Latest Updates
-
షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ స్వామిని దర్శిస్తే డయాబెటిస్ పూర్తిగా నయం! -
కస్టర్డ్ పౌడర్,చక్కెర లేకుండానే..ఇంట్లోనే క్రీమీ,హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్..ఎలా చేసుకోవాలంటే.. -
ఢిల్లీ ఫేమస్ చికెన్ చంగేజీ..నాన్, బటర్ రోటీ, చపాతీ, బగారా రైస్, అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు! -
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్!
Akhanda 2: అఖండ 2 కొత్త విడుదల తేదీ.. 14 రీల్స్ ప్లస్ కీలక ప్రకటన..
Akhanda 2: టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన అంశం అఖండ 2 ( Akhanda 2) విడుదల వాయిదా. మరికొన్ని గంటల్లో సినిమా థియేటర్లలోకి విడుదల కాబోతుండగా వాయిదా పడటం అందరికీ షాక్ ఇచ్చింది. నందమూరి అభిమానులు దీనిపై తీవ్రమైన అసంతృప్తిని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. 'ఇంత పెద్ద ప్రాజెక్ట్.. ఇంత పెద్ద స్టార్ హీరో సినిమా.. ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇలాంటి తప్పులు ఎలా జరుగుతాయి?'అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖండ 2 నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ఏం ప్రకటన చేసింది?
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం 'అఖండ తాండవం' కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు నార్త్ ఇండియా ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 4న ప్రీమియర్ షోలతో ప్రారంభమై, డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సింది. అయితే విడుదలకు కొన్ని గంటల ముందు అనుకోని పరిణామాలు చోటుచేసుకోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అభిమానుల అంచనాలు, థియేటర్లలో ఏర్పాట్లు, బుకింగ్స్ అన్ని సిద్ధంగా ఉన్నా చివరి నిమిషంలో రిలీజ్‌పై సందిగ్ధత నెలకొనడంతో అందరూ నిరాశ చెందారు.

అఖండ 2 తాండవం నిర్మించిన 14 రీల్స్ ప్లస్ సంస్థకు, హీరోస్ ఇంటర్నేషనల్ అనే సంస్థకు మధ్య ఉన్న పాత ఆర్థిక ఒప్పందాలు ప్రధాన వివాదంగా మారాయి. ఈ ఫైనాన్షియల్ అగ్రిమెంట్లపై తొలుత అంతర్గత చర్చలు జరిగినా, వివాదం పరిష్కారం కాకపోవడంతో హీరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో కోర్టు సినిమా విడుదలపై స్టే విధించగా, ఇప్పటికే సిద్ధమైన దేశవ్యాప్తంగా ఉన్న షోలు, ఓవర్సీస్ స్క్రీనింగ్స్ అన్నీ నిలిచిపోయాయి. ఇండస్ట్రీ పరంగా, ప్రేక్షకులపరంగా ఇది చాలా అరుదుగా జరిగే పరిస్థితి. ముఖ్యంగా బాలకృష్ణలాంటి అగ్ర హీరో సినిమా పూర్తి స్థాయిలో ఆగిపోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.
అఖండ 2 విడుదలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. 'అఖండ 2ని ఈ రోజు థియేటర్లకు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేశాం. కానీ కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. అందువల్ల సినిమా ఈరోజు విడుదల చేయడం సాధ్యం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో కూడా మాకు తోడుగా నిలిచిన బాలకృష్ణ గారికి, దర్శకుడు బోయపాటి శ్రీనుకు కృతజ్ఞతలు. అఖండ 2 ఎప్పుడెప్పుడు వచ్చినా బ్లాక్‌బస్టర్ అవడం ఖాయం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం" అని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో అఖండ 2 మేకర్స్ సోషల్ మీడియాలో ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన రావడంతో అభిమానుల్లో మరోసారి కన్ఫ్యూజన్ మొదలైంది. ఈ పరిణామాలతో బాలయ్య అభిమానుల్లో తీవ్ర అసహనం నెలకొంది. సినిమా విడుదల వాయిదా పడటంతో వారికి తీవ్ర నిరాశను కలిగించింది. సోషల్ మీడియాలో నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి కొత్త రిలీజ్ డేట్‌పై ఉంది. అఖండ 2 ఇప్పటికే ఎన్నోసారి వాయిదా పడటంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. అఖండ 2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? చాలా మంది భావిస్తున్నట్లుగా ఈ సినిమా సంక్రాంతి రేసులోకి తీసుకువస్తారా? లేక మరింత ఆలస్యం చేస్తారా? అన్నది త్వరలోనే తెలుస్తుంది.
Credit: Filmibeat



Click it and Unblock the Notifications











