Latest Updates
-
జలుబు, దగ్గును మాయం చేసే చెట్టినాడ్ ఉల్లిపాయ రసం.. ఈ మసాలాతో చేస్తే టేస్ట్ అదుర్స్! -
రోజూ ఒకే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ సీక్రెట్ హోటల్ స్టైల్ పప్పు ట్రై చేయండి -
సోయా పుట్టు ఎప్పుడైనా వండుకున్నారా? తస్సాదియ్యా వేడి వేడి అన్నంలో కలిపితే నా సామి రంగా.. -
ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు ఆకుపచ్చ, బ్లూ కలర్ గౌన్స్ మాత్రమే ఎందుకు ధరిస్తారో తెలుసా? -
దీపావళి స్పెషల్ స్వీట్..తమిళనాడు సంప్రదాయ ఉక్కరై మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
క్యాన్సర్ రాకుండా కాపాడే 5 ఆహారాలు ఇవే.. -
దీపావళి స్పెషల్ స్నాక్.. ఇంట్లోనే ఈజీగా క్రిస్పీ కారప్పూస మిక్చర్ చేసుకోండిలా.. -
ఇడ్లీ, దోశలోకి హోటల్ స్టైల్ చిన్న ఉల్లిపాయ చట్నీ..యమా రుచి బాసూ.. -
చికెన్ మజ్జిగ పులుసు..నెలల పాటు నాలుక మీద ఉండేపోయే రుచి..ఈజీగా చేసేయొచ్చు.. -
అరటిపండ్లు రెండు రోజులకే నల్లబడుతున్నాయా? ఇలా చేస్తే 4 వారాలైనా ఫ్రెష్ గా ఉంటాయి!
బంగారం కొనడంపై ఆశలు వదిలేసుకోవడమే ఇక..2026లో ధరల పెరుగుదలపై బ్యాకింగ్ నిపుణుల హెచ్చరికలు ఇవిగో..
2025లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తూ నింగిని తాకాయి. ఈ పెరుగుదల, ప్రధానంగా, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, గ్లోబల్ డిమాండ్, ద్రవ్యోల్బణ భయాల కారణంగా జరిగిందని చెప్పవచ్చు. ఈ ఆందోళనతో ఇన్వెస్టర్లు రిస్క్ఫ్రీ ఆస్తుల వైపు మళ్లి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి. మరి 2026లో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి.. పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే దానిపై నిపుణులు పలు అంచనాలు వెల్లడిస్తున్నారు.
ప్రముఖ ఆర్థిక నిపుణులు అంచనాల ప్రకారం.. 2026 చివరికి బంగారం ధర ఔన్సుకు 4,900 డాలర్ల నుంచి 5,055 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంచనాలు మార్కెట్లో ఉన్న బుల్లిష్ భావన, కేంద్ర బ్యాంకుల కొనుగోలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు తమ రిజర్వ్ డైవర్స్ఫికేషన్ కోసం Gold కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. ఇది ధరలకు పెరుగుదలకు కారణమవుతోంది.

JPMorgan అంచనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 760 నుంచి 840 టన్నుల వరకు బంగారం కొనుగోలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ కొనుగోలు ప్రక్రియ మార్కెట్లో లిక్విడిటీని తగ్గించి ధరలను పెంచే అంశంగా మారనుంది. అంతేకాక, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానం, వడ్డీ రేట్ల మార్పులు కూడా బంగారం ధరపై నేరుగా ప్రభావం చూపుతాయి. తక్కువ వడ్డీ రేట్ల యుగంలో, పెట్టుబడిదారులు హార్డ్ అసెట్లలో పెట్టుబడి పెంచి ధరలను పెంచనున్నారు.
2026లో బంగారం ధరలు పెరుగుదల చూపే ప్రధాన కారణాలలో ఒకటి భౌగోళిక రాజకీయాలు. వెనిజులా, మధ్యప్రాచ్యం, ఇతర ప్రాంతాల్లో ఉన్న అస్థిర పరిస్థితులు పెట్టుబడిదారులను సేఫ్-హెవెన్ ఆస్తుల వైపు మళ్లించాయి. దీని కారణంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లు ఇప్పటికే సరఫరా పరిమితులు, పెట్టుబడిదారుల సంకేతాలు, ఫెడ్ ఆర్థిక విధానాలపై కచ్చితంగా దృష్టి సారిస్తున్నాయి.
భవిష్యత్తులో బంగారం ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన.. వెండి అయితే ఏకంగా రూ. 3 లక్షలు పై మాటే..
నిపుణులు పేర్కొన్న వివరాల ప్రకారం, భద్రతా పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, మరియు మానిటరీ విధానాల ఆధారంగా బంగారం ధరలు 10 నుంచి 60 శాతానికి పెరుగవచ్చు. అయితే అస్థిర వాతావరణంలో 20 శాతం వరకు మధ్యంతర దిద్దుబాట్లు కూడా ఎదుర్కోవచ్చు. పారిశ్రామిక డిమాండ్ పెరుగుతూ, సరఫరా బిగుతు కొనసాగితే, ధరలు ప్రస్తుత స్థాయిల నుండి 40 శాతానికి పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఖాబట్టి పెట్టుబడిదారులు బంగారంలో నేరుగా పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక, రాజకీయ, విధానపరమైన అన్ని అంశాలను పరిశీలించడం అవసరం. 2026లో బంగారం ధరలు తిరిగి బలమైన పెరుగుదలను చూపే అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
Credit: Goodreturns



Click it and Unblock the Notifications
