Latest Updates
-
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.!
Hanuman Mantras: మోస్ట్ పవర్ ఫుల్ హనుమాన్ మంత్రాలు..దెయ్యాలు కూడా గజగజ వణకాల్సిందే!
శ్రీరామచంద్రుని పరమ భక్తుడు, వాయు దేవుని పుత్రుడు అయిన ఆంజనేయ స్వామి జన్మదినాన్ని మనం హనుమాన్ జయంతిగా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాము. దేశవ్యాప్తంగా ఇవాళ(ఏప్రిల్ 2,2026) హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. అపారమైన బలానికి, నిస్వార్థమైన భక్తికి, ధైర్యానికి ప్రతీక హనుమంతుడు.
ఏ పని తలపెట్టినా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఆపద్బాంధవుడిగా ఆదుకునేది మారుతి ఒక్కడే. 2026 హనుమాన్ జయంతి సందర్భంగా మీ జీవితంలోని ఆటంకాలను తొలగించి, సకల విజయాలను ప్రసాదించే కొన్ని అత్యంత శక్తివంతమైన హనుమాన్ మంత్రాలు ఇక్కడ చూడండి. ఈ మంత్రాలను నిత్యం పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.

1. శ్రీ హనుమాన్ మూల మంత్రం (సర్వకార్య సిద్ధి కోసం)
"ఓం హనుమతే నమః"
అర్థం: ఓ ఆంజనేయ స్వామీ నీకు నా హృదయపూర్వక నమస్కారాలు.
ఫలితం: ఇది చాలా చిన్నదైనప్పటికీ అత్యంత ప్రభావవంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనసులోని ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి, ప్రశాంతత చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ముందుగా ఈ మంత్రాన్ని స్మరిస్తే ఆ పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది.
2. హనుమాన్ గాయత్రీ మంత్రం (జ్ఞానం,ధైర్యం కోసం)
"ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి..తన్నో హనుమత్ ప్రచోదయాత్ "
అర్థం: అపారమైన బలశాలి అయిన ఆంజనేయుని నేను ధ్యానిస్తున్నాను. ఆ హనుమంతుడు మాకు స్ఫూర్తినిచ్చి, ఎల్లప్పుడూ సరైన మార్గదర్శనం చేయుగాక.
ఫలితం: విద్యార్థులు, ఉద్యోగులు ఈ మంత్రాన్ని పఠించడం ఎంతో శ్రేయస్కరం. ఇది బుద్ధిబలాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అలాగే, శారీరక, మానసిక ధైర్యాన్ని ప్రసాదించి ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.
3. అసాధ్య సాధక మంత్రం (తీరని కోరికలు నెరవేరడానికి)
"అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద..రామ దూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో"
ఫలితం: ఓ స్వామీ నీకు అసాధ్యమైనది ఏముంది? నువ్వు తలచుకుంటే ఏదైనా సాధ్యమే, నా ఈ కార్యాన్ని నెరవేర్చు అని అర్థం వచ్చే ఈ మంత్రం ఎంతో శక్తివంతమైనది. పనులు నిలిచిపోయినా, అప్పుల బాధలు ఉన్నా ఈ మంత్రాన్ని నమ్మకంతో జపిస్తే వెంటనే పరిష్కారం దొరుకుతుంది.
4. భయ నివారణ మంత్రం (గ్రహ దోషాలు, శత్రు భయం తొలగడానికి)
"ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహా"
అర్థం: అంజనా దేవి గర్భవాసాన జన్మించినవాడు, ఎవరికీ సాధ్యంకాని అంతులేని మహాబలం కలిగిన ఆ భగవంతునికి నా వందనాలు.
ఫలితం: మీకు తెలియని భయాలు వెంటాడుతున్నా, శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, లేదా అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ మంత్రం ఒక కవచంలా పనిచేస్తుంది. చెడు శక్తులు, నరదృష్టి మీ దరిచేరవు.

5. శత్రు నాశన, రక్షా మంత్రం
"ఓం ఐం హ్రీం హనుమతే రామదూతాయ లంకావిధ్యంసనాయ అంజనీ గర్భ సంభూతాయ శాకినీ డాకినీ విధ్యంసనాయ కిలికిలి బుబుకారేణ విభీషణాయ హనుమద్దేవాయ ఓం హ్రీం శ్రీం హౌం హా ఫట్ స్వాహా"
అర్థం: శ్రీరాముని నమ్మిన బంటు, లంకా దహనుడు, అంజనీ పుత్రుడు, సకల దుష్టశక్తులను (శాకిని, డాకిని తదితర) నాశనం చేసేవాడు, తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకునే ఆంజనేయ స్వామికి ఇవే నా ప్రణామములు.
6. భయ నివారణ మంత్రం
"ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్"
అర్థం: పరమశివుని రుద్రావతారమైన, సకల భయాలను పారద్రోలి శత్రువులను నాశనం చేసే హనుమంతునికి నా నమస్కారాలు.
7. హనుమాన్ చాలీసా - మంగళ శ్లోకం
"పవనతనయ సంకట హరన, మంగళ మూరతి రూప్..రామ లఖన సీతా సహిత, హృదయ బసహు సుర భూప్"
అర్థం: ఓ వాయుపుత్రా, కష్టాలను కడతేర్చేవాడా, శుభాలను కలిగించే మంగళ స్వరూపా.. దయచేసి సీతారామ, లక్ష్మణులతో సహా నీవు ఎల్లప్పుడూ నా హృదయంలోనే కొలువై ఉండు స్వామీ
మంత్ర పఠనానికి సరైన విధానం
-హనుమాన్ జయంతి రోజున లేదా ప్రతి మంగళ, శనివారాల్లో ఉదయాన్నే స్నానం చేసి ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించాలి.
-స్వామివారి పటానికి సింధూరం బొట్టు పెట్టి, ఎర్రటి పూలతో అలంకరించాలి.
-నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి, తులసి మాల లేదా రుద్రాక్ష మాలతో పై మంత్రాలలో మీకు అనువైన దానిని 108 సార్లు జపించాలి.
-మంత్రం చదివేటప్పుడు మనసును పూర్తిగా స్వామివారి పాదాల దగ్గర లగ్నం చేయాలి.
Disclaimer: మతవిశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనిని నిరూపించడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.



Click it and Unblock the Notifications