Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
బంగారం ధరలు కుప్పకూలబోతున్నాయి.. సంచలన నివేదికను విడుదల చేసిన HSBC
బంగారం ధరలపై గుడ్ న్యూస్.. త్వరలో ధరలు కుప్పకూలబోతున్నాయి. HSBC తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026లో బంగారం ధరలు అత్యంత పదునైన హెచ్చుతగ్గులను ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటివరకు బంగారం మార్కెట్‌లో కనిపించిన స్థిరమైన పెరుగుదల ధోరణి.. వచ్చే ఏడాది పూర్తిగా అదే రీతిలో కొనసాగకపోవచ్చని బ్యాంక్ స్పష్టం చేసింది. ప్రస్తుత ధరలతో పోలిస్తే, ఒక వైపు బలమైన ర్యాలీలు కనిపించవచ్చునని, మరో వైపు గణనీయమైన దిద్దుబాట్లు కూడా చోటుచేసుకునే అవకాశం ఉందని HSBC అంచనా వేస్తోంది.
బ్యాంక్ విశ్లేషణ ప్రకారం.. ఇటీవలి కాలంలో Gold ధరలు వేగంగా పెరగడం వల్ల మార్కెట్ ఇప్పటికే కొంత ఓవర్‌బాట్ స్థితిలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో ధరలు కొంత సరిదిద్దుకునే అవకాశం ఉందని HSBC భావిస్తోంది. ముఖ్యంగా, ఈ ఏడాది వరకు కొనసాగుతున్న ప్రధాన కేంద్ర బ్యాంకుల వడ్డీ రేటు కోతల చక్రం ముగింపు దశకు చేరుకుంటే.. బంగారం ధరలపై ఒత్తిడి మరింత పెరగవచ్చని బ్యాంక్ హెచ్చరించింది. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలను నిలిపివేయడం లేదా మరింత ఆలస్యం చేయడం జరిగితే, బంగారం ధరలో మార్పులు మరింత వేగంగా జరిగే అవకాశముందని పేర్కొంది.

ఈ కారణాల వల్ల.. 2026 సంవత్సరానికి సంబంధించిన సగటు బంగారం ధర అంచనాను HSBC స్వల్పంగా తగ్గించింది. గతంలో ఔన్సుకు సగటు ధరను 4,600 డాలర్లుగా అంచనా వేసిన బ్యాంక్.. ఇప్పుడు దానిని 4,587 డాలర్లకి తగ్గించింది. ఇది ఇప్పటి మార్కెట్ ధరల కంటే సుమారు 4 శాతం ఎక్కువగానే ఉన్నప్పటికీ.. ముందు అంచనాలతో పోలిస్తే కొంత సంయమనం కనిపిస్తోంది. బ్యాంక్ అంచనా ప్రకారం, సంవత్సరం చివరి నాటికి బంగారం ధరలు మళ్లీ ప్రస్తుత స్థాయిలకు దగ్గరగా స్థిరపడే అవకాశం ఉంది.
అయితే, బంగారం ధరలపై మద్దతు ఇచ్చే అంశాలు పూర్తిగా కనుమరుగవ్వలేదని HSBC స్పష్టం చేసింది. ముఖ్యంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలకు కీలక మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, రాజకీయ అస్థిరతలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతలు తీవ్రతరం అయితే, 2026 మొదటి ఆరు నెలల్లోనే బంగారం ధరలు ప్రస్తుత స్థాయిల నుంచి 13 శాతం కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ అంచనా వేసింది. అటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత ఆశ్రయంగా బంగారాన్ని ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని నివేదిక చెబుతోంది.
ఇదే సమయంలో పరిస్థితులు శాంతిస్తే లేదా ఫెడ్ రేటు కోతలను పూర్తిగా నిలిపివేస్తే, బంగారం ధరలు ప్రస్తుత స్థాయిల నుంచి 11 శాతం వరకు తగ్గే అవకాశం కూడా ఉందని HSBC హెచ్చరించింది. అంటే 2026లో బంగారం మార్కెట్ ఒకే దిశలో కాకుండా, రెండు వైపులా తీవ్ర కదలికలను చూపే అవకాశం ఉందన్న మాట. ఈ హెచ్చుతగ్గుల నేపథ్యంలో, HSBC 2026లో బంగారం ధరలు ఔన్సుకు 3,950 డాలర్ల నుంచి 5,050 డాలర్ల మధ్య పరిధిలో కదలాడవచ్చని అంచనా వేసింది. సంవత్సరం చివరికి ధరలు సుమారు 4,450 డాలర్ల వద్ద ముగియవచ్చని కూడా పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
Credit: Goodreturns



Click it and Unblock the Notifications











