Latest Updates
-
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య!
నా చావుకు కారణం కేటీఆర్ - మాజీ మహిళా కార్యకర్త సంచలన పోస్ట్ !
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ కార్యకర్త ఆశాప్రియ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. తన చావుకు కారణం కేటీఆర్ అంటూ సంచలన పోస్ట్ పెట్టారు. ఈ మేరకు ఆ పోస్టులో.. బీఆర్ఎస్ సోషల్ మీడియా తనను వేధింపులకు గురి చేస్తుందని పేర్కొన్నారు. తన చావుకు PJMR, HS, KTR కారణం అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అంతే కాకుండా ఆ పోస్టులో.. కొన్ని గంటల్లో తన నుంచి ఎలాంటి పోస్ట్ రాకుంటే చనిపోయాననే అర్థం అని తెలిపారు. వేధింపులకు సంబంధించిన ఆధారాలు అన్నీ తన వాట్సాప్ సెల్ఫ్ చాట్‌లో ఉన్నాయని.. తనపై వేధింపులకు ఎవరు కారణం అనేది అక్కడ ఉంటుందని చెప్పారు. ఇదే తన మరణ వాంగ్మూలం అని కేసు పెడితే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకువస్తుందని.. అందుకే తాను చనిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

కేటీఆర్ నువ్వు ఏం మనిషివి ? నీ మనుషులు ఏం మాట్లాడుతున్నారు నా గురించి అంటూ ప్రశ్నించారు. పార్టీలో ఉండే మహిళలతో నీకు సంబంధం ఉందని తన ఫోన్ లో చెప్పారని ఆరోపించారు. మాట్లాడిన సాక్ష్యాలు బయటపెట్టాలా అని ఏంది అని నిలదీశారు. తనపై వేధింపులకు పాల్పడుతున్న పిల్ల జమిందార్‌ను తెలిసి కూడా పక్కన పెట్టుకుని ఫోటోలు దిగుతున్నావ్ అంటే.. నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావని అర్థం అంటూ ఆరోపించారు.
గతంలో ఆశాప్రియ బీఆర్ఎస్ కార్యకర్తగా పార్టీలో ఎంతో చురుకుగా ఉండేవారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పార్టీకి మద్దతుగా పోస్టులు చేసేశారు. అయితే ఓ నేత వేధింపుల కారణంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతకు ముందు పార్టీలో ఒక వెదవ ఉన్నాడు...వాడికి తప్ప ఎవరికి సపోర్ట్ చేసినా అడ్డమైన లింకులు పెట్టి నరకం చూపిస్తాడు అంటూ ఆశ ప్రియా ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. సూసైడ్ అటెంప్ట్‌కు ముందు 'కేటీఆర్ అన్న ఈ చెల్లెలు పిలుపు ఇదే చివరిసారి అవుతుంది.. ఒక్కసారి పలుకు అన్నా అంటూ ఎక్స్ లో చివరి పోస్ట్ పెట్టారు.
Credit: Oneindia



Click it and Unblock the Notifications
