సుడిగాలి సుధీర్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన ‘ఢీ’ షో బ్యూటీ..

By Staff

Sudigali Sudheer-Aqsa Khan: డాన్సర్స్ అక్సా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈటీవీ డాన్స్ షో 'ఢీ' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్స్ అక్సా ఖాన్, ఢీ 10లో చేసిన 'స్వింగ్ జర' పెర్ఫార్మెన్స్‌తో ఒక్కసారిగా స్టార్‌డమ్ సంపాదించింది. తనదైన శైలిలో డ్యాన్స్‌ చేసి ప్రేక్షకులను, షో జడ్జ్‌లను మంత్రముగ్ధులను చేసింది. జావేద్ మాస్టర్ కొరియోగ్రఫీ, ఫినాలేలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి వేసిన స్టెప్పులు ఆమెకు మరింత క్రేజ్ తెచ్చాయి. తాజాగా సుడిగాలి సుధీర్‌తో పెళ్లి అంటూ వచ్చిన రూమర్స్‌పై స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?

NTR- Ram Charan : ఎన్టీఆర్ అంటే అంత భయమా? రామ్ చరణ్ కామెంట్స్ వైరల్

ఈటీవీ డాన్స్ షో'ఢీ' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాన్సర్ అక్సాఖాన్ తాజాగా తనపై వస్తున్న రూమర్స్‌పై ఓ ఇంటర్వ్యూలో ఓపెన్‌గా స్పందించారు. స్టార్‌డమ్‌తో పాటు అనవసరమైన ప్రచారాలు కూడా వస్తాయన్న నిజాన్ని మరోసారి గుర్తు చేస్తూ, తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న తప్పుడు వార్తలు తనను ఎంతగా బాధించాయో వివరించారు.


Dhee Fame Dancer Aqsa Khan Breaks Silence on Sudigali Sudheer Marriage Rumours

ఇంటర్వ్యూలో భాగంగా 'మీపై వచ్చిన రూమర్స్ ఏమైనా ఉన్నాయా?' అన్న ప్రశ్నకు అక్సా ఖాన్ స్పందిస్తూ, 'ఒకటి కాదు... చాలా ఉన్నాయి' అంటూ నవ్వేశారు. అయితే వెంటనే ఓ షాకింగ్ సంఘటనను గుర్తుచేశారు. గతేడాది తాను ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు తనను గుర్తుపట్టి, అభిమానిగా పరిచయం చేసుకున్నాడని చెప్పారు. తన ప్రోగ్రామ్స్ అన్నీ రెగ్యులర్‌గా చూస్తానని చెప్పి సెల్ఫీ కూడా తీసుకున్నాడట. కానీ కాసేపటికి అదే వ్యక్తి, 'మీకు పెళ్లి అయిపోయిందని విన్నాను'అని అనడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని అక్సా వెల్లడించారు. 'నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏదైనా నిజమైతే నేనే సోషల్ మీడియాలో చెబుతాను కదా' అని క్లారిటీ ఇచ్చానని, అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు.

MSVPG Day 6 Box Office Collections:'మన శంకరవరప్రసాద్ గారు'ఆల్‌టైమ్ రికార్డ్.. చిరు మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇక మరో రూమర్ తనను మరింత హర్ట్ చేసిందని అక్సా స్పష్టం చేశారు. సుడిగాలి సుధీర్ డాన్స్ షోల ద్వారా తనకు మెంటర్ గా వ్యవహరించారు. అలాంటి వ్యక్తిని పెళ్లి కోసం ప్రపోజ్ చేశానంటూ ప్రచారం జరిగిందని, అది విని నిజంగా షాక్ అయ్యానని అన్నారు. 'సుధీర్ సార్ నాకు మెంటర్. గురువుగా భావిస్తాను. అలాంటి వ్యక్తిని ఎలా ప్రపోజ్ చేస్తాను? ఆయన పట్ల నాకు ఎప్పుడూ గౌరవమే. ఆ రూమర్ విన్నప్పుడు చాలా బాధపడ్డాను' అంటూ భావోద్వేగంగా చెప్పారు. ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇద్దరి మధ్య ఉన్న గురు-శిష్య సంబంధాన్ని తప్పుగా చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

The Rajasaab Day 8 Collections: ది రాజాసాబ్ తొలి వారం కలెక్షన్స్‌.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఇక తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. 'ప్రతి ఆర్టిస్ట్ లైఫ్‌లో రూమర్స్ రావడం సహజమే. కానీ, వాటిని నేను పట్టించుకోను. ఇప్పటికీ నేను సింగిల్‌నే. నాకు నా కెరీర్‌లో ఓ స్పెషల్ గోల్ ఉంది'అని స్పష్టం చేశారు. రిలేషన్‌లో లేనప్పటికీ తనపై అనవసర రూమర్స్ క్రియేట్ చేయడం సరికాదని, ఆర్టిస్ట్‌ల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరారు. ఇలా అక్సా ఖాన్ చేసిన ఈ నిజాయితీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్‌డమ్‌తో పాటు వచ్చే రూమర్స్‌ను ధైర్యంగా ఎదుర్కొంటూ, తన కెరీర్ ను కొనసాగిస్తున్నానని చెప్పుకొచ్చింది.

Credit: Filmibeat

Desktop Bottom Promotion