Latest Updates
-
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
సీనియర్ నటి పావలా శ్యామల ఆత్మహత్యాయత్నం.. కూతురుతో సహా సూసైడ్ ప్రయత్నం
కోట్లాది మంది అభిమానులు.. విలాసవంతమైన జీవితం.. వందల కోట్ల ఆస్తులు.. దేశవ్యాప్తంగా ఫాలోయింగ్. సినీరంగం గురించి చాలా మంది అనుకునే మాట. కానీ ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. సినీరంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ లగ్జరీ లైఫ్ జీవించడం లేదు... కేవలం 10 శాతం మంది మాత్రమే సంపాదించుకుంటున్నారు, జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మిగిలిన నటీనటుల పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్లుగానే ఉంది.
వృద్దాశ్రమంలో చేరిన పాకీజా
పేదరికంలో మగ్గుతూ.. తినడానికి తిండిలేక, అనారోగ్యంతో బాధపడుతూ ఎవరైనా సాయం చేయకపోతారా? అని ఎదురుచూస్తున్న వారు ఎందరో. వైభవంగా బతికి చివరి రోజుల్లో పట్టెడన్నం దొరక్క అలాగే ప్రాణాలు కోల్పోయిన నట దిగ్గజాలు కోకోల్లలు. రెండ్రోజుల క్రితం కమెడియన్ పాకీజా పట్టించుకునేవారు లేక తూర్పుగోదావరి జిల్లాలోని ఓ వృద్ధాశ్రమం ఆశ్రయం కల్పించింది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన సోదరులు చిరంజీవి, నాగబాబు సహా పలువురు ప్రముఖులు ఆదుకున్నప్పటికీ ఆమె కష్టాలు తీరలేదు. తాజాగా సీనియర్ నటి పావలా శ్యామలకు సంబంధించిన ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

తీవ్ర ఇబ్బందుల్లో పావలా శ్యామల
నాటక రంగం నుంచి వచ్చి సినీరంగంలో స్థిరపడ్డారు పావలా శ్యామల. వందలాది చిత్రాల్లో తన కామెడీ టైమింగ్‌తో ప్రజల్ని కడుపుబ్బా నవ్వించిన పావలా శ్యామల ప్రస్తుతం వయోభారంతో, అనారోగ్య సమస్యలతో దుర్బర జీవితాన్ని గడుపుతున్నారు. ఆమె పరిస్థితి తెలిసి పలువురు సినీ పెద్దలు, ప్రభుత్వం సాయం చేసినా శ్యామల కష్టాలు మాత్రం తీరలేదు. ఇటీవల ఆమె కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. తనకు ఆసరాగా ఉన్న కూతురు మంచానికే పరిమితం కావడం, తాను కూడా కదల్లేని స్థితికి చేరడంతో శ్యామల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పావలా శ్యామలను రక్షించిన పోలీసులు
ఇన్ని రోజులు ఆశ్రయం కల్పించిన ఓ కేర్ సెంటర్ వీరిని బయటకు పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నా అనేవాళ్లు లేక వీరిద్దరూ ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉన్న వీరిని పోలీసులు రక్షించి ఆర్‌కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్‌లో చేర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పావలా శ్యామల తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా వార్తలు రావడంతో చిత్ర పరిశ్రమ షాకైంది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల తన గోడు వెళ్లబోసుకున్నారు.
ఈ బతుకు మాకొద్దు
ఎంతమంది ఆదుకున్నా మా కష్టాలు తీరవు.. చచ్చిపోదామనుకుని మనస్పూర్తిగా నిర్ణయించుకున్నాం. అలాంటి సమయంలో ఆర్‌కే ఫౌండేషన్ వాళ్లు నన్ను మా అమ్మాయిని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చి బాగానే చూసుకుంటున్నారు. మా అమ్మాయి ప్రాణం, నాతోనే ఉంటుంది. తెల్లారిలేస్తే ఏమవుతుందో? నా బిడ్డ ఏమవుతుందోనని భయపడుతూనే ఉన్నా. సడెన్‌గా శరీరంలో వణుకు వచ్చి.. గొంతు పూడుకుపోతోంది, ఇక ఇవాళ్టీతో అయిపోయినట్లేనని అనుకుంటా. దేవుడు నా బిడ్డ కోసం నన్ను బతికిస్తున్నాడు. మందుల ఖర్చు నెలకు 10 వేల రూపాయలు అవుతోంది. నేను చనిపోతే.. నా బిడ్డ ఒంటరిది అయిపోతుందని ఇద్దరం చనిపోదామని అనుకున్నాం. జీవితంలో చివరిదశకు వచ్చేశా.. ఈ బతుకు మాకొద్దు, మేం చచ్చిపోతామని పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Credit: Filmibeat



Click it and Unblock the Notifications











