Latest Updates
-
రాహు నక్షత్రంలోకి శుక్రుడు: భాగస్వామితో గొడవలు.. అక్టోబర్ 24 వరకు వెంటాడనున్న దురదృష్టం -
అమెరికాలో చీప్,భారత్ లో కాస్ట్లీ : ఇండియాలోనే తయారవుతున్నా..ఐఫోన్ల ధరలు ఎందుకు మండిపోతున్నాయి? -
ఉద్యోగులకు అలర్ట్..మీ గుండెను దెబ్బతీస్తున్న 4 ప్రధాన కారణాలివే! -
స్వీట్ షాప్ స్టైల్ మలై బర్ఫీ..ఈ సింపుల్ రెసిపీ తెలిస్తే ఇకపై బయట కొనరు! -
అంగారకుడి నీచ సంచారం.. ఈ 4 రాశుల వారు కళ్లు తెరిచి ఉండకపోతే పక్కాగా నష్టపోతారు! -
పెళ్లిళ్లలో ఇది లేకుండా భోజనం పూర్తి కాదు.. నోరూరించే ఆంధ్రా స్టైల్ గోంగూర శనగపప్పు పులుసు.! -
షాపులో దొరికే కల్తీ బెల్లం వద్దు.. ఇంట్లోనే స్వచ్ఛమైన బెల్లం చేసుకోండిలా! -
దానిమ్మ గింజలు ఏ రంగులో ఉంటే ఎక్కువ పోషకాలు లభిస్తాయో తెలుసా.. USDA డేటా ఇదే.! -
చిట్టి గణేశుడిని ఇంట్లోకి తెస్తున్నారా.. సంప్రదాయం ప్రకారం ఎన్ని రోజులు పూజించాలో తెలుసా.? -
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.!
బంగారం ధరలు.. పీఛే ముడ్ !!
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ జుమ్ అంటూ పెరిగాయి. మొన్నటివరకు కుప్పకూలినట్లు కనిపించిన పసిడి రేట్లు పీఛే ముడ్ అయ్యాయి. మళ్లీ ఎగబాకడం మొదలు పెట్టాయి. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగడం, స్పాట్ మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు అధికంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ ఉదయం ట్రేడింగ్ సెషన్ లో 10 గ్రాముల బంగారం ధర 0.64 శాతం పెరిగింది. 1,61,582 వద్ద స్థిరపడింది. అదే సమయంలో వెండి ధర కూడా భారీగా ఎగబాకింది. 3.05 శాతం మేర పెరిగి కిలోకు 2,79,102 రూపాయలకు చేరుకుంది.
ముంబై స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,510గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 1,47,990కి లభిస్తోంది. గత నెలలో బంగారం, వెండి ధరలు కీలక రికార్డులను నెలకొల్పిన విషయం తెలిసిందే. 10 గ్రాముల బంగారం ధర రూ. 1,80,000కు మించి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరగా, వెండి ధర కిలోకు 4,20,000తో సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఆ తర్వాత అవి క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్లు రూ. 1,48,149 కాగా, 24 క్యారెట్లు రూ. 1,61,960. అహ్మదాబాద్‌లో 22 క్యారెట్లు రూ. 1,48,350, 24 క్యారెట్లు రూ. 1,61,9250. పుణె, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,895గా ఉంది. ఆయా నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,580కి చేరింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 16,582, 22 క్యారెట్లు - రూ. 15,200, 18 క్యారెట్లు - రూ. 13,010
ముంబై..
24 క్యారెట్లు - రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 12,355
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 12,355
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 12,355
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 12,355
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 16,473, 22 క్యారెట్లు- రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 12,355
Credit: Oneindia



Click it and Unblock the Notifications
