Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే! -
పవర్ ఆఫ్ హనుమాన్: ఆంజనేయస్వామి ఆలయం తొలగించబోయిన అధికారులు..4 రోజులైనా ఇంచు కూడా కదలట్లేదు! -
సంతానలేమితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడిలో గర్భాశయం.. ఈ విచిత్ర సంఘటనకి కారణాలేంటి.? -
వర్షాకాలంలోనూ ఉక్కపోత.. శరీరంలో వేడిని నిమిషాల్లో తగ్గించే సూపర్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇదే.! -
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం
బంగారం ధరలపై గోల్డ్‌మన్ సాచ్స్ షాకింగ్ నివేదిక.. 2026లో పెరుగుదల ఎంత వరకు ఉంటుందంటే..
గత కొద్ది సంవత్సరాల నుంచి బంగారం పెట్టుబడిదారులకు లాభాల పంట పండించింది. గత ఏడాది అయితే ఇన్వెస్టర్లు భారీగా లాభాలను ఆర్జించారు. సామాన్యులు మాత్రం పసిడి కొనాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. అయితే ఈ ఏడాది Gold ధరలు ఎలా ఉండబోతున్నాయి. ఇదే జోరు కొనసాగుతుందా అనే దానిపై పలువురు నిపుణులు, ఆర్థిక సంస్థలు తమ అంచనాలను విడుదల చేశాయి.
ప్రధాన ఆర్థిక సంస్థలు, పెట్టుబడి బ్యాంకుల విశ్లేషకులు సాధారణంగా బంగారంపై అలర్ట్ గా ఉంటారు. గోల్డ్‌మన్ సాచ్స్, JP మోర్గాన్, డ్యూష్ బ్యాంక్, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థలు 2026 చివరి నాటికి బంగారం ధరలు ఔన్సుకు (31.1 గ్రాముల Gold) 4 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల పరిధిలో ఉంటాయని అంచనా వేస్తున్నాయి. JP మోర్గాన్ అయితే 5,055 డాలర్ల వరకు పెరుగుతుందని అంచనా వేసింది.దీనికి మద్దతుగా కేంద్ర బ్యాంక్ రిజర్వ్ కొనుగోలు, ద్రవ్య విధాన సడలింపును సూచించింది. మన కరెన్సీలో చెప్పాలంటే బంగారం ధర ఔన్సుకు రూ. 3.3 లక్షల నుంచి రూ. 4. 25 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

బంగారం ధరలను మద్దతు ఇచ్చే ముఖ్య కారణాలను ఓ సారి మనం చూసుకున్నట్లయితే.. సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, వడ్డీ రేటు కోతలు, సురక్షిత స్వర్గధామ డిమాండ్ గా బంగారాన్ని భావించడం, ETFలు, సంస్థాగత పెట్టుబడులను చెబుతున్నారు. అయితే, స్వల్పకాలికంగా చిన్న కొలతల తగ్గుదలలు సంభవించే అవకాశం ఉందని ఊరటనిచ్చే వార్తను చెబుతున్నారు. US డాలర్ బలపడడం, వాస్తవ వడ్డీ పెరగడం, లేదా కేంద్ర బ్యాంకుల విధానాలు అంచనాలకు అనుగుణంగా కాకపోవడం వంటి పరిస్థితులు వల్ల బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. మెజార్టీ నిపుణులు మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశాన్నే సూచిస్తున్నారు.
బంగారం వెండి కాదు ఈ లోహానికే ఇకపై పుల్లు డిమాండ్.. ఎగబడి కొంటున్న పెట్టుబడిదారులు
ఇక పెట్టుబడిదారులు బంగారాన్ని.. భౌతిక బంగారం (నాణేలు, కడ్డీలు), గోల్డ్ ETFలు/ETCలు, బంగారు మైనింగ్ స్టాక్‌లు, వంటి రూపాల్లో పొందవచ్చు. బంగారం ధరలపై కేంద్ర బ్యాంక్ డిమాండ్, వడ్డీ రేటు విధానం, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి, సంస్థాగత పెట్టుబడులు ప్రధానంగా ప్రభావం చూపిస్తాయి. 2026లో బంగారం సాధారణంగా ఔన్సుకు 4 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల పరిధిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు దారులు, పెట్టుబడిదారులు ఆచితూచి ట్రేడ్ చేయాలని వారు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
Credit: Goodreturns



Click it and Unblock the Notifications
