Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
Ganga Vilas: అతి పొడవైన రివర్ క్రూయిజ్ జర్నీ.. విలాసం, వినోదం, చుక్కలు చూపించే ధర
గంగా విలాస్ క్రూయిజ్ నౌక ప్రయాణం ఎలా సాగుతుంది, ఎలాంటి పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించొచ్చు, జర్నీ ఎన్ని రోజులు ఉంటుంది, ఇందులో ప్రయాణించాలంటే టికెట్ ధర ఎంత అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
3 వేల 200 కిలోమీటర్ల ప్రయాణం, 51 రోజుల జర్నీ, అత్యంత విలాసవంతమైన సౌకర్యాలు, వావ్ అనిపించే అంశాలు, స్పా, గేమ్స్ ఇంకా ఎన్నో విశేషాలు అవన్నీ ఒకే నౌకలో దాని పేరే ఎంవీ గంగా విలాస్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ యాత్ర ఇది. ఈ ప్రయాణం ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుండి అస్సాంలోని డిబ్రూగర్హ్ వరకు ఉంటుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్‌ను ప్రారంభించారు. గంగా విలాస్ క్రూయిజ్ నౌక ప్రయాణం ఎలా సాగుతుంది, ఎలాంటి పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించొచ్చు, జర్నీ ఎన్ని రోజులు ఉంటుంది, ఇందులో ప్రయాణించాలంటే టికెట్ ధర ఎంత అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారీ ఓడ, ఎన్నో సౌకర్యాలు:
(image: twitter/tourismgoi)
* ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్ 62 మీటర్ల పొడవు ఉంటుంది.
* 12 మీటర్ల వెడల్పు, 1.4 మీటర్ల లోతు ఉంటుంది.
* గంగా విలాస్ క్రూయిజ్‌లో 18 సూట్ రూములు ఉంటాయి.
* గంగా విలాస్‌లో ఒకేసారి 36 మంది ప్రయాణించవచ్చు.
* ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుండి 3,200 కిలోమీటర్ల దూరంలోని అస్సాం డిబ్రూగర్హ్ వరకు 51 రోజుల్లో వెళ్తుంది.
* ఈ క్రూయిజ్ ప్రయాణించే దారి వెంట ఉండే ప్రాంతాలు వాటి సంస్కృతుల నుండి ప్రేరణ పొంది ఈ నౌకను తీర్చిదిద్దారు. రంగులు, డిజైన్లు వాటి నుండే తీసుకున్నారు.
* గంగా విలాస్ క్రూయిజ్ అత్యంత విలాసంగా ఉంటుంది.
* సీలింగ్ కిటికీల నుండి రోజంతా ప్రకృతి అందాలు చూడవచ్చు.
* లాంజ్‌లో సెమీ స్లీపర్ సీట్లలో కూర్చుని ఎంజాయ్ చేయవచ్చు.
* ప్రయాణికులకు కాలక్షేపం కోసం చాలా సౌకర్యాలు ఉంటాయి.
* గంగా విలాస్ క్రూయిజ్‌లో స్పా, బాడీ మసాజ, జిమ్, సెలూన్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

చుక్కలో టికెట్ ధర:
(image: twitter/tourismgoi)
* ఎంతో సౌకర్యవంతంగా, విలాసవంతంగా ఈ క్రూయిజ్‌ను తీర్చిదిద్దారు.
* ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉండే సౌకర్యాలు ఇందులో ఉంటాయి. అందుకే టికెట్ ధరలు కూడా భారీగానే ఉంటాయి.
* ఈ క్రూయిజ్‌లో ఒక్కరోజు ప్రయాణించాలంటే రూ. 25 వేల కంటే ఎక్కువ ఖర్చవుతుంది.
* ఈ నౌక మొత్తం 51 రోజుల పాటు సాగుతుంది. 51 రోజుల పాటు ఇందులో గడపాలంటే మాత్రం రూ.12.59 లక్షలు చెల్లించాల్సిందే.
* ఈ ఎంవీ గంగా విలాస్ నౌకను పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దారు.
* ఈ నౌక నదిలో ప్రయాణించేటప్పుడు ప్రకృతికి ఎలాంటి నష్టం కలిగించకుండా ఉండేలా ప్రత్యేకంగా దీనిని తీర్చిదిద్దారు.
* ఈ నౌక నుండి ఎలాంటి కాలుష్యం వెలువడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
* శబ్ధం రహితంగా, కాలుష్య రహితంగా సాగుతుంది గంగా విలాస్ ప్రయాణం.
* వీటితో పాటు విలాసవంతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచడంతో టికెట్ ధరలు భారీగా ఉన్నాయి.

ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుందంటే..
* ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణం 51 రోజుల పాటు సాగుతుంది.
* వారణాసి నుండి ప్రయాణం ప్రారంభమవుతుంది.
* ఘాజీపూర్, బక్సర్, రామ్‌నగర్ మీదుగా 8వ రోజు పాట్నా చేరుకుంటుంది.
* పాట్నా నుండి పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు వెళ్తుంది.
* కోల్‌కతా నుండి పక్క దేశం బంగ్లాదేశ్‌లోకి వెళ్తుంది.
* బంగ్లాదేశ్‌లో 15 రోజుల పాటు ఈ క్రూయిజ్ విహరిస్తుంది.
* తర్వాత అస్సాంలోకి ప్రవేశిస్తుంది.
* చివరికి డిబ్రూగర్హ్‌కు చేరుకోవడంతో 51 రోజుల ప్రయాణం ముగుస్తుంది.
51 రోజులూ ప్రయాణించక్కర్లేదు:
ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్‌లో ప్రయాణించాలనుకుంటే మొత్తం 51 రోజులు వెళ్లాల్సిందేనా అనే డౌట్ రావొచ్చు. చాలా మంది ఇన్ని రోజుల పాటు ప్రయాణించలేరు. అందుకే ఒక చోటు నుండి మరో చోటు వరకు వెళ్లేలా కూడా ఈ క్రూయిజ్‌లో ప్రయాణించవచ్చు.
చాలా ప్రాంతాల గుండా గంగా విలాస్ క్రూయిజ్ ప్రయాణిస్తుంది. అందులో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కొంత మొత్తం చెల్లించి ప్రయాణించవచ్చు.
ఏమేం చూడొచ్చంటే..
* ప్రపంచ వారసత్వ ప్రదేశాలు
* జాతీయ ఉద్యానవనాలు
* నది ఘాట్‌లు
* బీహార్‌లోని పాట్నా
* ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్
* పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా
* బంగ్లాదేశ్‌లోని ఢాకా
* అస్సాంలోని గౌహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను చూడవచ్చు.



Click it and Unblock the Notifications