Akhanda 2 Day 1 Collections: అఖండ 2 మూవీకి షాకింగ్ టాక్.. బాలకృష్ణ సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

By Rajababu A

నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు.

భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఫైనాన్స్ సమస్యలు పరిష్కరించుకొని డిసెంబర్ 12వ తేదీన రిలీజైంది. ఈ చిత్రం డిసెంబర్ 11వ తేదీన ప్రీమియర్లతో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీమియర్ కలెక్షన్లు, తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..


Akhanda 2 Day 1 Expected Box Office

అఖండ సినిమా భారీ విజయం సాధించడంతో అఖండ 2 తాండవం సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా మలిచారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడానికి ఈ సినిమాలో భారీగా వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ వర్క్ చేశారు. స్టార్ హీరో, హీరోయిన్లు, అలాగే టాప్ సాంకేతిక నిపుణులు, ప్రొడక్షన్ వాల్యూస్ కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాకు ఇప్పటి వరకు 145 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల బిజినెస్ చాలా క్రేజీగా జరిగింది. ఆంధ్రా, నైజాం థియేట్రికల్ హక్కులు రికార్డు స్థాయికి అమ్ముడుపోయాయి. ఈ సినిమా ఉత్తరాంధ్ర హక్కులు 13.5 కోట్ల రూపాయలు, గుంటూరు జిల్లా రైట్స్ 9.5 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 8.25 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రైట్స్ 6.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7 కోట్ల రూపాయలు, నెల్లూరు రైట్స్ 4.5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 26 కోట్ల రూపాయల మేర పూర్తి అయింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

అఖండ 2 సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ముఖ్యంగా నార్త్ అమెరికాలో మందకోడిగానే బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం ప్రీమియర్లకు సుమారుగా 415K డాలర్లు వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో సుమారుగా 4.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. 60K డాలర్లు రాబట్టే అవకాశం ఉంది అని వెల్లడించారు. ఈ సినిమా అమెరికాలో ప్రీమియర్లు, తొలి రోజు కలిపి 5 నుంచి 6 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. యూకే, ఆస్ట్రేలియా, ఇతర ప్రాంతాల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేశారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లకు మధ్యస్థంగానే రెస్పాన్స్ కనిపించింది. టికెట్ రేట్ల పెంపు ప్రభావం ప్రత్యక్షంగా కనిపించింది. ఈ సినిమా ఆంధ్రా, నైజాంలో కలిపి ప్రీమియర్లకు 8.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు ఈ చిత్రం 10 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు. దాంతో ఈ చిత్రం తొలి రోజు 18.5 కోట్ల నుంచి 20 మేర వసూళ్లు సాధించవచ్చు. ఈ సినిమాకు పాజిటివ్‌గా ఏవైనా అంశాలు కలిసి వస్తే.. ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

అఖండ 2 చిత్రం విడుదల వాయిదా పడకముందు ఉన్న భారీ క్రేజ్ ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా తొలి రోజు సుమారుగా 28 నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం ఈ చిత్రం 250 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Credit: Filmibeat

Story first published: Friday, December 12, 2025, 14:22 [IST]
Desktop Bottom Promotion