Latest Updates
-
రాత్రి అన్నం మిగిలిందా? ఉదయం ఇలా హోటల్ స్టైల్ క్రిస్పీ దోసె వేసుకోండి! -
ఈ టేస్ట్ నెవర్ బిఫోర్.. సండే స్పెషల్ పాలకూర చికెన్, చిక్కటి గ్రేవీకి మైమరిచిపోతారు.! -
సెప్టెంబర్ 17 న కన్యారాశిలోకి సూర్యుడు.. నెల రోజులపాటు మహర్జాతకులు అంటే వీరే.! -
పసిపిల్లలకు డ్రై ఫ్రూట్స్ ఎప్పటినుంచి ఇవ్వాలి? ఎలా పెడితే ఆరోగ్యానికి మంచిది? -
వినాయక చవితి స్పెషల్: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా చేయండి.! -
గణేశుడి విగ్రహం వెనుక వైపు చూడవచ్చా, తొండం ఏ వైపు ఉండాలి.. శాస్త్రం చెబుతోంది ఇదే.! -
ఒక్కసారి చేస్తే 4 నెలల పాటు నిల్వ ఉండేలా సాంబార్, రసం పొడులు.. హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే.! -
ఒకే ఒక్క స్పూన్ నూనెతో హై ప్రొటీన్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ రైస్..ఈజీగా చేసుకోండిలా.. -
నెయ్యి ఉపవాసంతో అద్భుతాలు!..ఇంటర్నెట్ ను ఊపేస్తున్న కొత్త ఫిట్ నెస్ ట్రెండ్! -
ఎప్పుడైనా లాహోరీ పన్నీర్ కుర్మా టేస్ట్ చేశారా? నోట్లో పెట్టుకుంటే స్వర్గమే!
కుప్పకూలుతున్న బంగారం ధరలు: పండగ సీజన్ లో..!!
గత వారం బంగారం, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అయిదు ట్రేడింగ్ రోజుల్లో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టగా, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో మాత్రం స్వల్పంగా పెరిగాయి. మరోవైపు- వెండి ధరలు ఈ రెండు ట్రేడింగ్ మార్కెట్లలోనూ గణనీయమైన మార్పులను చవిచూశాయి. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రకారం గత అయిదు ట్రేడింగ్ రోజుల్లో బంగారం ధరలు తగ్గాయి.
ఈ నెల 12వ తేదీ సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,32,710 ఉండగా, 19న శుక్రవారం సాయంత్రం నాటికి ఇది రూ. 1,31,779కి తగ్గింది. వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 931 తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో గత వారం స్వల్ప పెరుగుదల నమోదైంది. 12న గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ. 1,33,622 ఉండగా, శుక్రవారం నాటికి రూ. 1,34,206 వద్ద ముగిసింది. ఈ లెక్కన MCXలో వారం రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 584 పెరిగింది.

దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,31,779, 22 క్యారెట్లు రూ. 1,28,620, 18 క్యారెట్లు ధర రూ. 1,06,740లుగా నమోదైంది. అదే సమయంలో వెండి ధరలు మాత్రం రికార్డులు నెలకొల్పాయి. MCXలో గత వారంలో వెండి ధరలు పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి రూ. 2,00,000ను అధిగమించాయి. శుక్రవారం స్వల్పంగా తగ్గినప్పటికీ, ఈ మొత్తం నుంచి దిగట్లేదు. డిసెంబర్ 12న కిలో వెండి ఫ్యూచర్స్ ధర రూ. 1,92,851 ఉండగా, 19న శుక్రవారం నాటికి 439 తగ్గింది. అయినప్పటికీ దీని ధర రూ 2,08,000లకు పైమాటే. వారం రోజుల్లో కిలో వెండి ధర రూ. 15,149 మేర పెరిగింది.
ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (గ్రాముకు)
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 13,528, 22 క్యారెట్లు - రూ. 12,400, 18 క్యారెట్లు - రూ. 10,345
ముంబై..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు - రూ. 10,064
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 13,418, 22 క్యారెట్లు- రూ. 12,300, 18 క్యారెట్లు- రూ. 10,064
Credit: Oneindia



Click it and Unblock the Notifications
