బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు వస్తే వెంటనే కొనుగోలు చేయండి..పసిడి ప్రియులకు నిపుణులు కీలక సూచన..

By Borra Hazarathaiah

బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు. పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా భావించే పసిడిలో పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే సందిగ్ధ పరిస్థితికి వచ్చారు. దీనికి కారణం ధరల మార్పు అర్థం కాకపోవడమే. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు కుప్పకూలుతున్నాయి. అదే సమయంలో మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు కూడా బంగారం కొనుగోలు చేయడం మానుకున్నారు.పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలుపై పసిడి ప్రియులు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే ధరలు ఎలా ఉంటాయనే దానిపై వారికి క్లారిటీ రావడం లేదు.

2026 ఫిబ్రవరి 11 నాటికి Gold ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా తీవ్ర వోలాటిలిటీ (తారుమారు)ని చూపిస్తున్నాయి. ఒక రోజు భారీగా పెరిగితే, మరుసటి రోజు తగ్గిపోవడం ఇప్పుడు సాధారణంగా మారింది. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి, అమెరికా వడ్డీ రేటు అంచనాలు, డాలర్ బలం-బలహీనత, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరపై నేరుగా ప్రభావం చూపుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


gold price prediction today gold price forecast gold rate volatility gold prices today gold market outlook near term gold volatility gold investment strategy gold safe haven demand gold price movement gold rates outlook gold investors advice gold price trends gold trading strategy gold price analysis

కమోడిటీ మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ప్రస్తుతం Gold సేఫ్-హేవెన్ ఆస్తిగా మళ్లీ డిమాండ్ పొందుతోంది. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లలో ఈక్విటీ ఒత్తిడిలో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని ఆశ్రయించడం సహజం. అయితే, తక్షణ కాలంలో ధరలు ఒకే దిశగా కదలవని.. అప్ & డౌన్ మోషన్ కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేట్లపై స్పష్టత ఇవ్వని పరిస్థితుల్లో బంగారం ధరలు సెన్సిటివ్‌గా మారాయి. Fed వడ్డీ తగ్గింపుల సంకేతాలు ఇస్తే బంగారం ధరలు మరింత బలపడే అవకాశం ఉందని, లేదంటే లాభాల స్వీకరణ (profit booking) వల్ల తాత్కాలికంగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు.

బంగారం, వెండి ధరలు పతనం.. MCX లో కుప్పకూలిన సిల్వర్ ఫ్యూచర్స్.. ఈ రోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

MCX బంగారం - కొనుగోలు స్థాయి: MCX గోల్డ్‌లో రూ. 1,52,000 నుంచి రూ. 1,54,000 (10 గ్రాములకు) మధ్య బలమైన మద్దతు కనిపిస్తోంది. ఈ స్థాయిల వద్ద ధరలు పడితే కొనుగోలు ఆసక్తి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా లాభాలు బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

Resistance (నిరోధ స్థాయి): బంగారం ధరలు పైకి చూస్తే రూ. 1,58,000 నుంచి రూ. 1,60,000 స్థాయిలు కీలక నిరోధంగా ఉన్నాయి. ఈ స్థాయిని దాటితే బంగారం కొత్త గరిష్టాలకు వెళ్లే అవకాశం ఉందని అంచనా.ఆ సమయంలో కొనుగోలు చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

వెండి ధరల పరిస్థితి: బంగారంతో పోలిస్తే వెండి ధరలు మరింత అగ్రెసివ్ ర్యాలీ చూపుతున్నాయి. పరిశ్రమల డిమాండ్ పెరగడం వల్ల MCX సిల్వర్ ధరలు రూ. 3 లక్షలు/కిలో స్థాయిని దాటాయి. అయితే, వెండిలో వోలాటిలిటీ ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల ట్రేడింగ్‌లో జాగ్రత్త అవసరమని నిపుణుల సూచిస్తున్నారు.

పెట్టుబడిదారులకు కీలక సూచనలు : షార్ట్-టర్మ్ ట్రేడర్లు వోలాటైల్ మార్కెట్‌లో స్పష్టమైన సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. స్టాప్ లాస్ తప్పనిసరి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక లాంగ్-టర్మ్ ఇన్వెస్టర్లు ధరలు పడినప్పుడు దశలవారీగా కొనుగోలు (buy on dips) వ్యూహం అనుసరించవచ్చని చెబుతున్నారు. ఈట్రేడర్లు US CPI, Fed సమావేశాల వ్యాఖ్యలు, డాలర్ ఇండెక్స్ వంటి అంశాలను నిరంతరం ఫాలో కావాలని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం బంగారం ధరలు అనిశ్చితి - వోలాటిలిటీ మధ్య ప్రయాణం చేస్తున్నాయి. తక్షణ కాలంలో పెద్ద ట్రెండ్ ఏర్పడే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాల దృష్టిలో బంగారం ఇప్పటికీ బలమైన పెట్టుబడి ఎంపికగానే నిపుణులు చూస్తున్నారు. కాబట్టి, తొందరపాటు నిర్ణయాలకంటే సమాచారం ఆధారంగా, వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం పెట్టుబడిదారులకు మేలుగా ఉంటుందని చెబుతున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Credit: Goodreturns

Story first published: Wednesday, February 11, 2026, 7:00 [IST]
Desktop Bottom Promotion