల మంచి ఫలితం వుంటుంది.
సంగీతం వినడం వల్ల శరీరంలో ఏవైనా నొప్పులు వుంటే కూడా తగ్గిస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. కండరాల నొప్పులు, యముకల నొప్పుులు ఏవి వున్నా కూడా వాటి నుంచి వచ్చే బాధ తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు సంగీతాన్ని పెట్టుకుంటారు. దీనికి చాలా పెద్ద కారణం వుంది. ఆపరేషన్ చేసేటప్పుడు తీవ్రమైన మానసిక ఒత్తిడిని వైద్యులు అనుభవిస్తుంటారు. రోగి ప్రాణాలకు ఎలాంటి ముప్పూ రాకుండా వారు జాగ్రత్త పడాలి. అందుకు మానసికంగా బలంగా వుండడానికి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి వైద్యులు ఆపరేషన్ చేసే సమయంలో మ్యూజిక్‌ను పెట్టుకుంటారు.

మెదడును చురుగ్గా చేయడంలో సంగీతం కీలకంగా వ్యవహరిస్తుంది. మ్యూజిక్ వినడం వల్ల ఆహారం కూడా తక్కువగా తీసుకుంటారని రుజువైంది. దీని వల్ల ఎక్కువ తినకుండా, అధిక బరువు పెరగకుండా వుంటారు. రోజూ వ్యాయామం చేసే సమయంలో మ్యూజిక్ వింటే వర్కౌట్ కెపాసిటీ పెరుగుతుందని అంటున్నారు.
మ్యూజిక్ వినడం ద్వారా కమ్యునికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయ్. మ్యూజిక్ వినడం ద్వారా ఆహ్లాదంగా, సంతోషంగా అనిపిస్తుంది కాబట్టి స్ట్రెస్ తగ్గి వర్క్‌పైన శ్రద్ధ పెరుగుతంది. పనిపైన ఆసక్తిని పెంచే శక్తి సంగీతానికి వుందని అంటున్నారు.
మ్యూజిక్ వినడం వల్ల అనవసరమైన ఆలోచనలు తగ్గుతాయ్. రోజంతా పని చేసి రిలాక్స్ అయ్యే సమయంలో కూడా ఏవేవో ఆలోచనలు వస్తూ వుంటాయ్. అలాంటి సందర్భంలో సంగీతం వినడం మంచి ఫలితాన్నిస్తుంది. నిద్రలేమి సమస్య వున్న వారు మ్యూజిక్ వింటే కొంత ఉపశమనం పొందుతారు. మానసిక ఒత్తిడిని తగ్గించి రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.
అయితే ఈ మద్య వచ్చే మ్యూజిక్‌లో బ్యాండ్, డ్రమ్స్, పెద్ద శబ్దాలు వినడం వల్ల ప్రతికూల ప్రభావం చూపుడుతోందని అంటున్నారు. వీటివల్ల తలనొప్పి వస్తుంది. ఇయర్ డ్రమ్స్ పాడైపోయి, దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురౌతారని వైద్యులు చెబుతున్నారు.
మ్యూజిక వినేటప్పుడు ఇయర్ ఫోన్స్‌ను రెండు చెవుల్లో కాకుండా ఒక చెవిలో పెట్టుకోవాలి. ఎక్కువ శబ్దంతో వినకుండా వాల్యూమ్‌ను తక్కువ చేసుకొని వినడం వల్ల చెవి సంబంధిత సమస్యలు రాకుండా వుంటాయని అంటున్నారు.



Click it and Unblock the Notifications
