Latest Updates
-
అతిథులను ఆశ్చర్యపరిచే అద్భుతమైన దీపావళి స్వీట్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా? మందులు లేకుండా ఈ 3 సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టండి! -
బ్రెడ్ లేకుండా బ్రెడ్ పకోడీ చేయడం ఎలా? టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే.. -
బంగారు నగరమైన శ్రీలంకకు రావణాసురుడు రాజు ఎలా అయ్యాడో తెలుసా? -
మగాళ్లలో వంధ్యత్వానికి కారణం అండర్ వేర్ ఏనా? డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజం! -
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం!
April 2026 Festivals: హనుమాన్ జయంతి నుండి అక్షయ తృతీయ వరకు..ఏప్రిల్ నెల పండుగల పూర్తి జాబితా!
2026వ సంవత్సరం వసంత రుతువులో భాగమైన మార్చి నెల ముగింపు దశకు చేరుకుంటోంది. ఇక అందరి చూపు ఉత్సాహభరితమైన ఏప్రిల్ వైపు మళ్లింది. ఏప్రిల్ 2026 కేవలం క్యాలెండర్ లోని ఒక నెల మాత్రమే కాదు, అనేక మతాలు, సంప్రదాయాలు, వ్యవసాయ సంబరాల అందమైన కలయిక.
భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే ఎన్నో అపురూపమైన వేడుకలకు ఏప్రిల్ నెల వేదిక కాబోతోంది. బంధుమిత్రులతో కలిసి ఆనందాలను పంచుకోవడానికి ఈ మాసం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ఈ పండుగల తేదీలను ముందుగానే తెలుసుకుంటే మీ వ్యక్తిగత, వృత్తిపరమైన పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు.

2026 ఏప్రిల్ లో హిందూ పండుగలు
ఏప్రిల్ 2 - హనుమాన్ జయంతి: చైత్ర పౌర్ణమి నాడు వాయుపుత్రుడు, ఆంజనేయ స్వామి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా కన్నుల పండువగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి.
ఏప్రిల్ 14 - తమిళ నూతన సంవత్సరం (పుత్తాండు): సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశించే ఈ రోజును తమిళులు కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ఇది వారి ఉట్టు పంట చేతికి వచ్చే ఆనంద సమయం.
ఏప్రిల్ 15 - మలయాళ,బెంగాలీ నూతన సంవత్సరం: కేరళ (విషు), పశ్చిమ బెంగాల్ (పొయిలా బైశాఖ్) రాష్ట్రాల ప్రజలు తమ కొత్త సంవత్సరాన్ని విశేషమైన ఆచారాలతో స్వాగతిస్తారు.
ఏప్రిల్ 19 - అక్షయ తృతీయ: ఏది కొన్నా అక్షయంగా మారుతుందని నమ్మే అత్యంత పవిత్రమైన రోజు. బంగారం కొనుగోలుకు ఇది శుభదినం. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఏప్రిల్ 23 - గంగా సప్తమి: పుణ్యనది గంగామాతను స్మరించుకుంటూ, నదీ తీరాలలో ప్రత్యేక హారతులు నిర్వహించే పర్వదినం.
ఏప్రిల్ 25 - సీతా నవమి: లోకమాత, శ్రీరామచంద్రుని ధర్మపత్ని అయిన సీతాదేవి అవతరించిన పుణ్య దినం.
ఏప్రిల్ 30 - నరసింహ జయంతి: దుష్ట శిక్షణ కోసం శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహుడిగా అవతరించిన రోజు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తారు.
2026 ఏప్రిల్ లో క్రైస్తవుల పండుగలు
ఏప్రిల్ 2 - పవిత్ర గురువారం: ఏసుక్రీస్తు తన శిష్యులతో కలిసి చేసిన చివరి విందును గుర్తుచేసుకునే రోజు.
ఏప్రిల్ 3 - గుడ్ ఫ్రైడే: మానవాళి పాపాలను భరిస్తూ ఏసుక్రీస్తు సిలువపై ప్రాణత్యాగం చేసిన పవిత్ర దినం.
ఏప్రిల్ 4 - పవిత్ర శనివారం: ఏసుక్రీస్తు పునరుత్థానం కోసం విశ్వాసులు ప్రార్థనలతో వేచిచూసే సమయం.
ఏప్రిల్ 5 - ఈస్టర్ ఆదివారం: మరణాన్ని జయించి ఏసుక్రీస్తు తిరిగి లేచిన ఆనందకరమైన రోజు. ఈ రోజున చర్చిల్లో ప్రార్థనలు అంబరాన్నంటుతాయి.

2026 ఏప్రిల్ లో సిక్కుల పండుగలు
ఏప్రిల్ 14 - బైసాఖీ: 1699లో ఖల్సా పంత్ స్థాపనకు గుర్తుగా సిక్కులు దీనిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పంజాబ్, నార్త్ ఇండియాలో రైతులు తమ పంట ఇంటికి వచ్చిన సంతోషంలో డోలు వాయిద్యాలు, నృత్యాలతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ ఇది.
2025 ఏప్రిల్ లో బౌద్ధుల పండుగలు
ఏప్రిల్ 13 నుండి 15 వరకు - థేరవాద నూతన సంవత్సరం (సాంగ్‌క్రాన్): ఆగ్నేయాసియాలోని బౌద్ధులు జరుపుకునే నీటి పండుగ ఇది. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ పాత కల్మషాలను కడిగేసుకుని, నూతన ఉత్తేజంతో సామాజిక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ వేడుకను జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications
